Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)

August 6, 2026 by M S R

.

హరీష్ రావు క్షుద్రపూజల కలకలం కథనాలకు ఇది కొనసాగింపు 4 భాగం, చివరిది… సరే, రకరకాల మార్మిక, ఆధ్యాత్మిక పూజల గురించి చెప్పుకున్నాం కదా, మరి అఘోరాలు, పితృ‌కర్మలు,, హోమాలు, యాగాలు..? అవి మళ్లీ వేరు…

అఘోరాల సాధనలు వ్యక్తిగతం, సమాజానికి సంబంధం లేదు… వాళ్ల జీవన విధానం వేరు… ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా వాళ్ల కర్మలు ఉంటాయి… ప్రత్యేకించి శివారాధకులు… పూర్తిగా వేరు, అఘోరాలు, నాగసాధువులు కుంభమేళా వంటి సామూహిక విశేష సందర్భాల్లో మాత్రమే వేలుగా, లక్షలుగా బయటికొస్తారు… వీళ్లంతా మన దేశంలోనే ఉంటున్నారా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తారు…

Ads

దిగంబరం, నాట్యం, భీకరం, మార్మిక ప్రవర్తన… అసలు చెప్పాలంటే అఘోరా అంటేనే ఓ అనంతమైన మార్మిక ప్రపంచం… సరే, చేతబడి వంటివి క్షుద్ర పూజలు అయినట్లే… మనం సాధారణంగా నిర్వహించే హోమాలు, యాగాలు ఏమిటి..?

ఇవి ‘వైదిక కర్మలు’ లేదా ‘యజ్ఞ సంప్రదాయం’… వీటిని శాస్త్రీయంగా “వైదిక యజ్ఞ- యాగాది కర్మలు” లేదా “స్మార్త / శ్రౌత కర్మలు” అని పిలుస్తారు…

యజ్ఞం / యాగం…: వేద మంత్రోచ్ఛారణలతో, అగ్నిహోత్రంలో ప్రత్యేక ద్రవ్యాలను (నెయ్యి, సమిధలు, హవిస్సు) ఆహుతిగా ఇవ్వడాన్ని యజ్ఞం లేదా యాగం అంటారు.

హోమం…: యాగంతో పోలిస్తే ఇది చిన్న రూపం. నిత్యం లేదా నైమిత్తికంగా (ప్రత్యేక సందర్భాలలో) చేసే అగ్ని కార్యాలను హోమం అంటారు. (ఉదాహరణకు: గణపతి హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం మొదలైనవి).

వీటి ప్రత్యేకతలు…: అగ్ని ప్రధానం…: ఈ పూజా విధానంలో ‘అగ్ని దేవుడు’ ప్రధాన మాధ్యమంగా ఉంటాడు. అగ్నిలో వేసిన హవిస్సును (నైవేద్యాన్ని) దేవతలు స్వీకరిస్తారని నమ్ముతారు.

వేద మంత్రాల శక్తి…: ఇవి పూర్తిగా రుగ్వేద, యజుర్వేద తదితర వేదాల నుండి సేకరించిన పవిత్ర మంత్రాలతో, కచ్చితమైన స్వరశుద్ధితో నిర్వహించబడతాయి.

ఉద్దేశం / లక్ష్యం…: ఇవి వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా, “లోక కల్యాణం” (సమస్త లోకాల క్షేమం), వర్షాలు కురవడం, ప్రకృతి సమతుల్యత, సర్వజనుల ఆయురారోగ్యాలు, శాంతి కోసం నిర్వహిస్తారు. అంటే హరీష్ చేసినట్టు చెప్పబడుతున్న పూజలకు పూర్తి వ్యతిరేకం… ఆయుత చండీయాగం వంటి క్లిష్టమైన క్రతువు చేసిన కేసీయార్ కుటుంబసభ్యుడు వర్షాలు కురియకుండా పూజలు చేయించాడనే ఆరోపణలు ఓ వైపరీత్యమే…

(వర్షాల కోసం వరుణయాగం కూడా ఉంటుంది)… సమూహ భాగస్వామ్యం…: బ్రాహ్మణ రుత్వికులు (వేద పండితులు) అగ్ని ప్రతిష్ట చేసి, యజమానితో కలిసి శాస్త్రోక్తంగా ఈ క్రతువును పూర్తి చేస్తారు. ఇందులో ఎవరికీ ఎలాంటి హాని జరగదు, పైగా పర్యావరణ శుద్ధి కలుగుతుందని శాస్త్ర వచనం.

క్లుప్తంగా చెప్పాలంటే: హోమాలు, యాగాల ఉద్దేశం లోక క్షేమం మరియు దైవ ప్రీతి (వైదిక మార్గం). చేతబడి, బాణామతి, చిల్లంగి వంటివి ఇతరులకు హాని చేసే క్షుద్ర మార్గాలు. అఘోరాల సాధన అనేది ప్రత్యేకమైన తాంత్రిక శివారాధన (ఇది కేవలం సిద్ధి కోసమే కానీ ఇతరులను నాశనం చేయడానికి కాదు)…

black magic

మరి పితృకర్మలు..? ఇవి ప్రేతాత్మకర్మలు కావు, ఇవి మరణించిన మన పూర్వీకుల ఆత్మల శాంతి కోసం, వాటి సద్గతుల కోసం ఉద్దేశించినవి… గయ, త్య్రయబంకేశ్వర్ వంటి చోట్ల ఫేమస్… నిజానికి ఎవరైనా మరణించాక చేసే కర్మకాండ కూడా ఇదే… సాదరంగా ఆత్మల్ని పితృదేవతల్లో కలిపేయడం… ఇది సత్యనారాయణవ్రతాలు, మామూలు పూజలు చేసుకునే పంతుళ్లలోనూ చాలామందికి తెలియదు…

శ్రద్ధగా చేయాలి, మంత్రోచ్ఛారణ స్పష్టంగా ఉండాలి, కొందరే చేయగలరు… ఇవి కేవలం మన పూర్వీకులను స్మరించుకునే శ్రాద్ధకర్మలు మాత్రమే… సో, చెబుతూ పోతే, క్షుద్రపూజల చుట్టూ రాస్తూ పోతే అది అనంతం, జస్ట్, ఇదంతా ఓ పరిచయం మాత్రమే… అదీ స్థూలంగా, పైపైన ఉపోద్ఘాతం మాత్రమే…

అవునూ, హరీష్ రావు నిజంగానే తెలంగాణ సమాజాన్ని నష్టపరిచే క్షుద్రపరిచే పూజలు చేయించాాడా..? ఏమో, పీసీసీ మహేశ్ చెబుతున్నాడు కదా, ఆధారాలున్నాయి అని… సరైన సమయంలో బయటపెడతాడేమో చూద్దాం..!!

.

ఇంతకీ క్షుద్ర శక్తులు నిజమేనా? భలే వారే… పొలిటిషియన్లను ఆశ్రయించి క్షుద్ర పోకడలతో కలకలం సృష్టించేవి అవే కదా…!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)
  • క్షుద్రోపాసన ! నెత్తురు, మద్యం, ఎముకలు, పుర్రెలు ! (మూడో భాగం)
  • దుష్టశక్తి కాష్మోరాలు !! అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? (రెండో భాగం)
  • హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)
  • ఇక నా జీవితానికి క్యాలెండర్ అవసరం లేదు… గడియారం చాలు…
  • ప్రధాని వీడియో పీకిపారేస్తేనే నొప్పి తెలిసింది- చురుకు పుట్టింది !!
  • కల్తీకి ‘పాలు’పడ్డవాడెవడినీ వదల్లేదు – ఎవరికీ మింగుడుపడడు !!
  • కర్ణుడి చావుకు లక్ష కారణాలు… బీజేపీ ఓటమికి లక్షాఒకటి !
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • చరిత్ర మళ్లీ మొదటికే… 200 ఏళ్లు… ప్రపంచ ఆర్థిక శక్తి మళ్లీ ఆసియాదే !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions