Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాలకుడు చుక్కలు చూపిస్తే… SBI ఐతేనేం? ఎందుకు దిగిరాదు?

June 24, 2026 by M S R

.

మన పాలమూరు బిడ్డే, మనకు పనికొచ్చే బిడ్డే, తెలంగాణకు సాయం చేస్తాడు, పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటాడు అని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించాడు, ఆ పోస్టులోకి శెట్టిగారు చేరగానే ఆనందంగా అభినందనలు తెలిపాడు… కానీ..?

ఏ రాజకీయాలకు ప్రభావితం అయ్యాడో, అలాంటి వ్యక్తి ఎస్బీఐ వంటి అతి పెద్ద బ్యాంకు చైర్మన్‌ దాకా ఎలా ఎదిగాడో అర్థం కాదు, కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసే ఓ వ్యూహంలో చిక్కుకున్నాడు. రాయదుర్గం భూముల విక్రయంపై హైకోర్టుకెక్కాడు, కానీ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అనే ఖతర్నాక్ కేరక్టర్ అని మరిచిపోయాడు.

Ads

ఇజ్జత్ పోయే దగ్గర… ఇక మన మట్టి బిడ్డ అయితేనేం, ఇంకెవరయితేనేం? రేవంత్ రెడ్డి కస్సుమన్నాడు. ప్రధానికి, ఆర్బీఐకి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు సీరియస్ కంప్లయింట్లు చేయడమే కాదు… ఏకంగా ఎస్బీఐతో అన్ని ప్రభుత్వ వ్యవహారాల్ని కట్ చేయడానికి రెడీ అయిపోయాడు… ఇది ఊహించలేదు శ్రీనివాసులు శెట్టి…

ఎస్, పాలకుడు స్థిరంగా నిలబడితే… కొరడా పట్టుకుని రెడీ అయిపోతే ఎవరైనా దారికి వస్తారు, ఇదేదో చినికి చినికి గాలివానగా మారి తనను ముంచేట్టుంది అనే సోయి లేటుగా అర్థమైంది శ్రీనివాసులు శెట్టి గారికి… నష్టనివారణకు పూనుకున్నాడు. కోర్టు కేసు వాపస్ అంటున్నాడు. ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చినా సరే అంటున్నాడు.

అంతేనా..? మెట్రో సమగ్ర అధ్యయనానికీ తమ అనుబంధ ఎస్బీఐ క్యాప్స్‌ను ముందుపెట్టాడు. వెరసి కథ గాడిన పడింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పు జరిగిందా, ఎస్బీఐ తొందరపడిందా అనేది కాదు ప్రశ్న. ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించుకున్నాకే అడుగు వేయాలనే కనీస సోయి ది గ్రేట్ ఎస్బీఐ చైర్మన్‌కు లోపించింది అనేదే ముఖ్యాంశం.

ఇప్పుడేం జరుగుతుంది? ఎస్బీఐ లీడ్ బ్యాంకుగా కొనసాగుతుంది, ఆ బ్యాంకులో డిపాజిట్లకు ఢోకా లేదు, ఇతరత్రా లావాదేవీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐని ప్రథమ ప్రాధాన్యతతో చూస్తుంది. యవ్వారం చక్కదిద్దబడింది. (ఎస్బీఐ గనుక దిగిరాకపోతే రేవంత్ రెడ్డి ఇంకాస్త సీరియస్‌గానే వెళ్లాలని అనుకున్నాడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన యవ్వారం కదా…)

సరే, పరిస్థితి పట్టాలెక్కింది, వోకే. కానీ రేవంత్ రెడ్డిని అండర్ ఎస్టిమేట్ చేసిన హైప్రొఫైల్ కేరక్టర్లకు తను ఓ లెసన్ చెప్పాడు. అది ఎల్అండ్‌టీ కావచ్చు, అది ఎస్‌బీఐ కావచ్చు, కేసీయార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. తనను డిగ్రేడ్ చేయాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ, ప్లస్ పార్టీ అంతర్గత శక్తులెవరికైనా కావచ్చు. తను చెబుతున్నది ఒకటే. What may come, let it come. I will face it….

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాలకుడు చుక్కలు చూపిస్తే… SBI ఐతేనేం? ఎందుకు దిగిరాదు?
  • ఇళయరాజాతో ఏదో తేడా కొట్టింది! వంశీ హార్మోనియం అందుకున్నాడు!!
  • రోత ఆహార్యం! – ఒక సీఎం భార్యకే ఇలా డ్రెస్ సోయి లేకపోతే ఎలా?
  • భేష్ శ్రీచరణి! ఐసీసీ నంబర్ వన్ ర్యాంకింగ్- ఆషామాషీ కాదు!
  • ‘మెట్రోపై ముందడుగు’ – ప్రస్తుతానికి ఓ పే-ద్ద భేతాళ ప్రశ్న!
  • 00.00 – హేపీ బర్త్ డే డియర్ సీఎం… త్రిష చాలా తెలివైంది సుమీ!
  • రోజులు బాగాలేవు..! పెళ్లాల్నే కాదు, కాబోయే పెళ్లాలతోనూ బహుపరాక్..!!
  • అమ్మ కాగానే ఆట మానేయాలా? మరేం చేయాలి? ఇదీ 6R ఫార్ములా!
  • విజయశాంతి “కర్తవ్యం”… అనుష్క “అరుంధతి”… సమంత “మా ఇంటి బంగారం”
  • చైనా కంట్లో నలుసు! – హఠాత్తుగా ఇండియాలో వాలిన బర్మా చీఫ్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions