Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కైకేయి దుస్తుల ప్రతి రంగుకూ ఓ ఉద్వేగం – కాస్ట్యూమర్ల భేషైన స్పందన !

August 4, 2026 by M S R

.

రామాయణ సినిమా దుస్తుల వివాదం: డిజైనర్ల స్పందన… మనం బతుకుతున్న ట్రోలింగ్ శకంలో ప్రతిదీ సమస్యే, ప్రతిదీ వివాదమే… హిందూ, ఆధ్యాత్మిక, మత వ్యవహారాలకొచ్చేసరికి ప్రతి ఒక్క గొంతుకూ అనంతమైన స్వేచ్ఛ… నితీశ్ తివారీ ఏదో భారీ ‘రామాయణం’ ప్రాజెక్టు చేపట్టాడు…

తనకంటూ ఓ క్రియేటివ్ లైన్ ఉంటుంది, దాన్ని బట్టే కొత్తగా ఆ ఇతిహాసాన్ని ప్రజెంట్ చేయాలని అనుకుంటాడు… దానికి అనేక వృత్తినిపుణుల విభాగాలు సహకరిస్తాయి… ఐతే దీనిపై విమర్శలు ఎక్కడికి చేరాయంటే… సాయిపల్లవి గిరజాల జుట్టు దగ్గర నుంచి కైకేయి పాత్ర పోషించే లారా దత్తా మోడరన్ ఆహార్యం దాకా…

Ads

సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి బ్లౌజ్ ధరించడం, కైకేయి పాత్రలో నటిస్తున్న లారా దత్తా లుక్స్ టీవీ సీరియల్స్‌ను పోలి ఉన్నాయంటూ నెటిజన్లు రకరకాల మీమ్స్ చేశారు… ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్న ప్రముఖ జంట రింపుల్, హర్‌ప్రీత్ నరులా ఈ విమర్శలపై స్పందించారు… వారి స్పందన భేషుగ్గా ఉంది… ట్రోలర్లకు వాళ్ల అభిరుచిని, ఆలోచన స్థాయిని అందుకోవడం అసాధ్యం…

భావోద్వేగాలతో ముడిపడిన ఇతిహాసం…: రామాయణం అనేది కేవలం ఒక సినిమా కాదని, తరతరాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయిన ఒక మహాకావ్యమని రింపుల్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే కాస్టింగ్, కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై భిన్నాభిప్రాయాలు వస్తాయని తాము ముందే ఊహించినట్లు ఆమె వెల్లడించారు.

చారిత్రక కచ్చితత్వం కాదు – సృజనాత్మకత…: త్రేతా యుగానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు గానీ, అసలైన దుస్తులు గానీ నేడు అందుబాటులో లేవని రింపుల్ స్పష్టం చేశారు. పురావస్తు ఆధారాల కంటే, భక్తితో కూడిన సాంస్కృతిక జ్ఞాపకాల ఆధారంగానే డిజైన్లు చేసినట్లు ఆమె చెప్పారు.

దేవాలయ శిల్పాలు, రవివర్మ చిత్రాల స్ఫూర్తి…: తరతరాలుగా మనం చూస్తున్న క్యాలెండర్ ఆర్ట్, దేవాలయ శిల్పాలు, రాజా రవివర్మ పెయింటింగ్స్, వివిధ సంస్కృతుల్లోని రామాయణ చిత్రణల ఆధారంగానే ఈ వస్త్రాలను తీర్చిదిద్దినట్లు వారు వివరించారు. ఇది తమదైన శైలిలో చేసిన ఒక దృశ్య రూపమని తెలిపారు.

కైకేయి దుస్తుల వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి?

కైకేయి పాత్రధారి లారా దత్తా వేసుకున్న దుస్తులపై వస్తున్న ట్రోల్స్‌పై హర్‌ప్రీత్ స్పందించారు. ఆ దుస్తుల రంగుల వెనుక బలమైన భావోద్వేగం ఉందని ఆయన తెలిపారు:

  • పచ్చ రంగు: మాతృత్వాన్ని (అమ్మతనాన్ని) సూచిస్తుంది.

  • ముదురు ఎరుపు (మరూన్) రంగు: ఆమె జీవితంలో తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయానికి సంబంధించిన భావోద్వేగ బలాన్ని, ఆ చీకటిని ప్రతిబింబిస్తుంది.

  • ఆమె ఆవేదన: కైకేయి తన స్వంత కొడుకు, రాముడి మధ్య నలిగిపోయే పాత్ర. అందుకే ప్రతి రంగునూ ఎంతో ఆలోచించి ఎంపిక చేశామని, పూర్తి సినిమా చూడకుండానే కొందరు ముందుగానే అభిప్రాయానికి వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు సినిమాను చూడండి, అనుభవించండి, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి” అని డిజైనర్లు కోరారు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కైకేయి దుస్తుల ప్రతి రంగుకూ ఓ ఉద్వేగం – కాస్ట్యూమర్ల భేషైన స్పందన !
  • ఆటో అనే పేరెలా వచ్చిందో తెలుసా..? వినదగునెవ్వరు చెప్పిన…!
  • ‘హీరో’ విజయ్… ఉదయనిధిపై కొరడా… స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్ !!
  • ఆశ్చర్యపరిచే చిత్రం ! ఈ సామూహిక తర్పణాల కథేమిటో తెలుసా !!
  • హరీష్ రావును తిట్టాలంటే… హిందూ గుళ్లు, దేవుళ్లను కించపరచాలా?!
  • ‘‘ఆదిపురుష్’ పైత్యం ఉందేమో… ముందుగా మాకు చూపించాల్సిందే’’
  • అయ్యో రజినీ శంకరా ! మీ ‘రోబో’ కథ వెనుక ఇదా అసలు కథ ?!
  • తమిళ కార్తీకదీపం ! స్టాలిన్ బాటలో విజయ్ ! సుప్రీంలో తొలి ఎదురుదెబ్బ !!
  • ‘వరల్డ్ టాప్ స్ట్రీట్ ఫుడ్’ టాప్-50 జాబితాలో మన మూడు నగరాలు!!
  • ఫీల్డ్ వదిలేసి ఊరు వెళ్లిపోయేందుకు మూటాముల్లె సర్దుకున్నాను !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions