Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లోకేష్ బాబు గారూ… ఈమె అడుగుతోంది, మీ మంత్రి యవ్వారం ఏమిటని !!

August 5, 2026 by M S R

.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని ఓ మంత్రి అనుచిత ప్రవర్తనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని డాక్టర్ శైలా తాళ్లూరి పేర్కొన్నారు… ఈ విషయంపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు…

“లోకేష్ గారూ.. మీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి అనుచిత ప్రవర్తనపై నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించండి. పారదర్శకంగా విచారణ జరిపి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలి” అని ఆమె పోస్టులో పేర్కొన్నారు…

Ads

డాక్టర్ శైలా తాళ్లూరి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆమె ఏ మంత్రి గురించి మాట్లాడారనే విషయాన్ని వెల్లడించలేదు. అలాగే ఈ ఆరోపణలపై సంబంధిత మంత్రి లేదా ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి…

PURE సేవా సంస్థ ద్వారా ఆమె తెలుగునాట చాలామందికి తెలుసు… ఆమె స్ట్రెయిటుగానే అడుగుతోంది లోకేష్‌ను… అందుకెే ఈ కలకలం… ఈ కథనం రాసే సమయానికి టీడీపీ క్యాంపు నుంచి ఏ స్పందన లేదు… ఏమో, చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కల్యాణ్ బాబులు ఏం స్పందిస్తారో చూడాల్సి ఉంది…

శైలా

ఆమె మొదటి పోస్టు…

అప్పట్లో డాల్లస్ నాటాలో నాతో వెదవవేషాలు వెయ్యబోయిన అన్నకి..
బహిరంగలేఖ..
మొన్న గనక నీవు తల తిప్పుకుని వెళ్ళుంటే నాకు ఈ పోస్ట్ రాసే టైం మిగిలేది అన్నా
ఏమి పీకలేదు నువ్వు అనే knowing look తో పలకరించావు చూడు.. అది నచ్చలేదు నాకు

Of course ఏమీ తెలియనట్లు నేనూ ప్రతి నమస్కారం చేసా..
తెలంగాణ గాలి నీరుతో పెరిగిన ధైర్యం ఎంతుందో
వాటితో పాటు పల్నాడు బ్లడ్ మరి..ఆ పౌరుషం ఎక్కడికి పోతుంది చెప్పు.. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే ఆంధ్రా తెలివి కూడా వుంది

అది సరే గానీ నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా.. నీ మినిస్టర్ ఫ్రెండ్ వాళ్ళకి పంపే తన కాళ్ళు చేతుల ఫోటోలు నాకు కూడా పంపాడు.. అప్పోయింట్మెంట్ అప్పోయింట్మెంట్ అని అడపా దడపా వాళ్ళతోపాటు నాకు కూడా మెసేజ్ పెడుతున్నాడు..
అన్నట్టు… ఈ టైంలైన్ కూడా అర్థం అయినా
సరేలే, పేదపిల్లల కోసం కాస్త అవమానంగా అనిపించినా భరించేద్దాం అని ఇగ్నోర్ చేసా

  • నేను ఇక్కడ మినిస్టర్ ఫోటో పెట్టటం
    – నీ కొత్త నంబర్ నుండి వెంటనే నాకు మెసేజ్ రావడం
    – నేను నిన్ను బ్లాక్ చేసే లోపు
    – అక్కడ మినిస్టర్ “అక్కా, అమ్మా’ పిలుపు నుండి కాళ్ళు చేతుల ఫోటోలు పంపడం మొదలు పెట్టడం
    Just because I ignored it .. doesn’t mean I did not understand

ఆంధ్రప్రదేశ్ లో పేద పిల్లలకి యువతకి అందే కాస్త సపోర్ట్ కూడా నీలాంటి బ్రోకర్ నా కొడుకుల వల్ల ఆగుతోంది అన్నా
వుండు, నీ ఫ్యామిలీ ఫోటో ఒకసారి చూసి వస్తా… భార్యా పిల్లల మీద ఒకసారి కాస్త ఎక్కువ జాలి పడాలి అని ఉంది



తరువాత మరో పోస్టు…
Nara Lokesh Clean up your cabinet bro
Contact me if you want details on a sleazy Minister of yours.



“అప్పుడే ఎందుకు చెప్పలేదు”
“ఫలానా వారికి చెప్పాల్సింది కదా”
“మాకు చెప్పాల్సింది కదా”
ఒక్క “sorry you had to go through this” అనే మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నారు.
చాలా రెస్పెక్ట్ఫుల్ గా అడుగుతున్నాను…
ఇప్పుడు చెప్తున్నాను కదా…
ఏమి పీకుతున్నారు? పీకారు సో ఫార్??!!!
—

ఆ భోగాపురం పీపుల్ బెటర్… చెట్లు పీకింది ఇంకో చోట నాటటానికి.. ఎట్ లీస్ట్
నా దగ్గర ఏదైతే చాట్ హిస్టరీ అండ్ స్క్రీన్షాట్స్ ఉన్నాయో అవే ఆ మినిస్టర్ దగ్గర కూడా వుంటాయి…పేరు చెప్పానుగా ఫోన్ లో
Ask him.. ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది అటు సైడ్ చెక్ చేస్తే

—
టేక్ ఛాట్ జీపీటీ హెల్ప్ ఎలా మాట్లాడాలో నాతో ముందు.
Making a person who carries herself with grace stoop down to using the language I had to this past decade.. such shame!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లోకేష్ బాబు గారూ… ఈమె అడుగుతోంది, మీ మంత్రి యవ్వారం ఏమిటని !!
  • కైకేయి దుస్తుల ప్రతి రంగుకూ ఓ ఉద్వేగం – కాస్ట్యూమర్ల భేషైన స్పందన !
  • ఆటో అనే పేరెలా వచ్చిందో తెలుసా..? వినదగునెవ్వరు చెప్పిన…!
  • ‘హీరో’ విజయ్… ఉదయనిధిపై కొరడా… స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్ !!
  • ఆశ్చర్యపరిచే చిత్రం ! ఈ సామూహిక తర్పణాల కథేమిటో తెలుసా !!
  • హరీష్ రావును తిట్టాలంటే… హిందూ గుళ్లు, దేవుళ్లను కించపరచాలా?!
  • ‘‘ఆదిపురుష్’ పైత్యం ఉందేమో… ముందుగా మాకు చూపించాల్సిందే’’
  • అయ్యో రజినీ శంకరా ! మీ ‘రోబో’ కథ వెనుక ఇదా అసలు కథ ?!
  • తమిళ కార్తీకదీపం ! స్టాలిన్ బాటలో విజయ్ ! సుప్రీంలో తొలి ఎదురుదెబ్బ !!
  • ‘వరల్డ్ టాప్ స్ట్రీట్ ఫుడ్’ టాప్-50 జాబితాలో మన మూడు నగరాలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions