.
తనూజ ! టీవీ సెలబ్రిటీలలో కూడా కాస్త డిఫరెంట్… రెగ్యులర్ టీవీ ప్రోగ్రాముల్లోకి వచ్చి హడావుడి చేయదు… నిండు కుండ… టెంపర్‌మెంట్‌తోపాటు స్ట్రాటజీ ఉంటుంది… నిజానికి మొన్నటి బిగ్‌బాస్ సీజన్ విజేత ఆమే అయిఉండాలి… కాకపోతే ఆ దిక్కుమాలిన బిగ్‌బాస్ టీమ్ లెక్కలు ఎప్పుడూ డిఫరెంటే కదా, తనూజను తొక్కేసి, కల్యాణ్ పడాలను విజేతను చేశారు…
కానీ ఆమె ఊరుకునే రకం కాదు… తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని డామినేట్ చేస్తుంది, కష్టపడుతుంది, ఎమోషన్స్ ప్రదర్శిస్తుంది… అదే స్టార్‌మాటీవీలో వచ్చే కుకూ విత్ జాతిరత్నాలు షోలో విజేతగా నిలిచింది… ఈమధ్య హిట్ టీవీ షోలలో ఇదీ ఒకటి… అఫ్‌కోర్స్, అనేకమంది కమెడియన్లు, టీవీ సెలబ్రిటీలు… జడ్జిలుగా తుమ్మ సంజయ్, ఆలీ, శ్రీదేవి, ముచ్చర్ల అరుణ… హోస్ట్ ప్రదీప్ అదరగొట్టాడు…
Ads
నిజానికి ఆషికా పడుకోన్, నిఖిల్, డెమోన్ పవన్ కూడా బాగా కష్టపడ్డారు… కమెడియన్లు అవినాష్, హరి, సుహాసిని, దీపిక, దీక్ష, నూకరాజు, ఇమ్ము, రాకేష్, మణికంఠ, ప్రత్యేకించి రోహిణి, రీతూ… ఇలా చాలామంది, కొందరు వచ్చారు, వెళ్లిపోయారు… (త్రినయని ఆషికా ప్లజెంట్ ప్రజెన్స్)… నిజానికి ఇది ప్యూర్‌లీ ఫన్ బేస్డ్ షో… కుకరీ షోను, కామెడీ షోను కలగలిపి, కిచిడీ చేసి, దీనికి రూపకల్పన చేశారు, కానీ సరదాగా బాగుంది… తనూజకు కిరీటం మరీ బాగుంది…

శ్రీముఖి హోస్ట్ చేసే స్టార్ మా పరివారం, మ్యాడ్ విత్ ఈచ్ అదర్ షోలకన్నా ఇది కాస్త జనరంజకంగా ఉంది… అఫ్‌కోర్స్, శ్రీముఖి ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కన్నా తక్కువేమీ కాదు, ప్రస్తుతం టాప్ రేటెడ్ హోస్ట్ ఆమె… సుమ ఎక్కడికో కొట్టుకుపోయింది… ఏమాటకామాట రియాలిటీ షోలకు సంబంధించి స్టార్ మా భారీగా ఆర్గనైజ్ చేస్తుంది…
ఆహా ఓటీటీలో ఏదో కుకరీ షో చేశారు కానీ ఫ్లాప్… ఈటీవీకి ఎందుకిలాంటివి చేతకావు..? నిన్న ఈటీవీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ షోలను చూస్తే… స్పష్టంగా సుధీర్ డామినేట్ చేశాడు ఫ్యామిలీ స్టార్స్ షోలో… స్రవంతి చొక్కారపు, ఆషురెడ్డి కూడా అసెట్స్… నిజానికి ప్రదీప్ టీవీల్లో్ టాప్ రేటెడ్ హోస్ట్ కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ తనకు అస్సలు సూట్ కాలేదు, వెలవెల… అంటే, ఆ షో స్క్రీన్ ప్లే, ప్రజెంటేషనే దెబ్బతినిపోయింది… పాపం, తనేం చేయగలడు..?
జబర్దస్త్ గురించీ చెప్పాలి… ఈమధ్య బాగా ఖర్చు పెడుతున్నారు, సినిమా యాక్టర్లను గెస్ట్ ఆర్టిస్టులుగా తీసుకొస్తున్నారు, కానీ రక్తికట్టడం లేదు… ఉదాహరణకు బాబూమోహన్ స్కిట్… నిజానికి ఇది రాకెట్ రాఘవ స్కిట్… బాబూ మోహన్ అనేసరికి తనేం రాశాడో, ఏం తీశాడో తనకే అర్థం కాలేదు… బాబూ మోహన్ మరీ పేలవం… విసుగెత్తించాడు… చివరకు నాగబాబు ఏదో చెప్పి కవర్ చేశాడు కానీ… ఉత్త నాసిరకం స్కిట్…
రాను రాను జబర్దస్త్‌లో స్కిట్ల రైటింగ్, ప్రజెంటేషన్ బోరింగ్… పొట్టి నరేష్ ఓవరాక్షన్… ఎప్పటిలాగే రాంప్రసాద్ ఆటో డైలాగ్స్… ఏమాటకామాట ఫైమా, బుల్లెట్ భాస్కర్ వంటి కొందరే కాస్త బెటర్… ఈసారి కాస్త బాబూమోహన్ వంటి వారిని గాకుండా కాస్త రక్తికట్టించగల సినిమా నటుల్ని తీసుకురండయ్యా..!!
Share this Article