Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రత్యేక కొంగునాడు..! విభజిస్తే తప్పేమిటట..! తమిళనాట ఈ కొత్త లొల్లి ఏంటంటే…!!

July 13, 2021 by M S R

అవును మరి… మీడియాకు తెలిసిన పనే అది కదా… అయితే పుల్లలు పెట్టాలి, లేదంటే మంటల్లో ఇంకొన్ని పుల్లలు పడేయాలి… దినమలార్ అని ఓ తమిళ పత్రిక… కాస్త బీజేపీ అనుకూలమే… మూడు రోజుల క్రితం ఓ వార్త రాసింది… ‘‘కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి కొంగునాడును విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని భావిస్తోంది..’’ ఇదీ వార్త సారాంశం… దానికి ఆధారం లేదు, ఎవరూ లీక్ చేసిందీ లేదు… ఆమధ్య బెంగాల్ నుంచి చికెన్ నెక్ జిల్లాల్ని విడదీసి మోడీ కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతున్నాడు అని వార్తలొచ్చినయ్… మమత కస్సుమంది… ఆలూలేదు, చూలూలేదు… ఎవరో ఒకరిద్దరు ఎంపీల డిమాండ్ అది… అంతేతప్ప బీజేపీ ఆలోచన లేదు, ఆచరణ లేదు… నిజానికి చేస్తే తప్పులేదు… సేమ్, కొంగునాడు కూడా… బీజేపీ వాళ్లు ప్రకటనలు చేసిందేమీ లేదు… కానీ ముందుగా లెఫ్ట్ శోకాలు స్టార్ట్ చేసింది. తరువాత డీఎంకే శ్రేణులు స్పందిస్తూ, సమైక్య తమిళనాడు అని నినాదాలు అందుకున్నారు… చాలారోజుల తరువాత కణిమొళి తెర మీదకు వచ్చి, ఏయో, మోడీ జాగ్రత్త అంటోంది…

kongunadu

ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి…

Ads

  1. నిజానికి బీజేపీకి ఆ ఆలోచన లేదు… రచ్చ, చర్చ జరుగుతున్నది కాబట్టి, విభజిస్తే తప్పేమిటి అంటోంది ఇప్పుడు…
  2. నిజమే, తప్పేముంది..? దేశంలో అసలు రాష్ట్రాల విభజనే జరగలేదా..? చిన్న పాలన యూనిట్లు శ్రేయోదాయకం అనేదే కదా బీజేపీ పాలసీ…
  3. భాషాప్రయుక్త రాష్ట్రాల్ని విడదీయొద్దు అనేది మరో అబ్సర్డ్… ఏపీ, తెలంగాణ విడిపోలేదా..? చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ విడిపోలేదా..? మిన్ను విరిగి మీద పడిందా..?
  4. ఇదేమీ ఖలిస్థాన్ కాదు కదా, కొంగునాడు వేరే దేశం అడగడం లేదు కదా… దానికంటూ ఓ విశిష్ట చరిత్ర ఉంది… ప్రత్యేక కొంగునాడు అనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది…
  5. రాజకీయాల కోసం విడదీస్తున్నారు అనే వాదన కూడా నవ్వొచ్చేదే… తెలంగాణ ఇవ్వడం వెనుక కాంగ్రెస్ స్వార్థం లేదా..? మూడు చిన్న రాష్ట్రాల విభజన వెనుక బీజేపీ స్వార్థం లేదా..? ఐనా పాలనపరమైన విభజనే అంటారు ఎవరైనా..?

ఆమధ్య వెంకయ్యనాయుడు, మాలక్ష్మి గ్రూపు, పవర్ కన్సల్టెంట్ హరిశ్చంద్రప్రసాద్ తదితరులు కొంగునాడు పర్యటనలు చేశారు, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మీద బాగా వర్క్ చేయాలనుకున్నారనీ వార్తలొచ్చినయ్… మన తెలుగువాళ్ల సంఖ్య ఎక్కువే కాబట్టి, మనవాళ్లు వివిధ రంగాల్లో బాగా స్థిరపడ్డారు కాబట్టి, మనకు మరో రాష్ట్రం ఉంటుందనేది ఆ ఆలోచనల సారాంశం… కానీ బీజేపీ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు… నిజానికి ఈ ప్రాంతం అన్నాడీఎంకేకు బాగా  పట్టున్నది… మిగతా తమిళ ప్రాంతాలతో పోలిస్తే డిఫరెంటే… బాగా డెవలపైన ప్రాంతం… కాస్త కర్నాటక, కాస్త కేరళ ప్రాంతాలు కూడా కలిస్తే 90 సీట్లతో పెద్ద రాష్ట్రమే అవుతుంది… డీఎంకేకు ఇక్కడ పట్టు తక్కువ… మొన్నటి ఎన్నికల్లో కూడా డీఎంకేకన్నా అన్నాడీఎంకేకు డబుల్ సీట్లు వచ్చాయి ఇక్కడ… అసలు కొంగునాడు ఏమిటంటే..?

నొయ్యియల్, మణిముక్త, భవాని, కావేరి, అమరావతి నదులు ప్రవహించే సారవంతమైన నేల… రాష్ట్రానికి సగం ఆదాయం ఇక్కడి నుంచే సమకూరుతుంది… ఇక్కడి ప్రధాన పట్టణాల్లో ఏపీ, కర్నాటక, కేరళ నుంచే గాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వలస వచ్చి, స్థిరపడినవారు అధికం… తిరుపూర్ గార్మెంట్స్.., గోబి వ్యవసాయం.., నీలగిరి తేయాకు, టూరిజం.., కోయంబత్తూరు విద్య, వైద్యం, తయారీ, సర్వీస్ సెక్టార్లు… ఈరోడ్ విద్య, టెక్స్‌టైల్ మార్కెట్స్… భవానీ, కరూరు ఫ్యాబ్రిక్స్… శంకగిరి, నమక్కల్ లారీలు, రవాణా వాహనాలు… నమక్కల్ పౌల్ట్రీ పరిశ్రమ… సేలం విద్య, స్టీల్… కృష్ణగిరి, ధర్మపురి వ్యవసాయ ఉత్పత్తులు… పొలాచ్చి, ఉడుమల్‌పేట వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు….. ఇలా ప్రతి పట్టణమూ స్వయం సమృద్ధం… భిన్నమైన రంగాల్లో ఉపాధిని కల్పిస్తున్నాయి… ఒకవేళ నిజంగా అది విడిపోతే… మంచి నాయకత్వం గనుక దొరికితే దేశంలోకెల్లా అత్యంత సంపన్న రాష్ట్రం అవుతుంది… గ్యారంటీ…

అసలు బీజేపీ ఈ విభజన గురించి ఎందుకు ఆలోచిస్తున్నది..? అంటూ రకరకాల విశ్లేషణలు, మీడియా డిబేట్లు జోరుగా సాగుతున్నయ్… 1) డీఎంకేను బలహీనం చేయడం 2) అన్నాడీఎంకే పట్టున్న ఏరియా కాబట్టి, దాని తోక పట్టుకుని ఓ ప్రాంతంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం… 3) 38 సీట్లున్న పెద్ద రాష్ట్రం కాబట్టి, దాన్ని చీల్చి, హస్తినకు సవాల్ లేకుండా ఆ స్టేట్ వాయిస్ డైల్యూట్ చేయడం… 4) నార్తరన్ పెత్తనానికి ఎప్పుడూ సవాళ్లు విసిరి, అడ్డుకుని, అభ్యంతరపెట్టి, కొట్లాట పెట్టుకునేది తమిళ సమాజమే కాబట్టి విడదీస్తే ఆ ప్రతిఘటన శక్తిని సగానికి కుదించడం… 5) యాంటీ-బీజేపీ కూటమిలో డీఎంకే ప్రధానశక్తి… కాంగ్రెస్ దోస్త్, అందుకని దెబ్బతీయాలనేది ప్లాన్జ… ఇలా సాగిపోతున్నయ్ చర్చలు… తమిళ సోషల్ మీడియా అయితే ఊగిపోతోంది… నిజంగా మోడీకి, అమిత్ షాకు ఆ సాహసానికి ఒడిగట్టే దమ్ముందా అనేది పెద్ద ప్రశ్న..!! (స్టోరీ గనుక మీకు నచ్చినట్టయితే ‘ముచ్చట’కు ఆర్థికంగా అండగా నిలబడండి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions