.
కేసీయార్, కేటీయార్, హరీష్ రావు… అసలే ఫ్రస్ట్రేషన్‌లో ఉండి, ఏవేవో గాలి ఆరోపణలు చేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా… నితిన్ నబీన్‌తో భేటీ తరువాత, నో, నెవ్వర్, మాకెవరితోనూ పొత్తు ఉండదు, ఒంటరిగానే పోటీచేస్తాం అని తెలంగాణ బీజేపీ నిన్న ప్రకటించాక. బీజేపీతో కలవాలని విశ్వప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్‌లో ఇంకా ఫ్రస్ట్రేషన్ లెవల్స్ పెరిగిపోయినట్టున్నాయి…
అఫ్‌కోర్స్, అది తెలంగాణ బీజేపీ, చివరకు ఎక్కడ, ఎవరి ఎదుట సాగిలబడుతుందో తెలియదు గానీ బీఆర్ఎస్ ముఖ్యుల్లో అసహనం రేంజ్ మాత్రం పెంచింది… ఉదాహరణ :: నిన్న మీడియా చిట్‌చాట్‌లో కేటీయార్ మాట్లాడుతూ ‘‘మేం రాగానే హిల్ట్ రద్దు’ అన్నాడు… అంతేకాదు, ఈ పాలసీ ద్వారా భూముల్ని రెగ్యులరైజ్ చేసుకునేవాళ్లకు భవిష్యత్తులో కష్టాలు తప్పవు అని హెచ్చరించాడు… (గాలిలో ఏవేవో లెక్కలేసి 5 లక్షల కోట్ల స్కామ్ అంటాడు… ఇంకా నయం, ఆ సంఖ్యతో ఆపాడు)…
Ads

ఈ స్కీమ్‌కు ఆదిలోనే గండికొట్టడానికి ఇది బెదిరింపు వ్యూహం… రాజకీయాల్లో ఎత్తుగడలు, వ్యూహాలే కాదు, విజ్ఞత, వివేచన, ప్రజాప్రయోజనాల పట్ల విధేయత కూడా అవసరమనే బేసిక్ సోయి లేని బెదిరింపు ఇది… ఎందుకంటే..?
హిల్ట్ పి ఎందుకు..? క్యూర్ పరిధిలో, అంటే విశ్వనగరంలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటికి తరలించడానికి ఉద్దేశించిన ఆలోచన… ఆయా పరిశ్రమలకు కేటాయించబడిన భూములకు వాణిజ్య, రెసిడెన్స్ ప్రాంగణాలుగా మార్చుకోవడానికి ప్రభుత్వం అనుమతించే ఓ ముందడుగు…
ఒకప్పుడు నగరం శివార్లలోని పారిశ్రామికవాడలు ఇప్పుడు సిటీలో మధ్యలో ఉన్నాయి… కాలుష్యంతో జనం అవస్థలు… సో, కాస్త స్వచ్ఛమైన వాతావరణం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది… ఇప్పుడు అదీ వద్దట కేటీయార్‌కు… జనం కాలుష్యంతో చచ్చిపోయినా సరే, ప్రభుత్వం మాత్రం ఈ పనిచేయకూడదట… తెలంగాణ వచ్చాక పదేళ్లూ జనం, స్వచ్ఛ విశ్వనగరం గురించి ఆలోచించలేదు, ఇప్పుడు, ఇదుగో అలా కాళ్లలో కట్టెలు పెట్టే కుటిల ఎత్తుగడలు…
సేమ్, హైడ్రాను ఎత్తి ఎక్కడో పడేస్తామని అటు కేసీయార్, ఇటు హరీష్ బెదిరింపులు… తమ హయాంలో, తమ అనుచరగణంతో సాగించిన చెరువులు, కుంటలు, నాలాల దురాక్రమణకు హైడ్రా అడ్డంకి కాబట్టి, అవన్నీ అది కూల్చేస్తోంది కాబట్టి… దాన్ని రద్దు చేసి, ఎక్కడో పడేస్తారట… దాన్ని తీసిపారేసి ఇంకా ఏమైనా నీటివనరులు మిగిలి ఉంటే, వాటినీ ‘పొతం పట్టించడానికా’ ఈ హైడ్రాలిక్ బెదిరింపులు..?
సేమ్, ఫ్యూచర్ సిటీ రద్దు చేసి పారేస్తామని అన్నాడు ఆమధ్య హరీష్ రావు, అంటే నగరం పక్కన మరో ‘ఫ్యూచరిస్టిక్ సిటీ’ వస్తే తప్పేమిటి..? ఇది రేవంత్ చేస్తున్నాడు కాబట్టి రద్దు చేయాలా..? రాజకీయాల్లో రాజనీతిజ్ఞత వేరు, గల్లీ లెవల్ రాజకీయాలు వేరు… హరీష్ రావు, కేటీఆర్, కేసీయార్ ‘స్టేట్స్‌మెన్’ అనే పదానికి మరోసారి నిర్వచనం ఎవరినైనా అడిగి తెలుసుకుంటే బెటర్ అనిపిస్తోంది…
ప్రతిదీ రద్దు చేస్తామనే ఈ ధోరణిని ఏమంటారో తెలియదు గానీ… రేవంత్ గనుక మెట్రో విస్తరిస్తే, దాన్నీ ఎత్తిపడేస్తాం, పలు గుళ్లను ఆధునీకరిస్తున్నారు కదా, వాటికీ పాత రూపు కల్పిస్తాం, ఒకవేళ రేవంత్ తుమ్మిడిహెట్టి కడితే, దాన్నీ ‘ఖతం చేస్తాం’ దాకా ఈ బెదిరింపులు పోకూడదని ఆశించాలి మనం… అసహనం హద్దులుదాటితే, కనబడే మానసిక ధోరణికి ఏదో పదం ఉంది సైకాలజీలో…!!
సన్నబియ్యం రద్దు చేసి, ముక్కిపోయిన పురుగుల రేషన్ దొడ్డుబియ్యాన్ని పునరుద్ధరిస్తాం, బస్సుల్లో ఫ్రీ జర్నీ ఎత్తిపడేస్తాం, ఇందిరమ్మ ఇళ్లు కూల్చేస్తాం, 500 సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ రద్దు చేసిపారేస్తాం… ప్లీజ్ అక్కడిదాకా రాకండి… ట్రిపుల్ ఆర్ నిర్మిస్తే గుంతలు తవ్వేస్తాం అన్నారో… అప్పుడు మోదీ నుంచి ‘పరిస్థితి బహుత్ గంభీర్ హోతా’…
- (ఇక్కడే ఓ మాట… ఏమాటకామాట… కేటీయార్ నిన్న చిట్‌చాట్‌లో ప్రస్తావించిన 22ఏ సమస్యతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో కొన్నివేల మంది అవస్థలు పడుతున్న మాట నిజం… ఇదుగో ఇలాంటివే ప్రతిపక్షం తలకెత్తుకోవాల్సిన ఇష్యూస్… ఈ సమస్య రాబోయే రోజుల్లో మూడు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలను భారీగానే దెబ్బతీయబోతోంది… దీని పరిష్కారం మంత్రి పొంగులేటివల్ల కావడం లేదు… ఇది కేసీయార్ మార్క్ భారీ భూకుట్ర ధరణికన్నా అధ్వానం అయిపోయింది… బహుపరాక్…)
Share this Article