Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీ పిల్లలు ప్రధానిని బూతులు తిడితే… మీరేం చేస్తారు?!

August 2, 2026 by M S R

.

Psy Vishesh … ప్రధానిని కూడా తిట్టడానికి భయపడని తరమా? లేక బరితెగించిన తరమా?
ఈ ప్రశ్నకు రాజకీయ సమాధానాలు చాలా ఉన్నాయి. కానీ, సైకాలజీ చెప్పే సమాధానం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
“You Fu -ked With The Wrong Generation…” ప్లకార్డులు…
దేశ ప్రధానిపై రుచికా సింగ్ అనే 15 ఏళ్ల యువతి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించడం…
“అందరూ అలాగే మాట్లాడుతున్నారు… వాళ్ల ప్రభావంలో నేనూ అలా మాట్లాడాను” అని ఆ తర్వాత క్షమాపణ కోరడం…
“బూతులు తిట్టడం నేరం కాదు” అనే అభిజిత్ దీప్కే వాదన…
“పిల్లలు తప్పులు చేస్తారు. పెద్దలు వారికి దారి చూపాలి” అని ప్రధాని మోదీ స్పందించడం…
ఈ నాలుగు సంఘటనలు సోషల్ మీడియాలో నాలుగు వేర్వేరు వార్తలు కావచ్చు.
కానీ…

ఒక సైకాలజిస్ట్ గా చూస్తే…
ఇది ఒక దేశంలో జరుగుతున్న మానసిక, సామాజిక, సాంస్కృతిక మార్పుకు అద్దం పట్టిన సంఘటన.
ఇకపై మన దేశ యువత ఎలా ఆలోచించబోతోంది? ఎలా స్పందించబోతోంది? అధికారం, స్వేచ్ఛ, గౌరవం అనే విలువలను ఎలా అర్థం చేసుకోబోతోంది? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాల్సిన సందర్భం.
అందుకు కావాల్సింది రాజకీయ విశ్లేషణలు కాదు, మానసిక విశ్లేషణ.
—

Ads

“ఈ తరం చెడిపోయింది” అనడం చాలా సులభం. ప్రతి తరం తర్వాతి తరాన్ని చూసి ఇదే మాట చెప్పింది.
“యువత పెద్దలను గౌరవించడం లేదు…” అనే విమర్శలు కొత్తవేం కాదు. అప్పుడెప్పుడో క్రీస్తు పూర్వంనాటి గ్రీకు రాజ్యాల కాలం నుంచీ ఉన్నాయి.
అంటే… యువతపై విమర్శ కొత్తది కాదు. కానీ… ఈసారి మారింది యువత కాదు, వాళ్లు పెరిగిన ప్రపంచం.
అందుకే… ఈ సంఘటనను అర్థం చేసుకోవాలంటే… ముందు Gen Z ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి.
ఒక్కసారి ఆలోచించండి.
30 సంవత్సరాల క్రితం ఒక 15 ఏళ్ల పిల్లవాడు ప్రధానిని ఇలా మాట్లాడగలిగేవాడా?

—
ప్రతి తరానికి తనదైన భాష ఉంటుంది
మన తాతల తరం… గౌరవాన్ని భాషగా ఎంచుకుంది.
మన తల్లిదండ్రుల తరం… క్రమశిక్షణను భాషగా ఎంచుకుంది.
మిల్లేనియల్స్… చర్చను, సంభాషణను భాషగా మార్చారు.
కానీ… Gen Z ఒక కొత్త భాషను సృష్టించింది.
ఆ భాష… ప్రశ్నించడం, సవాలు చేయడం, వెంటనే స్పందించడం, భయపడకపోవడం.
వాళ్లు వ్యక్తిని కాదు… వ్యవస్థను ప్రశ్నిస్తున్నామని అనుకుంటారు.
కానీ, కొన్ని సందర్భాల్లో… వ్యవస్థపై ఉన్న కోపం వ్యక్తిపై దాడిగా మారిపోతుంది. అక్కడే సమస్య మొదలవుతుంది.
—

ప్రధాని కూడా వారికి ఒకటే
30 సంవత్సరాల క్రితం ప్రధాని అంటే… టీవీలో మాత్రమే కనిపించే వ్యక్తి. ఒక గౌరవ దూరం ఉండేది. ఆ దూరమే భాషను నియంత్రించేది.
ఈరోజు… ఒక యువకుడు Instagram ఓపెన్ చేస్తే… మొదట తన స్నేహితుడి Reel, తర్వాత ఒక హీరో, తర్వాత ఒక Influencer, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత ప్రధానమంత్రి.
అందరూ ఒకే స్క్రీన్ మీద.
అందరి కిందా ఒకే Comment Box.
ఈ పరిస్థితిని మన మెదడు… “సమాన స్థాయి సంభాషణ”గా స్వీకరిస్తుంది.
దీనినే సైకాలజీలో Psychological Distance Reduction అంటారు. ఇదే ఈ సంఘటనలో అత్యంత ముఖ్యమైన సైకాలజికల్ మార్పు.
దూరం తగ్గినప్పుడు… భయం తగ్గుతుంది. భయం తగ్గినప్పుడు… భాష మారుతుంది.
అసలు ఇది ధైర్యమా? లేక డిజిటల్ మత్తా?

—
సోషల్ మీడియా మార్చిన భాష…
సోషల్ మీడియా యువతను పాడుచేసిందని చాలామంది అనుకుంటారు. కానీ, ఒక సైకాలజిస్ట్ గా నా పరిశీలన వేరు.
సోషల్ మీడియా యువతను పాడుచేయలేదు, వాళ్ల కమ్యూనికేషన్‌ను పూర్తిగా మార్చేసింది. అక్కడ శాంతంగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు. ఆవేశంగా మాట్లాడితే లక్షల Views. తీవ్ర పదజాలం వాడితే లక్షల Shares. వివాదం సృష్టిస్తే… అల్గారిథమ్ మరింత ముందుకు నెడుతుంది.
దీంతో, Gen-Z మెదళ్లు “మర్యాద కంటే తీవ్రతకు ఎక్కువ విలువ ఉంది…” అనే విషయం నేర్చుకుంటుంది. ఇది ప్రమాదకరమైన మానసిక శిక్షణ. ఇది తెలియకుండానే వారి కమ్యూనికేషన్ శైలిని మార్చేస్తుంది.
సమస్య… ఒకరి భాష ఇంకొకరికి అర్థం కాకపోవడం.

—
“You Fu -ked With The Wrong Generation” అనే ప్లకార్డ్ వెనుక ఉన్న మానసిక సందేశం..
చాలామంది ఈ వాక్యాన్ని అసభ్యంగా మాత్రమే చూస్తారు. కానీ, ఒక సైకాలజిస్టుగా నాకు ఇందులో ఇంకో విషయం కనిపిస్తుంది. ఇది ఒక Identity Statement. “మమ్మల్ని భయపెట్టి మా నోళ్లు నొక్కలేరు…” అనేది దాని అసలు అర్థం.
ప్రతి తరం తమ గుర్తింపును ఒక భాష ద్వారా ప్రకటిస్తుంది.
1960ల తరం… యుద్ధ వ్యతిరేక ఉద్యమాలతో ప్రకటించింది.
1990ల తరం… ఆర్థిక స్వేచ్ఛతో ప్రకటించింది.
Gen Z… సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తోంది.
సమస్య వారి సందేశం కాదు.
సందేశాన్ని వ్యక్తపరిచే భాష.
మీ ఇంట్లో 15 ఏళ్ల పిల్లవాడు ఇలా మాట్లాడితే మీరు ఏమి చేస్తారు?

—
రుచికా సింగ్ క్షమాపణ ఎందుకు చాలా ముఖ్యమైనది?
“అందరూ అలాగే మాట్లాడుతున్నారు…” అనే ఈ ఒక్క వాక్యం Social Psychologyలోని మూడు సిద్ధాంతాలను గుర్తు చేస్తుంది.
మొదటిది, Peer Pressure.
మనిషి తన స్నేహితుల అంగీకారం కోసం, తన విలువలను కూడా తాత్కాలికంగా పక్కన పెడతాడు.
రెండవది, Deindividuation.
గుంపులో ఉన్నప్పుడు… “నేను” అనే భావన తగ్గుతుంది. “మనం” అనే భావన పెరుగుతుంది.
మూడవది, Diffusion of Responsibility.
“అందరూ చేస్తున్నారు” అంటే… “బాధ్యత నాది ఒక్కరిది కాదు…” అనే భావన.
ఇది ప్రతి నిరసనలో, ప్రతి ట్రోలింగ్‌లో, ప్రతి వైరల్ హ్యాష్‌ట్యాగ్‌లో కనిపించే మానసిక ప్రక్రియ.

—
15 ఏళ్ల మెదడు…
15 సంవత్సరాల వయస్సులో మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా లాజికల్ థింకింగ్ కు స్థానమైన Prefrontal Cortex.
ఆలోచించి నిర్ణయం తీసుకోవడం…
పరిణామాలను ఊహించడం…
కోపాన్ని నియంత్రించడం…
సామాజిక బాధ్యతను అంచనా వేయడం… వంటి పనులను ఇదే చేస్తుంది.
అదే సమయంలో…
Reward System చాలా చురుకుగా ఉంటుంది.
ఒక Reel వైరల్ అయితే…
వందల మంది చప్పట్లు కొడితే…
స్నేహితులు “సూపర్” అంటే…
డోపమైన్ విడుదల అవుతుంది.
ఆ క్షణంలో… భవిష్యత్తు గురించి కాదు, ప్రస్తుత ఆనందం గురించే మెదడు ఆలోచిస్తుంది.

—
ప్రధానమంత్రి స్పందన…
“పిల్లలు తప్పులు చేస్తారు…” అని ఈ సంఘటన తర్వాత ప్రధానమంత్రి అన్న మాటిది. ఈ వాక్యంలో, ఒక పెద్ద మనిషి కనిపించాడు. సైకాలజీలో దీన్ని Paternal Guidance అంటారు.
యువతతో వ్యవహరించేటప్పుడు అవమానించడం వారిని మరింత దూరం చేస్తుంది. అర్థం చేసుకోవడం మారడానికి అవకాశం ఇస్తుంది.
అందుకే, శిక్ష అవసరమయ్యే సందర్భాలున్నా… మార్గదర్శనం ఎప్పుడూ మరింత శక్తివంతమైన సాధనం.

—
“బూతులు తిట్టడం నేరం కాదు” అనే వాదన…
ఈ వాదనతో చాలామంది ఏకీభవిస్తారు, చాలామంది వ్యతిరేకిస్తారు.
కానీ… సైకాలజీ అడిగే ప్రశ్న వేరే.
ఎందుకు ఒక తరం ఈ వాదనతో కనెక్ట్ అవుతోంది?
ఎందుకంటే… వారి విలువల వ్యవస్థలో Freedom of Expression మొదటి స్థానంలో ఉంది.
పాత తరంలో, Respect for Authority మొదటి స్థానంలో ఉండేది.
ఇప్పుడు, ఈ రెండు విలువలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి.
అందుకే ఈ వివాదం.


ఒక సైకాలజిస్ట్ గా నా మాట…
ఈ సంఘటనలో నేను చెడిపోయిన యువతను చూడలేదు. ఒక మార్పులో ఉన్న యువతను చూశాను. ఒక గందరగోళంలో ఉన్న సమాజాన్ని చూశాను.
ఒక తరం “మాకు స్వేచ్ఛ కావాలి” అంటోంది.
మరో తరం “మర్యాద కూడా కావాలి” అంటోంది.
నిజానికి, ఈ రెండూ ఒకదానికి ఒకటి శత్రువులు కావు.
స్వేచ్ఛకు గౌరవం తోడైతే అది ప్రజాస్వామ్యం.
స్వేచ్ఛకు అవమానం తోడైతే అది అరాచకం.
గౌరవానికి భయం తోడైతే అది బానిసత్వం.
గౌరవానికి ఆత్మగౌరవం తోడైతే అది సంస్కారం.

అందుకే నా దృష్టిలో అసలు ప్రశ్న…
“ప్రధానిని కూడా తిట్టడానికి భయపడని తరమా?” అనేది కాదు.
“ప్రశ్నించే ధైర్యాన్ని… గౌరవంతో వ్యక్తపరచడం ఈ తరం నేర్చుకుంటుందా?” అనేదే అసలైన ప్రశ్న.
ఎందుకంటే, ఒక సమాజం భయపడని యువతతో ఎదుగుతుంది. కానీ బాధ్యత తెలిసిన యువతతోనే నిలబడుతుంది.
—
బరితెగించిన తరమా?
కొన్ని సందర్భాల్లో…
అవును.
ఎందుకంటే…
డిజిటల్ ప్రపంచం “ముందు పోస్ట్ చేయి… తర్వాత ఆలోచించు..” అనే ఒక ప్రమాదకరమైన అలవాటు వాళ్లకు నేర్పింది.
కానీ, రుచికా సింగ్ క్షమాపణ వీడియో… ఆవేశం శాశ్వతం కాదు. పరిణామాలు కనిపించినప్పుడు ఆలోచన మొదలవుతుందనే విషయం నిరూపించింది.


 

మీ ఇంట్లో 15 ఏళ్ల పిల్లవాడు ఇలా మాట్లాడితే… మీరు శిక్షిస్తారా? అర్థం చేసుకుంటారా? లేక రెండూ చేస్తారా…

సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇప్పుడు పిక్చర్ క్లియర్ ! కాళేశ్వరం మూడు బరాజులూ ప్రమాద స్థితిలోనే !!
  • ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక ! చప్పట్లు తిండి పెట్టవు !!
  • మీ పిల్లలు ప్రధానిని బూతులు తిడితే… మీరేం చేస్తారు?!
  • స్పెయిన్ చొరబాట్లు – భారతమా బహుపరాక్ – వలసల వెనుక కుట్ర !!
  • Sita – Warrior of Mithila – సీత అసూర్యంపశ్య కాదు – యోధురాలు !!
  • తలెగరేసిన తెలంగాణ ! ఏ దొరవారు లేరనో అభివృద్ధి ఆగదు !!
  • సోలో బతుకే సో బెటర్ ! పెళ్లి కాలేదని ఎంతమాత్రమూ చింతించవలదు !
  • సీతకన్నా బాగుంది! ఇది ఓ ట్రోల్ పోలిక! ఇంతకీ ఈమె ఎవరంటే?!
  • దొరతనం ! అవలక్షణులను తెలంగాణపై రుద్దిన క్షుద్రరాజకీయం !!
  • “వైభవ్ సూర్యవంశీ – ఓవర్ హైప్‌తో అసలు ఒరిజినాలిటీకే గండం?”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions