Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)

August 6, 2026 by M S R

.

మొత్తానికి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో క్షుద్ర పూజల మీద ఆసక్తిని, చర్చను రేకెత్తించాడు… తెలంగాణలో వర్షాలు పడకుండా జనం మాడిపోవాలనీ, తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి, అది తమకు రాజకీయంగా అనుకూలించాలనే భావనతో తను షిమోగా, తిరుచ్చి ఏరియాల్లో క్షుద్ర పూజలు చేశాడని కదా కాంగ్రెస్ ఆరోపణ…

సరే, దానికి ఈయన లీగల్ నోటీసులు పంపించడం, ఐనా సరే, మాదగ్గర బొచ్చెడు ఆధారాలున్నయ్, కేసులకు భయపడేది లేదు, నిరూపిస్తాం అని కాంగ్రెస్ తన విమర్శల మీద స్థిరంగా నిలబడటం… ఈ వార్తలు ఒకరకంగా రాజకీయాల్లో ఓ భిన్నమైన కలకలం…

Ads

ఈ తరానికి మామూలు పూజలే తెలియవు… ఇక క్షుద్ర పూజలు ఎలా తెలుస్తాయి అంటారా..? లేదు, ఈరోజుకూ మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్న పెద్ద పెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉన్నారు… అన్నీ రహస్యంగా సాగిపోతుంటాయి… ఒకరకంగా గతంలోకన్నా ఇప్పుడే ఎక్కువగా ఈ క్షుద్ర పూజలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి… హరీష్ రావు దీనికి మరింత ప్రాముఖ్యత తీసుకొచ్చాడు…

అసలు ఏమిటి ఈ క్షుద్ర పూజలు..? అనేక పల్లెల్లో, ఓ మోస్తరు పట్టణాల్లో ఈరోజుకూ చేతబడి, చిల్లంగి, బాణామతి వంటివి కనిపిస్తూనే ఉన్నాయి… (కాష్మోరా వంటివి క్రియేటెడ్ తంత్రపూజలు, అవి క్షుద్ర సాహిత్యంలో కనిపిస్తాయి)…

ఐతే ఇవన్నీ మంచి కోసం కాదు, చెడు కోసం ఉద్దేశించిన నెగెటివ్ యాక్షన్స్… చెడు ఆత్మల్ని ప్రసన్నం చేసుకుని, వాటి ద్వారా తమ ప్రత్యర్థులపై ప్రయోగించడం వీటి కాన్సెప్ట్… అంటే, దేవతలు పాజిటివ్ వైబ్స్ అయితే, ఈ ఆత్మలు నెగెటివ్ వైబ్స్…

ప్రత్యర్థికి సమస్యలు రావాలి, ఒక రాజ్యం క్షామపీడితం కావాలి అనే కోరికలు క్షుద్ర ఆలోచనలు, క్షుద్ర పూజలే నెరవేరుస్తాయి తప్ప ఇతరత్రా పాజిటివ్ పూజల్లో అవి సాధ్యం కావు… ఇంకా అర్థం కాావాలంటే ఇంకాస్త లోతుకు వెళ్దాం…

black magic

దేవుడో, దెయ్యమో… ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల పూజలు, క్రతువులు ఉంటాయి… పూజలు, తంత్ర మార్గాలలో… అంటే మంత్రాలో, తంత్రాలో…. వామాచార పూజలు, క్షుద్ర పూజలు, ఆగమశాస్త్ర పూజలు, దక్షిణాచార పూజలు అనేవి అత్యంత ప్రాముఖ్యమైనవి, భిన్నమైన పద్ధతులు కలిగినవి అనుకుందాం…. అవీ రకరకాలు, బలులు, దుష్టశక్తుల్ని ఆవాహన చేసుకోవడం తాంత్రిక మార్గం కాగా… దేవతలను ప్రార్థించడం దానికి వ్యతిరేక పాజిటివ్ క్రతువులు…

చాలామందికి క్షుద్ర పూజలకీ, వామాచార పూజలకు తేడా తెలియదు… వామాచార పూజలు దుష్టశక్తుల్ని ఆశ్రయించడానికి కాదు… చెడు కోసం కాదు… దుర్గ, కాళి, కామాఖ్య…, భగాలాముఖి, చిన్నమస్త, రాజశ్యామల వంటి దశమహావిద్యలు, గ్రామదేవతలు (అంటే ఎల్లమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ, ఉప్పలమ్మ వంటి దేవతలు)… అంటే ప్రధానంగా శక్తిరూపాల్ని ప్రసన్నం చేసుకోవడం…

  • ‘వామ’ అనగా ఎడమ లేదా వ్యతిరేకమైనది అని అర్థం. వేద మార్గానికి (దక్షిణాచారానికి) విరుద్ధమైన లేదా భిన్నమైన మార్గంలో చేసే సాధన ఇది… తంత్ర శాస్త్రానికి సంబంధించిన ఒక భాగం. ఇందులో ప్రధానంగా ఐదు మకారాలు (మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైధునం), శ్మశాన సాధనలు ఉంటాయి… వీటిని చేయించే పద్దతులు వేరు, స్థూలంగా ఐదు మకరాలే ముఖ్యం… కామాఖ్య ఈ పూజలకు ఫేమస్… అక్కడ బలులు ప్రధాన ఆలయంలోనే జరుగుతాయి…

ఇంద్రియాలను జయించడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడం, షట్చక్రాలను మేల్కొలపడం, కుండలినీ శక్తిని జాగృతం చేయడం లక్ష్యమే అయినా… శక్తిరూపాల సత్వర ప్రసన్నతను ప్రధానంగా కర్త కోరుకుంటాడు…

  • మరి క్షుద్ర పూజలు (Kshudra Poojas / Black Magic)? ఆగమశాస్రం, దక్షిణాచారం, అఘోరా, హోమాలు, యాాగాలు? తరువాయి కథనంలో చెప్పుకుందాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)
  • ఇక నా జీవితానికి క్యాలెండర్ అవసరం లేదు… గడియారం చాలు…
  • ప్రధాని వీడియో పీకిపారేస్తేనే నొప్పి తెలిసింది- చురుకు పుట్టింది !!
  • కల్తీకి ‘పాలు’పడ్డవాడెవడినీ వదల్లేదు – ఎవరికీ మింగుడుపడడు !!
  • కర్ణుడి చావుకు లక్ష కారణాలు… బీజేపీ ఓటమికి లక్షాఒకటి !
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • చరిత్ర మళ్లీ మొదటికే… 200 ఏళ్లు… ప్రపంచ ఆర్థిక శక్తి మళ్లీ ఆసియాదే !
  • ‘‘నేనేంటి? అన్నమయ్యనేంటి? నన్ను వదిలేసేయండి సార్ ప్లీజ్’’
  • ఊరంతా ఓ దారి – ఈ ప్రేమలతది మరో దారి – రోతనిధికి జైకొట్టే దారి !!
  • మద్యం కంపెనీలపై బ్యాన్ ! అసలు నిజం వేరు – మీడియా రాసేది వేరు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions