Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కినేనితో ఒకటే – నందమూరితో ఒకటే – విజయశాంతితో లాస్ట్!

July 1, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ANR తో చిరంజీవి నటించిన ఫస్ట్ & లాస్ట్ సినిమా ఈ మెకానిక్ అల్లుడు . యన్టీఆర్ తో కూడా ఒక్క సినిమాలోనే నటించారు చిరంజీవి . అది తిరుగులేని మనిషి . ఇద్దరు లెజెండ్లతో కలిసి నటించారు చిరంజీవి . 1993 లో వచ్చిన ఈ మెకానిక్ అల్లుడు సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ .

విజయశాంతి , చిరంజీవి నటించిన 19 వ సినిమా, ఆఖరిది కూడా . ఇద్దరూ చాలా ఎనర్జిటిక్ గా నటించారు . వీరిద్దరి నటన కన్నా చెప్పుకోవలసింది అక్కినేని , చిరంజీవి నటన . రొమాంటిక్ సీన్లలో చిలిపి , అల్లరి డైలాగులతో ప్రేక్షకులను బాగా అలరించారు .

Ads

వీరిద్దరి డైలాగులను ప్రత్యేకంగా వ్రాసిన సత్యానంద్ గారిని కూడా మెచ్చుకోవాలి . ఈ సినిమాకు కధను కూడా ఆయనే సమకూర్చారు . ఇలాంటి కధాంశాలతో చాలా సినిమాలు వచ్చినా కధను అవిష్కరించే విధానం , పాత్రల సృష్టి , స్క్రీన్ ప్లే , మసాలాలను దట్టించటం ప్రధానం . అవే సినిమా విజయాన్ని ప్రభావితం చేసేది .

నిర్మాత అల్లు అరవింద్ కదా ! పైగా దర్శకుడు బి గోపాల్ . బిర్రయిన స్క్రీన్ ప్లేతో గరం మసాలాలను , చిరంజీవి స్థాయి డాన్సులను , ఫైట్లను పెట్టారు . ముఖ్యంగా పాటల చిత్రీకరణ . అక్కినేని , చిరంజీవి పాట గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమెక్కు గురువా వీర హిట్టయింది . ఇద్దరి అభిమానులు పులకరించిపోయారు .

బెంగుళూరు పేలస్ ముందు చిత్రీకరించబడిన ఝుమ్మనె తుమ్మెద వేట ఘుమ్మనె వలపుల తోట పాట చిరంజీవి , విజయశాంతి మీద అద్భుతంగా చిత్రీకరించారు . వీరిద్దరి మీదనే మరో రెండు డ్యూయెట్లు ఉన్నాయి . చక్కా చక్క చెమ్మ చక్క , గుంతలకిడి గుండమ్మా గుండెల్లో గుబ గుబ . ప్రేమిస్తే ప్రాణమిస్తా వంచిస్తే అంతు చూస్తా చిరంజీవి పాట అభిమానులకు హుషారును ఇస్తుంది .

క్లైమాక్సులో చిరంజీవి , అక్కినేని , విజయశాంతి , శారద అందరూ కలిసి సత్యనారాయణని అల్లరి చేసే అంబ పలికింది రంభ కదిలింది భారీగా బాగుంటుంది . క్లైమాక్సుని బాగా పండించింది .

పాటల్ని వేటూరి , భువనచంద్రలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా గాత్రించారు . రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగా వచ్చాయి . తార బృందం డాన్సుల్ని అద్భుతంగా కంపోజ్ చేసింది . చిరంజీవి సినిమా అనగానే ప్రేక్షకులు డాన్సులు , ఫైట్లను ఆశిస్తారు . స్టంట్ మాస్టర్ రాజు స్టంట్లను బాగా పెట్టారు .

సినిమాలో కావలసినంత richness ఉంది . ఆ తర్వాత అక్కినేని , చిరంజీవి కాస్ట్యూమ్స్ చాలా అందంగా ఉంటాయి . చిరంజీవితో సమానంగా ఆ వయసులో అక్కినేని డాన్సించటాన్ని ప్రత్యేకంగా అభినందించాలి .

కధ టూకీగా… : అక్కినేనిని బావమరిది సత్యనారాయణ , అతని మిత్రుడు కోట శ్రీనివాసరావు చేయని నేరంలో ఇరికించి జైలుకు పంపుతారు .అక్కినేని చెల్లెలు శుభని చంపటానికి ప్రయత్నిస్తారు . ఆమెని సత్యనారాయణ మరో భార్య శారద రక్షించి ప్రసవానికి సహాయం చేస్తుంది .

అక్కినేని మెకానిక్ షెడ్ ఓనర్ . అయన కూతురు విజయశాంతి హోటల్ నడుపుతూ ఉంటుంది . ఓ ప్రమాదంలో అక్కినేనిని రక్షించిన చిరంజీవి ఆయన షెడ్ లోనే మెకానిక్ గా చేరుతాడు . చిరంజీవి అక్కినేని మేనల్లుడే అని తెలవటం , సత్యనారాయణ , కోట శ్రీనివాసరావు తమను ఎలా నాశనం చేసారో తెలుసుకుని అందరూ కలిసి సత్యనారాయణకు బుధ్ధి చెప్పి అసలు నేరస్తులను చట్టానికి అప్పచెప్పటంతో సినిమా శుభాంతం అవుతుంది .

అక్కినేని , చిరంజీవి , విజయశాంతి , శారద , శుభ , కోట శ్రీనివాసరావు , సుధాకర్ , బ్రహ్మానందం , ఆలీ , జయలలిత ,డిస్కో శాంతి , జెన్నీ  తదితరులు నటించారు . An excellent romantic entertainer . సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉన్నా అక్కినేని , చిరంజీవి , విజయశాంతి అభిమానులు మరలా చూడవచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇరుముడి విషాదం! దిల్ రాజు ఎదుట సర్కారు సాగిలబడాలా?
  • ఈ తడారిన శ్వాసల తబలా చప్పుళ్లు ఓసారి వినండర్రా లీడర్లూ..!!
  • Irumudi – రవితేజ ‘ఇరుముడి’పై స్పష్టంగా ఓ మాలీవుడ్ ముద్ర !
  • ‘గ్లోబరీనా’ తవ్వకాలు షురూ ! కేటీయార్‌పైకి మరో అస్త్రం రెడీ !!
  • అబద్దాలు- తప్పుడు బాష్యాలు – కాళేశ్వరంపై అవే వక్రీకరణ కథలు !!
  • రాఖీకి ఈ ర్యాంప్ లుక్ ఎందుకు..? దారితప్పుతున్న క్రియేటర్లు…!!
  • కులం నిజం – వివక్ష నిజం – కులాధిపత్యం గుప్పిట్లో టాలీవుడ్‌ !!
  • రేవంత్ రెడ్డే టార్గెట్ ! తెర వెనుక ఒక్కటవుతున్న వేర్వేరు శక్తులు !!
  •  2029 టార్గెట్‌గా చకచకా పావులు..! జమిలి, డీలిమిటేషన్, మహిళా కోటా…?
  • రేవంత్‌ రెడ్డి చాణక్యం ! ‘తెలంగాణ ఆత్మగౌరవం’ ఎవడబ్బ సొత్తు ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions