.
ఈ విషయంలో మాత్రం టీవీకే సీఎం విజయ్‌ను మెచ్చుకోవచ్చు… పిచ్చి కూతలకు, వెకిలి వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన ఉదయనిధిపై కొరడా ఝలిపించాడు…, సోవాట్, స్టాలిన్ కొడుకు అయితేనేం, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలతో ఏకంగా సీఎం ‘స్నేహితురాల్ని’, అన్నీ అనుకూలిస్తే కాబోయే సతీమణిని వెకిలిగా దూషించిన నాయకుడి స్టేటస్ ఎంతుంటేనేం..? ప్రతిపక్ష నేత అయితేనేం… కేసు పెట్టాడు, లోపలేయడానికి పోలీసులను మొహరించాడు… తద్వారా, ఇదుగో వీడు ఇలాంటోడు అని అధికారికంగా ‘రికార్డ్’ చేశాడు, సమాజానికి చాటిచెప్పాడు…
గట్స్..! What ever may come… ఎలాగూ ప్రభుత్వాన్ని పడగొడతాన్ అని స్టాలిన్ తొడగొడుతున్నాడు కదా, కమాన్, చూసుకుందాం అంటున్నాడు… ఆల్రెడీ డీఎంకే కీలకనేత సెంథిల్ బాలాజీ మీద కేసుల్ని తాజాగా తవ్వుతున్నాడు కదా, ఇప్పుడు ఉదయనిధి… ప్రత్యక్షంగానే స్టాలిన్‌కు సవాల్ విసిరాడు…
Ads
ఇంతకీ వివాదం ఏమిటంటే..? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, సినీ నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన పరోక్ష ‘డబుల్ మీనింగ్’ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. సోమవారం (ఆగస్టు 3, 2026) తంజావూరులో డీఎంకే ఆధ్వర్యంలో కావేరీ జలాల పంపకాల వివాదంపై ఒక నిరసన సభ జరిగింది.
ఈ సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ.. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సీఎం విజయ్ (TVK పార్టీ) ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శిస్తున్నాడు… ఆయన మాట్లాడుతున్న సమయంలో సభలో కింద ఉన్న కొందరు డీఎంకే కార్యకర్తలు కావాలనే “త్రిష… త్రిష…” అని గట్టిగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
అప్పుడు తన ప్రసంగాన్ని ఆపిన ఉదయనిధి.. చిరునవ్వు నవ్వుతూ “కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా.. ఈ ‘నీళ్లు’ మాత్రం కచ్చితంగా అక్కడికి వెళ్తాయి” డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు…
సభలోని జనం నవ్వడంతో, వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ “కాదు, నేను కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నాను” అని అన్నాడు. కానీ, అది నేరుగా సీఎం విజయ్, త్రిషలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యేనని స్పష్టంగా అర్థమవుతోంది… (గతంలో సనాతన ధర్మం మీద చేసిన వైరస్ వ్యాఖ్యలు తెలుసు కదా)… నోరిప్పితే వెగటు, రోత…
ఉదయనిధి చేసిన ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలపై అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ మహిళా విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
రాజకీయ విమర్శల ముసుగులో ఒక మహిళను కించపరిచేలా, ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌కు (NCW) కూడా టీవీకే పార్టీ ఫిర్యాదు చేసింది.
ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని టీవీకే, బీజేపీతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఉదయనిధి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి, రాజకీయాలతో సంబంధం లేని ఒక మహిళ పేరును లాగి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం పట్ల తమిళనాడు వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి….
‘వల్గర్ నిధి’ అని టీవీకే వర్గాలు విరుచుకుపడుతుండగా… ‘అయ్యో, అయ్యో, ఇది కక్షసాధింపు’ అని డీఎంకే నేతలు ఏడుపులు స్టార్ట్ చేశారు… తాజా వార్త... ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్టు చేశారు, కానీ తను యాంటిసిపేటరీ బెయిల్ కోసం రావడంతో... 12 గంటల వరకు అరెస్టు ఆపాలని హైకోర్టు సూచించింది... తదుపరి చూడాలిక...
Share this Article