రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అశ్విన్ వైష్ణవ్ ప్రొఫైల్ నిన్న చెప్పుకున్నాం కదా… మాజీ ఐఏఎస్… రెగ్యులర్ పొలిటిషియన్ కాదు… వోట్లు సంపాదించలేడు… ఏ వర్గంలోనూ ఇమడలేడు… చెత్తా పాలిటిక్స్ చేతకావు… కానీ మోడీ తనను సెలెక్ట్ చేసుకున్నాడు, ఓ బృహత్తర బాధ్యతను ఇచ్చాడు… ఇది కదా మనం చెప్పుకున్నది…. అబ్బే, ఏడేళ్లలో ఈ ఒక్కడేనా కాస్త పనికొచ్చే నాన్-పొలిటికల్ ఎంపిక..? ఇన్నేళ్లలో ఇంకెవ్వరూ దొరకలేదా అని కొక్కిరించాడు ఓ మిత్రుడు… మరొకాయన ఉన్నాడు… నిశ్చయంగా మంచి ఎంపిక… ఆ ప్రొఫైల్ పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాలి… కాదు, అందరూ చదవాలి… మనం ఇంకా గోత్రాలు, జాతకచక్రాలు, కులాలు, శాఖల గిరులు గీసుకుని… వాటిని దాటడానికి గడగడా వణికిపోతున్నాం కదా… కొందరు విశ్వమానవులుగా ఎదుగుతున్నారు… ఇప్పుడు మనం చెప్పుకునే పేరు జైశంకర్… ఔను, మన విదేశాంగమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్… తమిళ బ్రాహ్మణ మూలాలు… పుట్టిందీ పెరిగిందీ ఢిల్లీ…
- జైశంకర్ తండ్రి సుబ్రహ్మణ్యం… ఓ సివిల్ సర్వెంట్, ఓ జర్నలిస్ట్, విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు, వ్యాఖ్యాత… ఆయన రాతల ప్రభావం మన విదేశీ వ్యవహారాల మీద బాగా ఉండేది…
- జైశంకర్ సోదరుడు సంజయ్ సుబ్రహ్మణ్యం… ఫేమస్ చరిత్రకారుడు… బోలెడు పుస్తకాలు రాశాడు… (పాపులర్ యూసీఎల్‌ఏ హిస్టారియన్, అమెరికన్ ప్రొఫెసర్ కెరోలిన్ ఫోర్డ్‌ను పెళ్లి చేసుకున్నాడు…
- జైశంకర్ మరో సోదరుడు విజయకుమార్… ఐఏఎస్… కేంద్ర రూరల్ డెవలప్‌మెంట్, మైనింగ్ సెక్రెటరీగా చేశాడు… పలు కీలక పోస్టుల్లో బాధ్యతల్ని నిర్వర్తించాడు… ఇప్పుడు TERI లో ఉన్నాడు…
జైశంకర్ ఢిల్లీ జేఎన్‌యూలో అంతర్జాతీయ సంబంధాలు అంశంపై పీహెచ్‌డీ చేశాడు… 1977లో సివిల్స్ కొట్టాడు… తెలుసు కదా, ఆ సర్వీసులో ఐఏఎస్‌కన్నా ఐఎఫ్ఎస్ ప్రిస్టేజియస్… విదేశాంగశాఖలో చేరిపోయాడు… చైనాలో ఎక్కువకాలం పనిచేసిన భారతీయ రాయబారి తను… అమెరికా, సింగపూర్, చైనా, రష్యా, జపాన్ వంటి కీలక దేశాల్లో కీలకసందర్భాల్లో పనిచేశాడు…
Ads
జపాన్‌లో పనిచేస్తున్నప్పుడు తన భార్య శోభ కేన్సర్‌తో మరణించింది… తరువాత అక్కడే పరిచయమైన జపాన్ మహిళ క్యోకోను పెళ్లి చేసుకున్నాడు… అప్పటికే తనకు ధ్రువ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు… తరువాత అర్జున్… ధ్రువ అమెరికన్ స్నేహితురాలు కసాండ్రాను పెళ్లిచేసుకున్నాడు… పలు రంగాల్లో నిష్ణాతుడైన కొడుకు ప్రస్తుతం రిలయెన్స్ వాళ్ల థింక్ టాంక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్)కు అమెరికా హెడ్‌గా చేస్తున్నాడు… మేధ కూడా అక్కడే, క్రియేటివ్ సైడ్ వర్క్ చేస్తోంది… ప్రొడ్యూసర్… మొత్తం కుటుంబం అంతా బాగా చదువుకుని, ప్రాంతాల హద్దులు దాటి, తమకు ఇష్టమైన రంగాల్లో పనిచేసుకుంటున్నారు… జైశంకర్ సైలెంట్ వర్కర్… కేంద్రం పద్మశ్రీ ఇచ్చింది తనకు… మోడీ ప్రధాని హోదాలో అమెరికా వెళ్లినప్పుడు పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేశారు కదా… దాన్ని విజయవంతం చేసింది జైశంకరే… తరువాత కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి అయ్యాడు… చాలా ఇంపార్టెంట్ పోస్టింగు అది… విని
రిటైర్ అయ్యాక కొన్నాళ్లు టాటా సన్స్ గ్రూపు గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ విభాగానికి ఛైర్మన్‌గా చేశాడు… కానీ అప్పటికే మోడీ తన సేవల్ని విదేశాంగ శాఖకు వినియోగించుకోవాలనే భావనతో ఉన్నాడు… 2019లో కేంద్ర విదేశాంగ శాఖకు మంత్రి అయిపోయాడు… మొదట్లో రాయబారిగా, తరువాత విదేశాంగ శాఖ కార్యదర్శిగా, ఇప్పుడు విదేశాంగ మంత్రిగా వెళ్తున్నాడు రష్యాకు, చైనాకు, అమెరికాకు, జపాన్‌కు..! విదేశీ వ్యవహారాల్లోనే పండిపోయాడు కాబట్టి ఆ మంత్రిగా పనిచేయడం తనకు ఈజీయే… కేబినెట్ సెక్రెటరీ, జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్ వంటి కొందరు తప్ప జైశంకర్ విధుల్లో ఎవరూ జోక్యం చేసుకోరు… ఎస్, రోజురోజుకూ ఇండియా విదేశాంగ విధానం కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నవేళ రెగ్యులర్ పొలిటిషియన్స్ కాదు… ఇలాంటి సిన్సియర్, ఎక్స్‌పీరియెన్స్‌డ్ బ్యూరోక్రాట్సే అవసరం..!! (ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే… ‘ముచ్చట’ను సపోర్ట్ చేయండి…)
Share this Article