.
రేవంత్ రెడ్డి వర్షాల కోసం, తెలంగాణలో సమృద్దిగా పంటలు పండటం కోసం, తాగునీటి కోసం నాగార్జునసాగర్‌లో వరుణయాగం చేయిస్తున్నాడు… తనే స్వయంగా పూర్ణాహుతిలో పాల్గొంటాడు… గుడ్, మంచి కాజ్… జనంలోకి పాజిటివ్ సిగ్నల్స్ వెళతాయి… ఇది మాత్రమేనా..?
కాదు, ఐనదానికీ కానిదానికీ టన్నుల కొద్దీ బురదను గుమ్మరిస్తున్న బీఆర్ఎస్ క్యాంపుపై ప్రయోగించిన ఓ రాజకీయ అస్త్రం కూడా! దీన్ని అర్థం చేసుకోలేక హరీష్ రావు, కేటీయార్ అండ్ కో విస్తుపోయి, ఇక ఎలా ఖండించాలో తెలియక, ఖండిస్తే జనంలో చులకన అయిపోతామని ఇక నోళ్లు మూసుకున్నారు…
Ads
మొదట అద్దంకి దయాకర్, రామ్మోహన్ రెడ్డిలతో హరీష్ రావు తిరుచ్చి, షిమోగా వెళ్లి, తెలంగాణలో కరువు కాటకాలు కోరుతూ, ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరగాలనే క్షుద్ర ఆలోచనలతో క్షుద్ర పూజలు చేయించాడని ఆరోపణలు చేయబడ్డాయి… తరువాత పీసీసీ అధ్యక్షుడు అదే అందుకున్నాడు…
నో, నో, నెవ్వర్, నిజం కాదు, అని హరీష్ రావు చెప్పుకున్నా, కేటీయార్ మద్దతు పలికినా, నిలయ విద్వాంసులు దాసోజు, ఆర్ఎస్పీ ఏవో కౌంటర్లు ఇచ్చినా… జనంలోకి మాత్రం హరీష్ క్షుద్రపూజలు అనే సంకేతాలు బలంగా వెళ్లాయి… ఆర్ఎస్పీకి వామాచారం, క్షుద్రపూజల తేడా తెలియనట్టుంది… అది వేరే కథ…
ఈలోపు క్షుద్ర పూజల తాలూకు ఎఫెక్ట్ మరింత స్ట్రాంగ్‌గా ఉండేందుకు రేవంత్ రెడ్డి క్యాంపు ఓ ఫార్ములా రచించింది… అది క్షుద్ర పూజలకు పూర్తి కంట్రాస్టు నేపథ్యం… చూశారా, హరీష్ రావు తెలంగాణ జనం నష్టపోవాలని, కరువుకాటకాలు తాండవించాలని క్షుద్ర పూజలు చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం జనం బాగుండాలని, వర్షాలు కురియాలని వరుణయాగం చేయిస్తున్నాడు అనే భావన మరింత బలంగా జనంలోకి వెళ్లడం!!
ఇక్కడ వరుణయాగం అందరూ బాగుండాలనే పాజిటివ్ మెంటాలిటీ, క్షుద్రపూజలు ఎదుటోడు నాశనం కావాలని కోరుకునే నెగెటివ్ మెంటాలిటీ… జనంలోకి ఈ కంట్రాస్టే బలంగా వెళ్తుంది… 11 హోమగుండాలు, 108 మంది రిత్విక్కులు సరే, నాగార్జునసాగరే ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానం తెలియదు గానీ…
నిజానికి కష్టమైనా, సంక్లిష్టమైనా రేవంత్ రెడ్డి అతిరాత్రం చేయిస్తే బాగుండేది… పవర్ ఫుల్… యాదగిరిగుట్ట పండితులు రేవంత్ రెడ్డికి సరైన సలహాలు ఇవ్వలేదు, ఏదో తూతూమంత్రం, తుమ్మకాయ మంత్రం తరహాలో ఓ ఐడియా పారేశారు…
అతిరాత్రం… వర్షాల కోసమే కాదు, శాంతికీ, సౌఖ్యానికీ ఉద్దేశించిన వైదిక యజ్ఞం… కేసీయార్ అప్పట్లో చేసిన ఆయుత చండీయాగం తన కోసం, తన స్వార్థం కోసం… కానీ రేవంత్ గనుక అతిరాత్రం చేయించి ఉంటే, జనం కోసం ఉద్దేశించిన యాగంగా మంచి పేరు వచ్చేది…
దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు గానీ, ఒకాయన రాసుకొచ్చాడు సోషల్ మీడియాలో… దీనికన్నా కప్పల పెళ్లి మేలు కదా అని..! మరొకాయన తిప్పికొట్టాడు, మీ క్షుద్రపూజలకన్నా కప్పల పెళ్లి బెటర్, చాలా బెటర్… చివరకు మొసలి పూజలు కూడా అని కామెంటాడు… ఈ మొసలి పూజ ఏమిటి అంటారా..? ఇదుగో ఓ క్లిప్పింగ్…

ఓ ఊరిలో కృష్ణా నదీతీరంలో మొసలి కనిపిస్తే జాలర్లు పట్టుకొచ్చారట… ఓ పూజారి ధైర్యంగా తన ఎదుట కూర్చొని… పూజ చేశాడట, మొసలి వరుణుడి వాహనం కదా, అందుకని..! ఇది ఎఐ ఫోటో కాదనే ఆశిద్దాం… మన్ను తిన్న మొసలిలా పడున్న అది హఠాత్తుగా నోరుతెరిచి, ఆవలిస్తే పాపం ఆ పూజారి కథ ఏమైపోయేదో గానీ… తెలంగాణలో ఈ పూజల యవ్వారం రాను రాను ఆసక్తికరంగా మారుతోంది..!! ఈ మొత్తం అధ్యాయంలో కక్కలేక, కిక్కులేక, మింగలేక బీఆర్ఎస్..!!
అన్నట్టు మీకు వారుణాస్త్రం గురించి తెలుసా..? పురాణాల్లో పేర్కొనే ఆ అస్త్రం చాలా పవర్ ఫుల్… క్షుద్ర అస్త్రాలకు విరుగుడు అది, పైగా క్యూసెక్కుల కొద్దీ వర్షపునీరు కురిపిస్తుంది..!!!
Share this Article