Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘నూకరాజు ! గతం- మూలాలు మరిచిపోని స్వచ్ఛత ! కీపిటప్ !!

August 2, 2026 by M S R

.

కొందరు ఆర్టిస్టులు… లేని భేషజాలకు, కృత్రిమ పోకడలకు దూరం… తమ మూలాలు మరిచిపోరు… తెలుగు టీవీ ఆర్టిస్టుల్లో అలాంటోళ్లు చాలామంది ఉన్నారు… పటాస్, జబర్దస్త్ తదితర టీవీ షోలతో బాగా పాపులరైన ఇమాన్యుయేల్, నూకరాజు అలాంటోళ్లే..! ఇప్పుడు పాపులర్ టీవీ కమెడియన్లు కమ్ ఆర్టిస్టులు…

తమ పేదరికపు మూలాల్ని దాచుకోరు, తమ కష్టాల గతాన్ని మరిచిపోరు… ఆర్టిస్ట్ వర్ష హోస్ట్ చేసే కిస్సిక్ షోలో కొందరి‌తో చాట్ బాగుంటుంది… నూకరాజుతో తాజాగా చిట్‌చాట్… బాగుంది… ప్రోమోనే కదిలించేలా ఉందంటే అసలు షో ఇంకాస్త బాగుంటుందేమో…

Ads

ఇమాన్యూయేల్ గత బిగ్‌బాస్ షోను నిజంగా రక్తికట్టించాడు… కల్యాణ్ పడాల పేరుకు విజేత, తనూజ ఒకరకంగా విజేత, కానీ వినోదం కోణంలో ఇమ్మూయే వాస్తవ విజేత… తను యాక్టివ్ అయిపోయాడు, నూకరాజు కూడా బహుశా బిగ్‌బాస్ 10 సీజన్‌లోకి వెళ్తాడేమో, స్పాంటేనియస్ పంచులకు ప్రసిద్ధి కదా, డెఫినిట్‌గా రాణిస్తాడు… తను మిమిక్రీ చేయగలడు, పాడగలడు…

ఓసారి ఏదో టీవీషోలో కాంతార సాంగ్ ప్రదర్శిస్తే… సదరు కాంతార హీరో బ్రదర్ స్వయంగా అభినందించాడని చెప్పుకున్నాడు… కరెక్టే… చాలా బాగా చేశాడు ఆ స్కిట్…

తను విజయవాడ పవర్ ప్లాంటులో పని మానేసి, హైదరాబాద్‌కు ఆర్టిస్టుగా రాణిద్దామని వచ్చాడు, మొదట్లో అనేక ఎదురుదెబ్బలు, చివరకు ఉప్పర పని కూడా చేశాడు… తను కిస్సిక్ షోలో చెబుతున్న విషయాలు… ‘‘అమ్మ యాపిల్స్ కొంటుందనే ఆశతో జ్వరం రావాలని కోరుకునేవాడిని… చిన్నప్పుడు చిన్న పాకలో ఉండేవాళ్లం, వర్షం వస్తే అది ఒకవైపు, మేం ఒకవైపు…

నూకరాజు

చికెన్ తినాలంటే రెండువారాలు ఎదురుచూసేవాళ్లం, సంక్రాంతి అందరికీ పండుగ, మేం పనికి వెళ్లేవాళ్లం… మా నాన్న మద్యానికి బానిస గాకుండా ఉంటే బాగుండేది, రోగమొచ్చినా నొప్పి వచ్చినా బంగారం తాకట్టే దిక్కు, లేకపోతే డబ్బుల్లేవు… మద్యం మా ఇంట్లోకి రానప్పుడు ఉన్న తిండే అందరమూ కలిసి ఆనందంగా తినేవాళ్లం, అది ప్రవేశించాక ముద్ద సరిగ్గా దిగట్లేదు…

వెన్నుపోటు అనే పదం వాడలేను గానీ, ఓ కోఆర్టిస్టు చెల్లికి బాగాలేదు అంటే కాగితం లేకుండా 13 లక్షలు ఇచ్చాను, తిరిగి ఇవ్వలేదు, సంపాదించిందంతా పోయింది… మత్స్యకారుల జీవితాలు ఎప్పుడూ ప్రమాదకరమే, 10, 15 కిలోమీటర్ల లోపల దాకా చేపల వేటకు వెళ్తే తిరిగి వస్తారో రారో అనేదీ డౌటే… రీసెంటుగా ఏడుగురు మరణించారు, సముద్రం మధ్యలో పడవ దెబ్బతిన్నా, ఫోన్ పనిచేయక… ప్రాణాంతకం…

తను ఏ మొహమాటం లేకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో భంగపాటు గురించీ చెప్పుకున్నాడు, రెగ్యులర్ అవుతున్నారనే సాకు గురించీ చెప్పాడు… కానీ అదే టీవీలో ఏళ్లుగా ఒకేరకం మొనాటనస్ ధోరణితో విసిగిస్తున్న ఓ స్టార్ ఆర్టిస్టుకు మాత్రం మూడు షోలలో ప్రాధాన్యం… అది చెప్పలేదు తను, కానీ తను శ్రీదేవి డ్రామా కంపెనీ అనుభవం  చెబుతుంటే ఇది గుర్తొచ్చింది… అంతేలే, ఐనవాళ్లకు ఆకుల్లో, కానివాళ్లకు కంచాల్లో…

కానీ ఏమాటకామాట… నూకరాజు, నువ్వు ఇలాగే ఉండు, స్వచ్ఛంగా… పాపులారిటీ వస్తుంది, పోతుంది, ఈ స్వచ్ఛత శాశ్వతం..!! ఆల్ ది బెస్ట్ !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాష్‌రూంలోకి ఆ ఆరేళ్ల పాప… ఫ్లై దుబాయ్ కథలో అదే కీలకం !!
  • పార్టీలు చెప్పేవి శ్రీరంగనీతులు – అఖిలేషుడూ ఆ తానులో ముక్కే !!
  • Sigma – తమిళ సీఎం విజయ్ కొడుకు సంజయ్‌కు ఓ ఫ్లాప్ డెబ్యూ !!
  • ఆపదామపహర్తారం… ఆ ఆపదలో స్మిత్ ధైర్యం హనుమంతుడే!
  • ఏమిట్లు..? ఇంతకీ ఈ ఫ్లయింగ్ హీరో స్మిత్ మచ్చర్ మనోడేనా..?
  • ఇల్లు కూడా లేని ఓ నిరుపేద బుక్కెడు బువ్వకై స్టార్ హోటల్ కట్టుకున్నా తప్పేనా..?!
  • ఆ ఒక్కటీ తక్కువైంది షెకావత్తూ… అదే ఎమోషనల్ థ్రిల్! వెరసి ట్రబుల్!!
  • అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!
  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions