Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Sita – Warrior of Mithila – సీత అసూర్యంపశ్య కాదు – యోధురాలు !!

August 2, 2026 by M S R

.

రామాయణంలో సీతాపహరణ ఘట్టం… రావణుడి భీకరాకృతి చూసి, భిక్ష వేయడానికి లక్ష్మణరేఖ దాటి వచ్చిన సీత మూర్ఛపోతుంది… ఆమెను తాకితే దగ్ధం అయిపోతాననే భయంతో, కింద నేలతో సహా ఎత్తుకుపోతాడు పుష్పకవిమానంలో… ఇదీ సహజంగా ప్రతి రామాయణ కళారూపంలో కనిపించే సీన్…

అపురూప లావణ్యవతిగా, ఎండకన్నెరగని అసూర్యంపశ్యగా చూపిస్తారు… రాజుల ఇళ్లల్లో పెరిగింది కాబట్టి అలా చిత్రించడం సాధారణమే… కానీ ఇప్పుడు నితేశ్ తీస్తున్న రామాయణ్‌లో ఓచోట సీత పాత్రధారిణి సాయిపల్లవి చేతిలో కత్తిని తిప్పుతూ కనిపిస్తుంది… బహుశా అది అశోకవాటికలో కావచ్చు లేదా తమ మిథిలానగరి కోటలో కావచ్చు… (ఫస్ట్ పార్ట్, అపహరణం వరకే కాబట్టి బహుశా అశోకవాటిక సీన్ కాకపోవచ్చు)…

Ads

అది చూస్తుంటే… అప్పట్లో పాపులర్ ఇంగ్లిష్ రైటర్ రాసిన ‘రామచంద్ర సీరీస్’ గుర్తొచ్చింది… అవి నాలుగు పుస్తకాలు… తెలుగులో కూడా వచ్చాయి…

  • రామచంద్ర సిరీస్ క్రమం:

    1. మొదటి పుస్తకం: రామ్ – స్యాన్ ఆఫ్ ఇక్ష్వాకు (Ram: Scion of Ikshvaku)

    2. రెండవ పుస్తకం: సీత – వారియర్ ఆఫ్ మిథిల (Sita: Warrior of Mithila)

    3. మూడవ పుస్తకం: రావణ్ – ఎనిమీ ఆఫ్ ఆర్యవర్త (Raavan: Enemy of Aryavarta)

    4. నాల్గవ పుస్తకం: వార్ ఆఫ్ లంక (War of Lanka)

సీత, ది వారియర్

ఆ సిరీస్‌లో రెండవ పుస్తకమైన “సీత: వారియర్ ఆఫ్ మిథిల” (Sita: Warrior of Mithila) లో సీత పాత్రను ఒక సాధారణ వనితలా కాకుండా, అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ తెలిసిన యోధురాలిగా, ఒక శక్తివంతమైన నాయకురాలిగా చిత్రీకరిస్తాడు రచయిత…

రామాయణాన్నే కొత్తగా విశ్లేషిస్తూ చెప్పడం… బహుశా అప్పుడు ఇలా జరిగి ఉండొచ్చు అనే ధోరణి… రీటెల్లింగ్ టెక్నిక్ అంటారు కదా… సీత చిన్నతనంలో అనాథగా దొరకడం, ఆ తర్వాత మిథిలా నగరానికి రావడం, అక్కడ ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో ఉంటాయి…

ఆమె కేవలం ధనుర్విద్య మాత్రమే కాకుండా, వివిధ యుద్ధ విద్యల్లో ఆరితేరిన యోధురాలిగా, మిథిలా నగరానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినట్లు చూపిస్తాడు రైౌటర్… సమాజంలోని రాజకీయాలు, కుట్రలను ఎదుర్కొంటూ దేశాన్ని రక్షించే ధైర్యశాలిగా ఆమె పాత్ర సాగుతుంది…

అమీష్ తనదైన శైలిలో పురాణ పాత్రలకు మోడర్న్ టచ్ ఇస్తూ, సైన్స్, ఫిలాసఫీ, పాలిటిక్స్ జోడించి ఈ కథను మలిచాడు… శివపురాణాన్ని కూడా అలాగే చెప్పాడు… సరే, దాన్నలా వదిలేస్తే…

ప్రస్తుతం రామాయణ్ దర్శకుడు  నితేష్ తివారీ (Nitesh Tiwari) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ (Ramayana) సినిమాలో సీతాదేవి పాత్రను కేవలం సున్నితమైన ఇల్లాలిగా కాకుండా, ఒక బలమైన, సాహసోపేతమైన యోధురాలిగా చూపించబోతున్నట్లు సమాచారం… (ఆమె యోధురాలు కాబట్టే శివధనుస్సు కిందకు బంతి వెళ్తే, ధనుస్సును ఎత్తి, బంతిని తిరిగి తీసుకుంటుంది)…

ఈ చిత్రంలో సీతాదేవి పాత్రను పోషిస్తున్న సాయి పల్లవి లుక్‌కి సంబంధించి, ఆమె చేతిలో కత్తితో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉన్న పోస్టర్స్ లేదా గ్లింప్సెస్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి… సాంప్రదాయ పురాణ గాథలకు భిన్నంగా, నేటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో సీత పాత్రను మరింత పవర్-ప్యాక్డ్‌గా, ధైర్యసాహసాలు ప్రదర్శించే ఒక యోధురాలి కోణంలో మలుస్తున్నట్లు తెలుస్తోంది…

అవును... పురాణాలలోని ఆయా పాత్రలకు మోడర్న్ డే సినిమాటిక్ లిఫ్ట్ ఇస్తూ, బలమైన మహిళా పాత్రలను ఆవిష్కరించే ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఎక్కువగా కనిపిస్తోంది..! నితేశ్ కూడా రామాయణాన్ని కొత్తగా చెప్పబోతున్నాడు... అది మాత్రం పక్కా !! మరి ఓ వారియర్ సీతను అంత సులభంగా రావణుడు కిడ్నాప్ చేశాడు? అదెలా చెప్పబోతాడనేదే సస్పెన్స్ !!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Sita – Warrior of Mithila – సీత అసూర్యంపశ్య కాదు – యోధురాలు !!
  • తలెగరేసిన తెలంగాణ ! ఏ దొరవారు లేరనో అభివృద్ధి ఆగదు !!
  • సోలో బతుకే సో బెటర్ ! పెళ్లి కాలేదని ఎంతమాత్రమూ చింతించవలదు !
  • సీతకన్నా బాగుంది! ఇది ఓ ట్రోల్ పోలిక! ఇంతకీ ఈమె ఎవరంటే?!
  • దొరతనం ! అవలక్షణులను తెలంగాణపై రుద్దిన క్షుద్రరాజకీయం !!
  • “వైభవ్ సూర్యవంశీ – ఓవర్ హైప్‌తో అసలు ఒరిజినాలిటీకే గండం?”
  • ఖర్మాఖ్య ! అదిరె అభి సినిమా బెదిరె ! ఫస్టాఫ్ టోటల్ వేస్ట్ !
  • Untold Stories – రామాయణ్‌లో ఈమె ఎవరో, పాత్ర ఏమిటో ఊహించండి ?!
  • రేవంత్ సరైన చర్చ రేపాడు ! ఇవిగో కొన్ని ఇంజినీరింగ్ చేదు వాస్తవాలు !!
  • అజింక్యా అంటేనే అజేయుడు – స్థితప్రజ్ఞుడు… కానీ సరైన వీడ్కోలు లేదు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions