.
త్రిష చాలా తెలివైంది… మీడియా చాలా తెలివితక్కువ గలది… నిన్నటి వార్తలు చూస్తే అర్థమైంది అదే… మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, వెబ్ మీడియా, తెలుగు మీడియా ఎట్సెట్రా ఆల్ మీడియా నిన్నంతా ఊదరగొట్టాయి… తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌కూ త్రిషకూ బ్రేకప్, చెడింది, ఎక్కడో తేడా కొట్టింది,, అందుకే బర్త్‌డే విషెస్ కూడా చెప్పలేదు అని బోలెడు వార్తలు…
ఎందుకయ్యా అంటే..? ఇన్‌స్టాలో విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేసింది అనే కారణం చూపించారు… అక్కడికి తమిళ మీడియా రకరకాల సమర్థన వార్తలను వెలువరించింది… అబ్బే, విజయ్ భార్య విడాకుల కేసుకు దరఖాస్తు చేసినప్పుడు త్రిష్ విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది, లీగల్ చిక్కులు వస్తాయేమోననే సందేహంతో… ఇది ఒక వాదన…
Ads
ఎహె, అసలు ఆమె ఇన్‌స్టాలో విజయ్‌ను మొదటి నుంచీ ఫాలో చేయదు, విజయ్ మీద పుష్కలంగా పోస్టులు పెడుతుంది తప్ప ఆమె విజయ్ ఫాలోయర్ కాదు అని మరో వాదన… కానీ తెలుగు మీడియా కూడా పుంఖానుపుంఖాలుగా రాసేసింది…
కొందరైతే ఇంకేముంది, విజయ్ తన మొదటి భార్యతో రాజీపడ్డాడు, విడాకుల కేసు వాపస్, విజయ్ ఇంటికి చేరిన భార్య అంటూ రాసుకొచ్చారు… కానీ ఆల్ హంబక్… త్రిష- విజయ్ సంబంధం పదిలంగానే ఉంది… మరి మేం బాగానే ఉన్నాంరా బాబూ అని జనానికి చాటాలంటే ఏం చేయాలి..?

ఇదే ఆలోచించిన త్రిష తన ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్ చేసింది… ‘నా జీవితానికి ఒక అర్ధాన్నిచ్చిన వ్యక్తికి… పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది… హ్యాపీ బర్త్‌డే పక్కన లవ్ సింబల్‌ను కూడా జత చేసింది…
త్రిష షేర్ చేసిన ఫొటోలో… విజయ్ కేకు దగ్గర నిల్చుని కేకు వైపు చూస్తూ నవ్వుతున్నాడు… త్రిష విజయ్ పక్కన నిల్చుని ఆయన వైపే చూస్తూ ఉంది… త్రిష పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టు పెట్టిన గంటలోనే 1.5 మిలియన్ల లైకులు వచ్చాయి…
ఎంత బలంగా వాళ్ల సంబంధం లేకపోతే… ఓ ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోను షేర్ చేయగలదు..! నడుమ ఏవేవో ఊహాగానాలతో పరువు తీసుకున్నది మీడియా మాత్రమే..!!
అన్నట్టు… ఆమె పోస్టు ఇదీ…
To the person who makes it all worth it,HBD❤️🧿
00.00✨
ఈ 00.00 ఏమిటీ అని చొక్కాలు చించుకోకండి… ఇది అర్థరాత్రి 12 గంటల సమయం… అంటే మరుసటి రోజు ప్రారంభమయ్యే క్షణం… సరిగ్గా ఆ సమయానికి నీకు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతున్నానోయ్ ప్రేమికా అని త్రిష విజయ్‌కు చెబుతున్నట్టు లెక్క..! ఈ ప్రేమ ఏ తీరాన్ని తాకనుందో ఇక చూడాలి..!!
Share this Article