Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నీ వదిలేసి.., హిమాలయ సన్యాస జీవనం అంత సులభమా?

June 28, 2026 by M S R

.

మిస్ ఇండియా యూఏఈ విజేత- మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ ఫైనలిస్టు- సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు… కానీ నివేదా పేతురాజ్ కెరీర్ ఎక్కడేసిన గొంగళి అక్కడే… అసలు 2023 నుంచి ఒక్క సినిమా కూడా లేదు. 2025లో దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో నిశ్చితార్థం, 3 నెలలకెే రద్దు… ఒకరకంగా పర్సనల్‌గా, కెరీర్‌పరంగా అన్నీ ఫెయిల్యూర్స్…

తనను తాను కూడదీసుకుని, దుబాయ్ నుంచి మళ్లీ చెన్నై వచ్చి, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు… రీసెంటుగా సింగ్ గీతంలో ఓ పాత్ర చేసినా, ఆ సినిమా ఆడలేదు, ఆమె పాత్ర కూడా దాదాపు అతిథి పాత్రే తప్ప పెద్ద ఆమె కెరీర్‌కు ఉపయుక్తమూ కాలేదు…

Ads

సో, ఆమె వైరాగ్యాన్ని, నిస్పృహను అర్థం చేసుకోవచ్చు… రీసెంటుగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా అందుకే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి… ఇటీవల జరిగిన ‘సింగ్ గీతం’ సక్సెస్ మీట్లో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టకాలాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయింది.

‘‘2023లో నేను సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను, నా జీవితం తప్పుడు దారిలో వెళ్తోందని అనిపించింది. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని భావించాను. ఆ సమయంలో నేను తీవ్ర గందరగోళంలో ఉన్నాను”

‘‘ఆ సమయంలో సినిమా ప్రపంచాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తూ ప్రశాంత జీవితం గడపాలని కూడా అనిపించింది… అయితే ‘సింగ్ గీతం’ సినిమా నా జీవితానికి కొత్త దిశను చూపింది. మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపింది… ఈ సినిమా లేకపోతే బహుశా హిమాలయాల్లో ధ్యానం చేస్తూ ఉండే దాన్నేమో” అని చెప్పుకొచ్చింది ఆమె.

వ్యక్తిగత, వృత్తిగత వైఫల్యాలు వైరాగ్యాన్ని నింపి ఉంటాయి ఆమెలో. అర్థం చేసుకోవచ్చు, కానీ హిమాలయాలకు వెళ్లి సన్యాసం స్వీకరించడం అంత సులభమా..? ఏదో నైరాశ్యంలో అలా చెప్పుకొచ్చింది గానీ… రంగుల ప్రపంచంలోకి ఒకసారి ఎంట్రీ ఇచ్చాక వదలడం, వదిలేసి కదలడం అంత సులభమేమీ కాదు. పైగా ఏదో ఓ ఆశ్రమంలో సన్యాసిగానూ బతకడం కష్టం. చెప్పినంత ఈజీ కాదు.

(పెళ్లి చేసుకుని, పిల్లలతోసహా తిరుపతిలోనే సెటిలవుతాను అంటోంది కదా శ్రీదేవి బిడ్డ జాన్వీకపూర్. ఇలాంటివి చెప్పినంత అలవోక వ్యవహారాలు ఏమీ కావు… మమతా కులకర్ణి మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించి తరువాత కొన్నాళ్లకే వాపస్… అనూ అగర్వాల్, బర్ఖా మదన్, నూపుర్ అలంకార్, సోఫియా హయత్ వంటి ఇద్దరుముగ్గురు తారలు మాత్రం ఆధ్యాత్మిక మార్గంలోకి పూర్తిగా వెళ్లిపోయారు. అన్నీ వదిలేసి,..)

తమిళనాడులో పుట్టిన ఆమె తల్లిదండ్రులతో దుబాయ్ వెళ్లి, అక్కడే చదువుకుంది. మోడల్, ఫ్యాషన్ షోలు… అందాల పోటీలు… తరువాత సినిమాలు… ఆమె బతుకంతా రంగులలోకంలోనే ఇన్నేళ్లు… పదేళ్లుగా సినిమా ఫీల్డులో ఉండి, అంత తేలికగా అన్నీ వదిలేయడం కష్టం. అందుకే మళ్లీ వచ్చింది. అవకాశాలు వెతుక్కుంటోంది. కాకపోతే ఒక్క మంచి పాత్ర కూడా ఆమెకు రాసిపెట్టలేదు ఇప్పటివరకు. అది ఆమె దురదృష్టం.

నిజానికి ఆమె పెళ్లిచేసుకుని, సినిమాలకు గుడ్‌బై చెప్పాలని అనుకుంది. నిశ్చితార్థం అయ్యింది, ఇక దుబాయ్‌లో స్థిరపడిపోవాలనీ అనుకుంది. పైగా సినిమాల్లో అవకాశాలూ లేవు. అందుకే 2023 నుంచి ఖాళీ ఆమె. అందం, అభినయం ఉన్నా సరే ఆమెకు కలిసిరాని కాలం ఇది. సింగ్ గీతంతో తనకు రీఎంట్రీ ఏమైనా ఫలిస్తుందేమో చూడాలిక!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పల్స్ పోలియో! ఏటా ‘చుక్కల’ ప్రయాసకు కూడా పాకిస్థానే కారణం..!
  • అన్నీ వదిలేసి.., హిమాలయ సన్యాస జీవనం అంత సులభమా?
  • నిజమే – పాస్‌పోర్టు జాతీయతను నిర్ధారించదు! ఇదీ వాస్తవ స్థితి!
  • RAAKA – రష్మిక నెగెటివ్ షేడ్స్ – రొమాన్స్ కాదుట, ఘర్షణ !
  • BRS – నైరాశ్యం వీడని పార్టీ కేడర్! ఫాయిదా లేని KTR ప్రయాస!!
  • ఆశ్చర్యమేమీ లేదు- పాక్ క్రికెటర్లతో ఉగ్రవాదుల చెట్టాపట్టాల్!
  • పాకిస్థాన్! … అరబ్ భ్రమల నుండి సింధు, సంస్కృత మూలాల వైపు…
  • ‘కమ్మ’ అంటే తెలుసా? – ‘ఇడుపు కాయితం’ అసలు అర్థమేమంటే?
  • గంగ చంద్రముఖిలా..! కాషాయ రాంచందర్‌ కాస్తా పింక్ హరీష్‌లా…!!
  • గ్లోబల్ ఎంఎన్సీల వైపు యువ గిరిజనం! సరికొత్త సక్సెస్ స్టోరీలు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions