Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హరీష్ రావును తిట్టాలంటే… హిందూ గుళ్లు, దేవుళ్లను కించపరచాలా?!

August 4, 2026 by M S R

.

ఎస్, హరీష్ రావు రకరకాల ఆధారరహిత నిందారోపణలు, వక్రబాష్యాలు, వితండవాదాలతో రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత దాడి చేస్తున్న మాట నిజమే… కానీ అది రాజకీయం, దాన్ని అలాగే ఎదుర్కోవాలి, రేవంత్ రెడ్డి కౌంటర్ల తరహాలోనే… అంతేతప్ప, క్షుద్రపూజలు వంటి విమర్శలతో గుళ్లను, హిందూ మతాన్ని, దేవుళ్లను అవమానించడం సరికాదు…

హరీష్ రావు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డిలకు లీగల్ నోటీసులు ఇవ్వడంలో తప్పేమీ లేదు… ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు నేతలకు మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు… ఎందుకంటే, అవి నీచాభిరుచి వ్యాఖ్యలు… బీఆర్ఎస్‌ నేతలను టార్గెట్ చేసి విమర్శ చేయాలంటే యాంటీ హిందూ పోకడలు అస్సలు అవసరం లేదు…

Ads

‘రాష్ట్రంలో వానలు పడకూడదు, తద్వారా ప్రజల్లో అసంతృప్తి పెరగాలని హరీష్ రావు షిమోగా వంటి  గుళ్లు తిరిగి క్షుద్రపూజలు చేస్తున్నారు’ అని ఆ నేతల ఆరోపణ… నిజానికి ఆ గుళ్ల గురించి తెలిస్తే కదా వీళ్లకు… కర్నాటకలోని మూకాంబిక టెంపుల్‌కు అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు వెళ్తుంటారు… రీసెంటుగా టీవీకే విజయ్ కూడా వెళ్లాడు…

ఆ ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు హిందూయిజంపై, ఆధ్యాత్మికతపై, హిందువుల మనోభావాలపై నమ్మకం లేకపోవచ్చు, ఐనంతమాత్రాన ఇష్టారాజ్యం విమర్శలు చేయాలా..? హరీష్ రావుపై ఇంకా పదునైన విమర్శలు ఏమైనా సబ్జెక్టును బట్టి కౌంటర్ చేయండి, తప్పులేదు, ఎదురుదాడికి తను అర్హుడే… కానీ గుళ్లపై పడటం దేనికి..?

మూకాంబిక

మూకాంబికా దేవి క్షేత్రం ఆదిశంకరాచార్యుల చేత ప్రతిష్ఠించబడిన అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి… విహిత ఆగమ పద్ధతుల్లో పూజలు జరుగుతాయి అక్కడ… మరి క్షుద్ర పూజలు జరుగుతాయనే క్షుద్ర నిందలు దేనికి..? క్షుద్ర పూజలు వేరు, వామాచార పూజలు వేరు… క్షుద్ర పూజలు జరిగే ప్రదేశాలు వేరు, అవి శక్తిపీఠాల్లో జరగవు… వామాచార పద్ధతుల్లో జరిగే పూజలు కూడా అన్ని గుళ్లల్లో జరగవు… 

ఐనా అలాంటి నెగెటివ్ రిజల్ట్ కోరుకునే పూజల్ని ఎవరూ కుటుంబసమేతంగా వెళ్లి చేయరు, పైగా వర్షాలు పడకూడదు వంటి కోరికలతో ఎవరూ గుళ్లకు వెళ్లరు… క్షమాపణ చెప్పండి, లేకపోతే క్రిమినల్ కేసు పెడతాను అంటున్నాడు హరీష్ రావు… సరే, ఈ కేసులతో అయ్యేదేముంది గానీ… కాంగ్రెస్ నాయకులు రాజకీయ కౌంటర్లకు, క్షుద్ర వ్యాఖ్యలకు నడుమ తేడా మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి..!!

అసలే లష్కర్ బోనాల పండుగలో మాతంగి బోనం సహా మూడునాలుగు బోనాలు కింద పడిన అపశకునం… దానికితోడు మూకాంబిక కూడా శాపాలు పెట్టాలా కాంగ్రెస్ పార్టీకి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘హీరో’ విజయ్… ఉదయనిధిపై కొరడా… స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్ !!
  • ఆశ్చర్యపరిచే చిత్రం ! ఈ సామూహిక తర్పణాల కథేమిటో తెలుసా !!
  • హరీష్ రావును తిట్టాలంటే… హిందూ గుళ్లు, దేవుళ్లను కించపరచాలా?!
  • ‘‘ఆదిపురుష్’ పైత్యం ఉందేమో… ముందుగా మాకు చూపించాల్సిందే’’
  • అయ్యో రజినీ శంకరా ! మీ ‘రోబో’ కథ వెనుక ఇదా అసలు కథ ?!
  • తమిళ కార్తీకదీపం ! స్టాలిన్ బాటలో విజయ్ ! సుప్రీంలో తొలి ఎదురుదెబ్బ !!
  • ‘వరల్డ్ టాప్ స్ట్రీట్ ఫుడ్’ టాప్-50 జాబితాలో మన మూడు నగరాలు!!
  • ఫీల్డ్ వదిలేసి ఊరు వెళ్లిపోయేందుకు మూటాముల్లె సర్దుకున్నాను !
  • “పఠానులకు చెప్పండి… చౌహాన్ వస్తున్నాడు!” 
  • కామాఖ్య మానస పూజ- దేవధని ఉత్సవాలు..! పెద్ద బలులు బంద్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions