Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టాటా చైర్మన్ చంద్రశేఖరన్ నిష్క్రమణ వెనుక ఏం జరిగింది ?!

August 13, 2026 by M S R

.

(  Gopu Vijaya Kumar Reddy  ) ….. టాటా చైర్మన్ చంద్రశేఖరన్ నిష్క్రమణ: ఎందుకింత సంచలనం? టాటా గ్రూప్ భవిష్యత్ నాయకత్వంపై మొదలైన చర్చలు.. మార్కెట్‌లోనూ ప్రకంపనలు

ఏదైనా ఒక వ్యాపార రంగంలో ఒక టాప్ లీడర్ రిజైన్ చేస్తే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ అదే ఒక టాటా గ్రూప్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ రిజైన్ చేయడం దేశం అంతా, ముఖ్యంగా వ్యాపార వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే మన దేశంలో టాటా గ్రూప్‌కు ఉన్న లెగసీ అటువంటిది.

Ads

అది కేవలం ఒక్క రోజులో ఏర్పడింది కాదు. కొన్ని దశాబ్దాల విలువలు, విశ్వసనీయతతో భారతదేశ ఆత్మను నింపుకొని ఎదిగిన గ్రూప్ అది. ఒక్కో దేశానికి ఒక్కో క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకి పాకిస్థాన్ “నమ్మదగిన దేశం కాదు”, చైనా “నక్కజిత్తులమారి”, అమెరికా “ఎవ్వరైనా మా తర్వాతే.. మేమే తోపులం”, యూరప్ దేశాలు జీవన విధానం, ఇండియా ఆత్మగౌరవం, విలువలు.. ఇలా ఒక్కో దేశానికి ఒక్కో క్యారెక్టర్ ఉంటుంది. అలా మన దేశ ప్రతిష్టను, ఆత్మను ప్రపంచ వ్యాపార వర్గాలలో ప్రతిబింబించే గ్రూప్ టాటా. అందుకే ప్రతి భారతీయుడు “ఇది నా కంపెనీ.. మన కంపెనీ” అని గర్వంగా చెప్పుకుంటాడు.

రతన్ టాటా నిష్క్రమణ తర్వాత చాలా విషయాల్లో టాటా గ్రూప్ ఎప్పుడో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్. చంద్రశేఖరన్ మూడోసారి గ్రూప్ బాధ్యతలు చేపట్టకుండా వైదొలగాలని నిర్ణయించుకోవడం మరో పెద్ద వార్తగా నిలిచింది.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేయాలి. చంద్రశేఖరన్ వెంటనే చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం లేదు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత మరో ఐదేళ్ల పదవీకాలానికి తనను తాను పరిగణనలోకి తీసుకోబోనని ఆయన టాటా సన్స్ బోర్డుకు తెలిపారు. ఆయన నిర్ణయానికి ప్రధాన నేపథ్యం.. తన మూడో టర్మ్‌పై బోర్డులో ఏకాభిప్రాయం రాకపోవడమే.

అసలు ఏం జరిగింది?

చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం ఇవ్వాలన్న ప్రతిపాదనపై టాటా సన్స్‌లో 2026 ఫిబ్రవరి 24న జరిగిన బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదు. ఆయన ప్రకారం, టాటా ట్రస్టులలోని ప్రధాన ట్రస్టులు ఆయన కొనసాగింపుకి సిఫారసు చేశాయి. అయితే బోర్డులో ఒక సభ్యుడి మద్దతు లేకపోవడంతో నిర్ణయం ముందుకు సాగలేదు.

ఆరు నెలలుగా స్పష్టత రాకపోవడంతో, ఇప్పటికే కీలక దశలో ఉన్న వ్యూహాత్మక ప్రాజెక్టులకు నాయకత్వంపై స్పష్టత అవసరమని భావించి తాను 2027లో రీ-అపాయింట్‌మెంట్ కోరబోనని చంద్రశేఖరన్ ప్రకటించారు.

ఇది సాధారణంగా ఒక కార్పొరేట్ అధినేత పదవి మార్పుగా కనిపించినా, టాటా గ్రూప్ పరిమాణం, భారతీయ వ్యాపార వ్యవస్థలో దాని ప్రాధాన్యత కారణంగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

టాటా ట్రస్ట్స్–టాటా సన్స్ మధ్య విభేదాలే కీలక అంశమా?

టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా టాటా ట్రస్టులదే. అందువల్ల గ్రూప్ చైర్మన్ ఎంపికలో టాటా ట్రస్టుల అభిప్రాయం అత్యంత కీలకం.

ఇటీవలి కాలంలో Tata Trusts, Tata Sons మధ్య నాయకత్వం, వ్యూహాత్మక నిర్ణయాలు, నష్టాల్లో ఉన్న కొత్త వ్యాపారాల పనితీరు, పెట్టుబడుల కేటాయింపు, Tata Sons భవిష్యత్ లిస్టింగ్ వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

అందువల్ల చంద్రశేఖరన్ నిష్క్రమణను కేవలం వ్యక్తిగత నిర్ణయంగా కాకుండా, టాటా గ్రూప్‌లో తదుపరి నాయకత్వం, గవర్నెన్స్ ఎలా ఉండబోతున్నాయనే పెద్ద ప్రశ్నకు సంకేతంగా వ్యాపార వర్గాలు చూస్తున్నాయి.

మార్కెట్ ఎందుకు ఒక్కసారిగా స్పందించింది?

చంద్రశేఖరన్ నిర్ణయం వెలువడిన వెంటనే టాటా గ్రూప్‌కు చెందిన పలు లిస్టెడ్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

TCS సుమారు 3.9 శాతం వరకు పడిపోగా, Tata Motors Passenger Vehicles, Titan, Tata Steel తదితర టాటా కంపెనీల షేర్లు కూడా ఒత్తిడికి గురయ్యాయి. టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో సుమారు $4.5 బిలియన్ మేర తగ్గుదల నమోదైందని నివేదికలు పేర్కొన్నాయి.

మార్కెట్ స్పందన వెనుక ప్రధాన కారణం కంపెనీల వ్యాపారంలో ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. “చంద్రశేఖరన్ తర్వాత ఎవరు?” అనే leadership uncertainty ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

చంద్రశేఖరన్ వారసుడిగా ఎవరూ?

ఇప్పుడు టాటా గ్రూప్‌లో అత్యంత ఆసక్తికరమైన చర్చ ఇదే. ఈ succession raceలో T.V. Narendran పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం Tata Steel CEO & MDగా ఉన్న ఆయనకు టాటా గ్రూప్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. అందువల్ల ఒక బలమైన internal candidateగా ఆయన పేరు చర్చలోకి వచ్చింది.

అయితే Narendranను Tata Sons తదుపరి Chairmanగా అధికారికంగా ప్రకటించలేదు. ఆయనతో పాటు ఇతర Tata Group senior executives పేర్లు కూడా పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇది succession speculation మాత్రమే.

తదుపరి చైర్మన్ ఎంపికలో అనుభవంతో పాటు Tata Trusts, Tata Sons Board, గ్రూప్ కంపెనీలు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు అందరి ప్రయోజనాలను సమతుల్యం చేయగల సామర్థ్యం అత్యంత కీలకం కానుంది.

ముందున్న అసలు సవాళ్లు ఇవే

తదుపరి చైర్మన్‌కు కేవలం టాటా గ్రూప్‌ను కొనసాగించడం సరిపోదు. ఇప్పటికే అనేక కీలక సవాళ్లు ముందున్నాయి.

1. Air India … టాటా గ్రూప్ తిరిగి తన చేతుల్లోకి తీసుకున్న Air Indiaను లాభదాయకమైన, ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా మార్చడం అతిపెద్ద సవాళ్లలో ఒకటి. భారీ పెట్టుబడులు, పోటీ, ఆపరేషనల్ సమస్యలు, నియంత్రణ అంశాలు దీనిని మరింత క్లిష్టంగా చేస్తున్నాయి.

2. TCS మరియు AI …. టాటా గ్రూప్‌కు ప్రధాన లాభాల ఇంజిన్ అయిన TCS ముందు Generative AI, ఆటోమేషన్, pricing pressure, IT spendingలో మార్పులు వంటి సవాళ్లు ఉన్నాయి. భవిష్యత్ టెక్నాలజీ మార్పులకు TCSను ఎలా సిద్ధం చేస్తారనేది కీలకం.

3. కొత్త రంగాల్లో భారీ పెట్టుబడులు … Semiconductors, Electronics, Batteries, EVs వంటి రంగాల్లో టాటా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి భవిష్యత్ వృద్ధికి కీలకమైనప్పటికీ, ప్రారంభ దశలో భారీ మూలధనం అవసరం అవుతుంది. సరైన capital allocation తదుపరి నాయకత్వానికి పరీక్షగా మారనుంది.

4. Tata Digital మరియు ఇతర కొత్త వ్యాపారాలు… Tata Digital, BigBasket వంటి కొత్త తరం వ్యాపారాల్లో భారీ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో, వాటిని ఎప్పుడు profitabilityకి తీసుకురావాలి? ఎంతకాలం పెట్టుబడులు కొనసాగించాలి? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

5. Tata Sons Listing …. Tata Sons భవిష్యత్తులో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతుందా లేదా అనే అంశం కూడా కీలకమైన వ్యూహాత్మక ప్రశ్న. RBI నియంత్రణలు, Tata Trusts ప్రయోజనాలు, షేర్‌హోల్డర్ నిర్మాణం వంటి అంశాలతో ఇది ముడిపడి ఉంది.

6. Tata Trusts–Tata Sons సంబంధం … ఇది అన్నింటికంటే ముఖ్యమైన అంశం కావచ్చు. టాటా గ్రూప్‌ను ఒకే దిశలో నడిపించడానికి Trusts , Operating Board మధ్య స్పష్టమైన అధికార విభజన, పరస్పర విశ్వాసం, గవర్నెన్స్ అవసరం. గత కొంతకాలంగా కనిపిస్తున్న విభేదాలు కొనసాగితే తదుపరి చైర్మన్‌కు ఇది పెద్ద సవాలుగా మారుతుంది.

రతన్ టాటా తర్వాత మరో కీలక మలుపు

రతన్ టాటా నాయకత్వం టాటా గ్రూప్‌కు కేవలం వ్యాపార విజయాలను మాత్రమే ఇవ్వలేదు. టాటా అనే పేరును విశ్వసనీయత, నైతికత, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలతో అనుసంధానించింది. చంద్రశేఖరన్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ టెక్నాలజీ, ఆటోమొబైల్స్, ఎయిర్‌లైన్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ వంటి కొత్త రంగాల్లో టాటా గ్రూప్‌ను మరింత విస్తరించే ప్రయత్నం చేశారు.

అందుకే ఇప్పుడు ఆయన తర్వాత వచ్చే వ్యక్తి కేవలం ఒక Chairman కాదు.. ఒక వారసత్వానికి తదుపరి సంరక్షకుడు.

ఇప్పుడు అందరి చూపు 2027పై

ఆగస్టు 18న జరగనున్న Tata Sons AGMకు ముందు చంద్రశేఖరన్ ప్రకటన రావడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. ఇక రాబోయే నెలల్లో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి ఉంటుంది:

తదుపరి Chairman ఎవరు?

Tata Trusts–Tata Sons మధ్య సంబంధం ఎలా మారుతుంది?

టాటా గ్రూప్ తన భారీ కొత్త పెట్టుబడులు, Air India, TCS, Digital businesses వంటి సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది?

చంద్రశేఖరన్ నిష్క్రమణ టాటా గ్రూప్‌కు ముగింపు ఏమీ కాదు. కానీ టాటా గ్రూప్ మరో కీలక మలుపులోకి ప్రవేశించిందనడానికి మాత్రం ఇది స్పష్టమైన సంకేతం.

భారతదేశ వ్యాపార చరిత్రలో టాటా అనే పేరు కేవలం ఒక corporate group కాదు. కోట్లాది భారతీయుల దృష్టిలో అది ఒక విశ్వాసానికి ప్రతీక.

అందుకే ఇప్పుడు దేశంలోని వ్యాపార వర్గాలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే:

“చంద్రశేఖరన్ తర్వాత టాటాను ఎవరు నడిపిస్తారు?”

ఆ ప్రశ్నకు వచ్చే సమాధానం టాటా గ్రూప్‌ భవిష్యత్తునే కాదు.. భారత కార్పొరేట్ ప్రపంచంలో దాని తదుపరి అధ్యాయాన్ని కూడా నిర్ణయించనుంది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టాటా చైర్మన్ చంద్రశేఖరన్ నిష్క్రమణ వెనుక ఏం జరిగింది ?!
  • ఆ దరిద్రుడు, నరకం చూపించాడు ! అనుపమ వేదనాగీతం !!
  • ప్రకాష్‌రాజ్ నిర్మాతగా ఓ నాసి మూవీ – బాలచందర్ పరువూ గల్లంతు !!
  • అడాప్టివ్ టెస్టింగ్ ! నీట్- పోటీ పరీక్షల అక్రమాలకు రియల్ చెక్ !!
  • PTG Colony – అరకు ​హైవే మెరిసింది… కనీస గౌరవం మరిచింది!
  • చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !
  • గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!
  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!
  • ఇది మరో తండ్రి శవం కథ..! అనుబంధం- ఆత్మీయత అంతా ఒక బూటకం !!
  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions