.
సాయిపల్లవి సీత పాత్రపై బాలీవుడ్ ఏడుస్తూనే ఉంది… మొన్న ఎవడో ‘ఈమె సీతా’ అని తెగ హాశ్చర్యపోయాడు కదా… ఇప్పుడు దీపిక చికాలియా… పేరు గుర్తుంది కదా… రామానందసాగర్ తీసిన రామాయణంలో సీత పాత్రధారిణి…
ఈమె కువిమర్శ ఇప్పుడు సాయిపల్లవి కర్లీ హెయిర్ (గిరజాల జుట్టు) మీద… అబ్బే, సీతకు గిరజాల జుట్టేమిటి అంటోంది… అక్కడికి సీతది స్ట్రెయిట్ హెయిరో, కర్లీ హెయిరో ఈమెకు తెలిసినట్టు.., అదే అడిగితే తులసీదాస్ కూడా కర్లీ హెయిర్ అని చెప్పలేదు అని సమర్థించుకుంటోంది…
Ads
మరేం చెప్పాడమ్మా అనడిగితే… ఆల్చిప్పల్లాంటి కళ్లు, పొడవైన కేశాలు అని చెప్పాడు కదా అంటోంది… సరే, సాయిపల్లవి గిరజాల జుట్టు సీత పాత్రకు సూట్ కాదనే అనుకుందాం… మరి దీపిక చికాలియా చిన్న కళ్లు సీత ఆల్చప్ప కళ్లకు ఎలా సూటయ్యాయి..? అద్భుత లావణ్యవతి సీత, మరి ఈమె మగమొహం ఎలా సూటైంది..?

ఏదో ఒకటి ఏడ్వటం అలవాటై ఈ వేషాలు… అక్కడికి తను తప్ప ఇక ప్రపంచంలో ఏ పడతీ సీత పాత్రకు సూట్ కాదు అన్నట్టు కలరింగు! అప్పటికి రామానందసాగర్ ఆ టీవీ రామాయణం బడ్జెట్ పరిమితుల్లో ఈమె దొరికింది కాబట్టి తీసుకున్నాడు, అంతేతప్ప స్నిగ్ధ కాదు, ముగ్ధ కాదు…

ఆదిపురుష్ సినిమా సమయంలో అనుకుంటా… ఈమె అసలు ఎవరూ రామాయణం తీయకపోవడమే బెటర్ అన్నట్టు గుర్తుంది… ఎందుకమ్మా అంటే, ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లు తీసేస్తున్నారట! రామానందసాగర్ కూడా తనకిష్టం వచ్చినట్టు తీశాడు కదా మరి! అసలు తెలుగువాళ్లు రామాయణంపై బోలెడు సినిమాలు తీశారు, మనవాళ్లు తీసిన సినిమాలతో పోలిస్తే టీవీ రామాయణం నథింగ్…

సరే, గిరజాల జట్టు దగ్గరకు వద్దాం… పురాణ పాత్రల్ని మనం మనకు ఇష్టమైన రూపాల్లో చిత్రించుకుంటాం, మన భక్తిభావన అలా చేయిస్తుంది… అంతేతప్ప ఖచ్చితంగా అప్పట్లో రాముడు, సీత, రావణుడు ఇలా ఉండేవారు అనే ఆధారాలు, నిరూపణలు ఏమీ ఉండవు… ఆహార్యం, ఆభరణాలు, భాష, అందం, లుక్కు అన్నీ మన అభీష్టాల మేరకే ఊహ, కల్పన… రకరకాల దేశాల్లో రామాయణం ఉంది… ఒక్కోచోట ఒక్కోరకం కథ… ఒక్కోరకం ఆహార్యం… సహజం!

ఆమధ్య రాముడు శాకాహారా? మాంసాహారా? అనే క్షుద్ర చర్చను కూడా లేవనెత్తారు కొందరు… తను క్షత్రియ పుత్రుడని మరిచిపోయి కొందరు శాకాహారే అనీ…, నో, నో, మాంసాహారే అని మరికొందరు వాదులాడుకున్నారు సోషల్ మీడియాలో…

లుక్కు కూడా ప్రధానమే… కానీ గిరజాల జుట్టు అందంగా ఉండదా..? అదేమైనా అనాకారితనమా..? పిచ్చి కూతలు కాకపోతే! దర్శకుడికి నైపుణ్యం ఉంటే, ఎలాగైనా మెప్పించవచ్చు… నాగార్జున అన్నమయ్యకు మీసాలు పెట్టొచ్చు… రజినీకాంత్ రాఘవేంద్రుడికి కూడా! సినిమాలో కథను ఎలా బలంగా చెప్పగలిగి మెప్పించారనేదే ముఖ్యం..,

నిజానికి రాముడిది చామనఛాయ… అందుకే నీలమేఘ శ్యాముడు అంటారు… నీలం అంటే దట్టమైన నీలిరంగు కాదు… ఐనా అంతటి బాపు వంటి దర్శకులు కూడా బాలయ్యకు దట్టంగా నీలం రంగు పులిమి చూపించాడు…

అవునూ, రామానందసాగర్ రామాయణంలో రాముడి వేషం కట్టిన అరుణ్ గోవిల్ మామూలు నార్త్ ఇండియా కలర్లో కనిపించాడు గానీ చామనఛాయలో లేడు కదా... మరి రణబీర్ కూడా ఎర్రగానే ఉన్నాడు... మరేం చేద్దామంటవ్ ఇప్పుడు..?!

Share this Article