Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయశాంతి “కర్తవ్యం”… అనుష్క “అరుంధతి”… సమంత “మా ఇంటి బంగారం”

June 23, 2026 by M S R

.

(   గోపు విజయకుమార్ రెడ్డి   ) … విజయశాంతి కి ఒక “కర్తవ్యం”, అనుష్క కి ఒక “అరుంధతి”, సమంత కి ఒక “మాఇంటి బంగారం”

….. ఇదీ ప్రస్తుతం ఇండస్ట్రీ టాక్… యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఓ కథతో సమంత చాన్నాళ్ల తరువాత చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ‘మా ఇంటి బంగారం’ వసూళ్లలో ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది… నిజానికి ఈ వసూళ్లు ఎవరూ ఊహించలేదు మొదట్లో…

Ads

మా ఇంటి బంగారం, నిజంగానే సమంత ఇంట బంగారం… మొదటి నాలుగు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్. సాలిడ్‌‌గా ఇంకో వీకెండ్ ఎలాగూ ఉంటుంది థియేటర్లలో… ఎంత లేదన్నా ఇంకో 20 కోట్లు, అంటే దాదాపు 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఛాన్స్ ఉంది (అన్ని భాషలు + అన్ని ఏరియాస్) కలిపి…

సినిమా మొత్తం నిర్మాణ వ్యయం 10 కోట్లు, సమంత రెమ్యూనరేషన్ 4 కోట్లు, మార్కెటింగ్- ప్రమోషన్ 4 కోట్లు…  అంతా కలిపి 20 కోట్లు అయి ఉంటుందని ఓ అంచనా… థియేటర్ మీద ఒక 25 కోట్లు, OTT – డిజిటల్ – ఆడియో మీద ఒక 30 కోట్లు… వెరసి 20 కోట్ల పెట్టుబడికి దాదాపు 55 కోట్ల రాబడి…

ఇవ్వాళారేపు టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలకే GST లూ ఇవ్వట్లేదు… అటువంటిది ఒక ఫిమేల్ స్టార్ ఓరియెంటెడ్ సినిమా, అదీ సినిమా ఇండస్ట్రీ ఆఫ్ సీజన్ అని చెప్పుకునే జూన్ మొదటి వారంలో రిలీజై, ఈ నంబర్స్ చేయడం చాలా గ్రేట్.. ఇది సినిమా మార్కెటింగ్ – కంటెంట్ పరంగా ఒక ఐ ఓపెనర్ ఇండస్ట్రీకి…

ఈ సినిమా రన్‌కు ప్రధాన ఆకర్షణ సమంతే, అందులో ఎవరికీ ఏ డౌటూ లేదు… చాలా రోజుల తర్వాత ఇంటిల్లిపాదీ సినిమాలకి వెళ్తున్నారు, మరీ ముఖ్యంగా లేడీస్ సమంతలో తమని తాము చూసుకుంటున్నారు.. ఒక చిన్న కథ, ఒక మంచి ప్రెజెంటేషన్, మన అనిపించే నేటివిటీ.

ప్రతి ఇంటిలో ఉండే ఎమోషన్స్- ఫీలింగ్స్… అన్నిటికంటే ఎక్కువగా ఒక స్త్రీకి కుటుంబం అంటే ఉండే ప్రేమ- కన్సర్న్… సమాజంలో ఆడవారికి సహాయం చేసి లొంగతీసుకోవడం అనే ఆలోచన తప్పు అనే అంశాలతో సాధారణ మహిళలు బాగా కనెక్ట్ అయ్యారు…

అలాగని సినిమా ఒక గొప్ప కళాఖండం అందామా, అదీ కాదు… అలాగని తీసి పారేసే సినిమా కూడా కాదు… ఇవ్వాళారేపు వస్తున్న రొడ్డకొట్టుడు చెత్త ఫార్మాట్ సినిమాల మధ్య ఇది కచ్చితంగా ఒక మంచి సినిమా… కళ్లు మూసుకొని వెళ్ళండి మీ అమ్మని, మీ భార్యని, మీ అక్కాచెల్లెళ్లను తీసుకుని… ఎందుకంటే ఈ సినిమాలో మీరు నిజ జీవితంలో ప్రేమిచే ప్రతి మహిళా ’’షీరో” నే… చివరి మాట ఇది సమంతకు “అతడు “…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విజయశాంతి “కర్తవ్యం”… అనుష్క “అరుంధతి”… సమంత “మా ఇంటి బంగారం”
  • చైనా కంట్లో నలుసు! – హఠాత్తుగా ఇండియాలో వాలిన బర్మా చీఫ్!
  • KCR’s Voice – ఆ మంత్రి కడిగేశాడట- ఈయన చూశాడట !!
  • జంబలకిడిపంబ! కాన్సెప్టే బ్లాక్‌ కామెడీ, ఆపై ఈవీవీ మార్క్!!
  • Nagabandham … పెద్ద పేరున్న టీమ్ కాదు- కానీ పాన్ ఇండియా బజ్!
  • TMC Crisis – మమత సెల్ఫ్‌గోల్! అష్ట దిగ్బంధనంలో అభిషేక్!
  • 12 ఏళ్లలో ఏడుగురు ప్రధానులు? – బ్రిటన్ రాజకీయాల ‘నగుబాట’
  • కామాఖ్య..! అంబుబాచీ రోజులు..! రజస్వల కాదు, రుతుస్రావం..!!
  • ‘టైటానిక్‌ ’తర్వాత ఓ చారిత్రక నేపథ్యంపై ఓ అందమైన ప్రేమకథ!
  • ఇక్కడ ప్రవీణ్- అక్కడ అన్నామలై… రెండూ పరస్పర భిన్న ధృవాలు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions