సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నా సరే… చేయాలనే సంకల్పం మనసులో ఉన్నా సరే… కొన్ని అంశాల జోలికి పోదు కేంద్ర ప్రభుత్వం… అనవసర రభసకు, వివాదానికి ఎందుకు తావు ఇవ్వాలనే భావన కావచ్చు… ఉదాహరణకు మొన్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మోడీకి రాసిన ఓ లేఖ… అందులో ఓ డిమాండ్… అదేమిటయ్యా అంటే… మన జాతీయ గీతం మార్చేయాలి…
అదేమిటి..? జాతీయగీతమే మార్చేయాలనేది చిన్న కోరిక ఎలా అవుతుంది..? చాలా సంక్లిష్టమైన ఇష్యూ కదా అంటారా..? అవును, అసలు మన జాతీయ గీతం ఉండాల్సిన పద్ధతిలో ఉందా…? ఎప్పుడో మన నుంచి విడిపోయిన సింధు వంటి పాకిస్థానీ పదాలు ఇంకా మన జాతీయ గీతంలో అవసరమా..? అసలు ఎవరినో కీర్తించడానికి రవీంద్రుడు రాసిన ఆ గీతం మనకు జాతీయగీతం ఎలా అవుతుంది..? ఎందుకు మార్చుకోకూడదు…? బ్రిటిష్ హయాంలోనే ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆజాద్ హిందూ ఫౌజ్ నడిపించి, కొన్ని ప్రాంతాలను విముక్తం కూడా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పునర్లిఖించిన గీతాన్ని మనం జాతీయగీతంగా ఎందుకు చేసుకోకూడదు..?
Ads
ఈ ప్రశ్న మన మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దగ్గరకూ వచ్చింది అప్పట్లోనే… జనగణమన మాత్రమే మన జాతీయగీతం అంటూనే కొన్ని పదాలను మాత్రం మారుద్దాం అన్నాడు ఆయన… ఈరోజుకూ మార్చలేకపోయాం… నిజానికి వందేమాతరం మొదటి నుంచీ కాంగ్రెస్ సమావేశాల్లో వినిపించేది, కానీ అప్పటి ముస్లిం నేతలు అది మరీ ఓ హిందూదేవతను కీర్తించినట్టుగా ఉందని అభ్యంతరం చెప్పడంతో… రవీంద్రుడు రాసిన జనగణమన పాడటం మొదలుపెట్టారు… చివరకు అదే మన జాతీయ గీతం అయిపోయింది…
కానీ… 1911లో కింగ్ జార్జి-5 ఇండియాకు వచ్చినప్పుడు తనను కీర్తిస్తూ రవీంద్రుడు ఈ గీతం రాశాడనీ, అందుకే అధినాయక జయహే అంటూ భారత భాగ్యవిధాతా అంటూ పదాలు పేర్చాడనే అభియోగం చాలా ఏళ్లుగా ఉన్నదే… నాటి వలసపాలకుడిని కీర్తించడానికి రాసిన గీతం స్వతంత్ర భారతావనికి జాతీయ గీతం ఎలా అవుతుందనే అసంతృప్తి కూడా ఉన్నదే…
1943లో నేతాజీ ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకున్నాక… ఈ గీతానికే కొన్ని సవరణలు రాయించి జాతి విజయగీతికగా మలిచాడు… ఈ సవరణలు చేసింది రచయిత ముంతాజ్ హుస్సేన్, కల్నల్ అబిద్ హసన్… అసలు జైహింద్ నినాదం కూడా నేతాజీదే… రవీంద్రుడి జనగణమన కాస్తా నేతాజీ సబ్ సుఖ్ చైన్‌గా మారింది… అయితే అదే ట్యూన్… దాదాపుగా అవే పదాలు… కాకపోతే ఎవరో జార్జిని కీర్తిస్తున్నట్టు గాకుండా… జాతి జయగేయంగా వినిపిస్తుంది… నిద్రమబ్బు ట్యూన్ గాకుండా… జాతికి ప్రేరణ కలిగించేలా ఓ మార్షల్ ట్యూన్… అంటే టోన్ మారుతుంది పాడుతున్నప్పుడు…
నెహ్రూకు, దేశపు మొదటి ప్రభుత్వానికి నేతాజీ అంటే పడదు కదా… సరే, అదొక కథ… నేతాజీ రాయించిన పాటను జాతీయ గీతంగా ఎలా అంగీకరిస్తారు..? అందుకే రవీంద్రుడు రాసిన గీతంలోని పదాలను కూడా మార్చలేదు…
మనం ఎప్పుడూ పాడుతునే జాతీయ గీతం అందరికీ తెలిసిందే… (అదీ తెలియనివాళ్లు ఉన్నారు కొందరు, అదివేరే కథ)… మరి నేతాజీ ఆలపించిన ఆ జాతీయ గీతం ఏమిటి..? విన్నారా ఎప్పుడైనా..? అదెలా సాగుతుందో గమనించారా..? ఇదుగో ఆ గీతం… ఇంగ్లిషు లిపిలో… నిజానికి సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్‌లో తప్పేమీ లేదు… ఈ గీతం నిజమైన స్వతంత్ర భారతావని గుండెచప్పుడులాగే ఉంటుంది… ఇలా…
Subh sukh chain ki barkha barse, Bharat bhaag hai jaaga.
Punjab, Sindh, Gujarat, Maratha, Dravid, Utkal, Banga,
Chanchal sagar, Vindhya, Himalaya, Neela Jamuna, Ganga.
Tere nit gun gaayen, Tujhse jivan paayen,
Har tan paaye asha.
Suraj ban kar jag par chamke, Bharat naam subhaga,
Jai Ho! Jai Ho! Jai Ho! Jai, Jai, Jai, Jai Ho!
Sab ke dil mein preet basaaey, Teri meethi baani.
Har sube ke rahne waale, Har mazhab ke praani,
Sab bhed aur farak mita ke, Sab gaud mein teri aake,
Goondhe prem ki mala.
Suraj ban kar jag par chamke, Bharat naam subhaga,
Jai Ho! Jai Ho! Jai Ho! Jai, Jai, Jai, Jai Ho!
Subh savere pankh pakheru, Tere hi gun gayen,
Baas bhari bharpur hawaaen, Jeevan men rut laayen,
Sab mil kar Hind pukare, Jai Azad Hind ke nare.
Pyaara desh hamara.
Suraj ban kar jag par chamke, Bharat naam subhaga,
Jai Ho! Jai Ho! Jai Ho! Jai, Jai, Jai, Jai Ho!
Share this Article