Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మగ హోస్టులకే ఈటీవీ ప్రాధాన్యం! రష్మి- ఇంద్రజలకు కత్తెర !!

July 27, 2026 by M S R

.

2274 జీఆర్పీలతో దేశంలోనే నెంబర్ వన్ స్టార్ మా… పర్లేదు, జీతెలుగు కాస్తో కూస్తో పోటీ ఇస్తూ 1487 పాయింట్లతో అయిదో స్థానం… (ఏపీ, తెలంగాణలో రెండో స్థానం)… మరి ఈటీవీ.? దయనీయంగా !! ఉందో లేదో తెలియకుండా ఉన్న సన్ జెమిని‌తో పోటీపడుతోంది… (ఈటీవీ 850, జెమిని 645)… (అఫ్‌కోర్స్, ఎందరు చూస్తున్నారో లేదో తెలియదుగానీ ఈటీవీ జబర్దస్త్‌ షోకన్నా జెమినిలో మాస్ జాతర బాగుంటోంది… ఏమీ వెకిలి, బూతు, వెగటు, రోత ఇప్పటికైతే లేవు…)

ఇదీ సిట్యుయేషన్… పోతేపోనీలే అనుకుని, యూట్యూబ్ ఆదాయం వస్తోంది గానీ అనుకుంది ఈటీవీ ఇన్నాళ్లు… టీవీ రెవిన్యూ గూబల్లోకి వచ్చినట్టుంది… దాంతో ఉలిక్కిపడి మార్పులకు దిగింది… ఆ సీరియల్స్ ఎవడూ చూడడు… గతంలో తన బలం నాన్- ఫిక్షన్… అవీ దారుణంగా దెబ్బతిన్నాయి… దాంతో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మార్పులు ప్లస్ ఫ్యామిలీ స్టార్స్ సెకండ్ ఎడిషన్ స్టార్ట్…

Ads

ఇందులో నో డౌట్… సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ టాప్… ఆషు రెడ్డి, స్రవంతి అట్రాక్షన్స్… ఒక విశేషం చెప్పాలి… మామూలుగా ఈటీవీ షోలు అంటే వెట్టి చాకిరీ (బాండెడ్ లేబర్) బాండ్ పేపర్లలో చిక్కుకున్న ఆస్థాన కళాకారులతో చౌకగా చుట్టిపడేసేవి… వేరే చానెళ్లకు వెళ్లనివ్వరు, వేరేవాళ్లను రానివ్వరు… ఒకటే రొటీన్ మొనాటనీ సోది… ఇప్పుడు తత్వం బోధపడి, ఇక అందరికీ తలుపులు తెరిచారు, ఖర్చుకు లిబరల్‌గా తలూపినట్టున్నారు…

ఫ్యామిలీ స్టార్స్‌లోకి ఈసారి అంతా స్టార్ మా గ్యాంగు, బిగ్‌బాస్ గ్యాంగులు వచ్చాయి… రాము రాథోడ్, యష్మి గౌడ, అర్జున్ రెడ్డి, ప్రియాంక జైన్, నిఖిల్ మలయక్కిల్ (మోసగాడు అని కావ్యశ్రీ ముద్రవేసిన మాజీ ప్రేమికుడు), సీనియర్ నటి సుధ, పంచ్ ప్రసాద్… బిగ్‌బాస్‌లోకి వెళ్తారని భావిస్తున్న నూకరాజు, తేజస్విని (అమర్‌దీప్ భార్య), సింగర్ ధనుంజయ్,, మరో లేడీ సింగర్ (పేరు గుర్తులేదు)… వీళ్లంతా అలరించారు… (ఈ టీమ్ బాగుంది, రైటర్, హోస్టులు, డైరెక్టర్ అందరూ)… ప్రైమ్ టైమ్ షో ఇది…

ఈటీవీ

ఎఐ క్రియేటెడ్ సూర్యకాంతం బాగుంది… ఓ చమక్కు చెప్పనా..? నూకరాజు ఆషురెడ్డిని ఏమేవ్ అని పిలుస్తాడు, ఏయ్, ఏమిటా పిలుపు అనడిగితే ఆమె మీద నాకు ఏమైనా అనే హక్కుంది అంటారు, అదేమిటి అంటే, 399 రూపాయలు పెట్టి కొన్నాను అంటాడు… టాప్ సెటైర్… (ఈమె ఈటీవీ సబ్‌స్క్రిప్షన్ టారిఫ్ అది)…

శుక్ర, శనివారాల్లో వచ్చే జబర్దస్త్‌ను ఆదివారం సాయంత్రానికి మార్చారు… మార్చారు సరే, నాగబాబు వచ్చాడు కదా మళ్లీ జడ్జిగా… ఇంకేం, ఆది వచ్చేశాడు… తను జడ్జోె, టీమ్ లీడరో అర్థం కాదు, అన్ని షోలలోలాగే ప్రత్యక్ష వ్యాఖ్యానాలు, అరిగీ అరిగీ విసిగించే వన్ సైడెడ్ వ్యాఖ్యలు… (తన భాషలో పంచులు)… ఫుల్ మొనాటనీ వచ్చేసింది, పైగా డామినేట్ చేస్తుంటాడు ఢీ, శ్రీదేవి డ్రామాకంపెనీ,, ఇప్పుడు జబర్దస్త్.,.

ఈసారి నాగబాబు ఈ షోలో కొంత డబ్బు కూడా పెడుతున్నట్టున్నాడు… ఇంకేం, జనసేన జబర్దస్త్… ఫాఫం ఈటీవీ..!! శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ మార్పులు… ఖర్చు పెరిగినా సరే అనుకుని ప్రదీప్‌ను తెచ్చారు… తెస్తే తెచ్చారు, రష్మి గౌతమ్‌ను వెళ్లగొట్టారు… నిజానికి ఆమె, ఇంద్రజ ఆ షోకు అసెట్స్… అది పోయింది, ప్రదీప్ హోస్టింగ్ బాగానే ఉంటుంది, సినిమా రంది వదిలేసి ఇక టీవీలపై కాన్సంట్రేట్ చేస్తున్నాడు, కానీ మునుపటి ఆ స్పాంటేనిటీ, చెణుకులు మిస్సయినట్టు కనిపిస్తోంది…

నిజానికి రష్మికి అన్యాయమే… (అఫ్‌కోర్స్, ఇంద్రజకు కూడా… ఆమె కాస్త పద్ధతిగా కనిపిస్తుంది… జబర్దస్త్‌కు పరిమితం చేసి, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి పంపించేశారు…) రష్మి ఆహా ఓటీటీలో ఏదో ‘ఇన్‌ఫ్లుయెన్సర్’ షోను మంచు లక్ష్మి, హర్ష చెముడుతో కలిసి హోస్ట్ చేస్తుంది… ఇన్నేళ్లు ఎవరు వస్తున్నా, ఎవరు పోతున్నా రష్మి ఈటీవీనే అంటిపెట్టుకుని ఉంది… ఈటీవీకి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు కదా, కత్తెర పెట్టేశారు..!!

ఇవన్నీ ఆదివారం షోలే… దీంతో రేటింగ్స్ పెరుగుతాయని ఈటీవీ ఆశ… ఒకటి ఆది, రెండు ప్రదీప్, మూడు సుధీర్… పాపులర్… కానీ షో రక్తికట్టాలంటే స్కిట్లు బాగుండాలి, రైటర్స్, డైరెక్టర్స్ కష్టపడాలి, జబర్దస్త్‌లోకి కొత్తగా ఎవరెవరినో సినిమా వాళ్లను తెచ్చి ఏదో చేయించారు గానీ అంతగా స్కిట్లు రక్తికట్టలేదు!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అత్తింటి అపోలో, కామినేని ఉండగా… కోయంబత్తూరు ఎందుకు రాజా..!!
  • తొండలు కాదు, ఆగిన గుండెకు అండగా ! రేవంత్ ‘పెద్ది’ పరిణతి !
  • మగ హోస్టులకే ఈటీవీ ప్రాధాన్యం! రష్మి- ఇంద్రజలకు కత్తెర !!
  • కాదు, నేనిప్పుడు బిచ్చగాడిని కానే కాదు – ఆ రోజులకు ఏనాడో స్వస్తి !
  • కాకినాడ ప్రజా వైద్యుని పరిశోధనకు మరో అంతర్జాతీయ గుర్తింపు
  • నిజమే… మీడియా ఆత్మసమీక్ష తప్పదు- జ్యోతి నుంచే ఆరంభం కావాలి !!
  • … డాన్ పాత్రల్ని సూపర్ స్టార్ అప్పుడెప్పుడో టచ్ చేసేశాడు !!
  • సరిగ్గా తీయగలిగితే… ఈమె జీవితమూ ఓ మహానటి బయోపిక్ !!
  • 5 ఏవీఎఫ్ ప్రయోగాలు – 1000 ఇంజక్షన్లు – చివరకు ‘అమ్మా’ అనే పిలుపు…
  • సడక్ సే సంసద్ ! రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన ఆలోచనాత్మకమే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions