.
మొదట ఇది నిజం కాదేమో అనుకున్నాను… మరోసారి చెక్ చేశాను… నిజమే… ఇది నిజమే. అంతేకాదు, టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఏ బౌలర్ చేయని ఘనత ఇది అని Justin Greaves పేరిట ఐసీసీ అధికారికంగా పేర్కొంది. అందుబాటులో ఉన్న టెస్టు రికార్డుల ప్రకారం వరుసగా ఐదు వికెట్ మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా గ్రీవ్స్ చరిత్ర సృష్టించాడు.
ఇది నిజంగా ఏ బౌలర్ అయినా కలలు కనే స్పెల్.
Ads
- 64వ ఓవర్: మెయిడెన్ + వికెట్
66వ ఓవర్: మెయిడెన్ + వికెట్
68వ ఓవర్: మెయిడెన్ + వికెట్
70వ ఓవర్: మెయిడెన్ + వికెట్
72వ ఓవర్: మెయిడెన్ + వికెట్
మొత్తం: 5 వరుస ఓవర్లు… 5 మెయిడెన్లు… 5 వికెట్లు… ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు! వావ్… వావ్…
కథనం… బౌలర్ జీవితంలో ఇలాంటి స్పెల్ ఒక్కసారి వస్తే చాలు..! చరిత్రే గుర్తుంచుకుంటుంది!
- టెస్టు క్రికెట్‌లో ఒక బౌలర్ ఐదు వికెట్లు తీయడం గొప్ప విషయమే. ఐదు మెయిడెన్ ఓవర్లు వేయడం కూడా ప్రత్యేకమే. కానీ ఈ రెండింటినీ కలిపి… అదీ వరుసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ తీస్తూ, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా పూర్తి చేయడం? ఇప్పటివరకు ఎవరూ చేయని అద్భుతం.
వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ ఈ ఫీట్ ఏదో అనామక జట్టు మీద సాధించలేదు… పాకిస్థాన్‌పై అదే చేసి చూపించాడు.
పాకిస్థాన్ ఒక దశలో మంచి స్థితిలో కనిపించింది. కానీ గ్రీవ్స్ చేతికి బంతి వచ్చిన తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ప్రతి స్పెల్‌లో బౌలర్లు “ఒక బ్రేక్‌థ్రూ వస్తే చాలు” అనుకుంటారు. కానీ గ్రీవ్స్ మాత్రం ప్రతి రెండో ఓవర్‌లో వికెట్ కాదు… ప్రతి ఓవర్‌లో ఒక వికెట్ తీస్తూ ప్రత్యర్థిని కుప్పకూల్చాడు.
ఈ స్పెల్‌లో మరో విశేషం ఏమిటంటే… బ్యాటర్లకు ఒక్క పరుగు కూడా ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. డిఫెన్స్ ఆడినా అవుట్, డ్రైవ్ చేసినా అవుట్, వదిలేసినా ప్రమాదమే. అంత కచ్చితమైన లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు.
ఇప్పటివరకు వరుసగా నాలుగు వికెట్ మెయిడెన్ ఓవర్ల రికార్డు మాత్రమే ఉండేది. ఇంగ్లండ్ మాజీ పేసర్ Stuart Broad 2016లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును దాటి, వరుసగా ఐదు వికెట్ మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా జస్టిన్ గ్రీవ్స్ టెస్టు చరిత్రలో తన పేరును బంగారు అక్షరాలతో లిఖించుకున్నాడు.
క్రికెట్‌లో కొన్ని గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ కొన్ని స్పెల్స్ చూస్తే మాత్రం బౌలింగ్ కూడా ఒక కళ అని మరోసారి గుర్తుకు వస్తుంది. జస్టిన్ గ్రీవ్స్ ఈ స్పెల్… అలాంటి కళాఖండమే…
Share this Article