.
రీల్స్ చూస్తుంటే హఠాత్తుగా సింగర్ ఝాన్సీ అని ఈ అమ్మాయి రీల్ ఒకటి కనిపించింది… పొలం గట్టు మీద కూర్చుని బువ్వ తింటోంది… ఎవరబ్బా ఈమె అని ప్రొఫైల్‌లోకి వెళ్లి చూస్తే… తనే సొంతంగా వ్యవసాయ పనులు చేస్తూ మాట్లాడుతున్న రీల్స్ బోలెడు… అన్నీ పల్లె మనసంత కమ్మగా ఉన్నాయి… పక్కా ఆర్గానిక్…
గుడ్, అసలు మగ పురుష్ కూడా వ్యవసాయం వదిలేసి, చిన్నాచితకా పనులు చేయడానికి పట్నం వెళ్తున్న ఈరోజుల్లో… ఓ అమ్మాయి అన్నిరకాల వ్యవసాయ పనుల్ని సొంతంగా చేస్తూ, పది మందితో పంచుకుంటున్న తీరు నిజంగా నచ్చింది… అరుదుగా కనిపిస్తుంటారు… నిజానికి సమాజానికి ఇలాంటి స్వచ్ఛతే కదా కావల్సింది…
Ads
మొదట చూసిన రీల్ కింద మూడోదో నాలుగోదో మరొక రీల్ కనిపించింది… అది వచ్చే బిగ్‌బాస్ సీజన్ కోసం ఉద్దేశించిన ఆడిషన్ రీల్… దాని పేరు అగ్నిపరీక్ష… గత సీజన్‌లో కామనర్స్ ఎంపిక కోసం పెట్టిన పరీక్షలు, ఆ చెత్తా ప్రయాస మీద బోలెడు విమర్శలు వచ్చిన సంగతి తెలుసు కదా, చివరకు పడాల కల్యాణ్ అనే కామనర్ కప్పు ఎగరేసుకుపోయిన సంగతీ తెలుసు కదా…
ఆ ఊపులో ఈసారి ఏకంగా ఓ పది మంది కామనర్స్‌ను తీసుకుంటామని, ఆ పాత జడ్జిలతోనే మరో అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు… రకరకాల కేరక్టర్స్… చివరకు ఉప్పల్ బాలు వంటి రోత వీడియోల కేరక్టర్ కూడా వచ్చాడు… నిన్ను హౌజులోకి తీసుకుని సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలయ్యా మేము అనడిగాడు నవదీప్… (అది నవదీప్ అడగడమే కాస్త నవ్వొచ్చింది)… తరువాత నవదీప్‌ను తిడుతూ అదే బాలు మరో వీడియో పెట్టాడు, ఆడిషన్స్ నుంచి తనను తరిమేశారు లెండి, అలాంటప్పుడు తనను అసలు పిలవకుండా ఉండాల్సింది…

నవదీప్‌తోపాటు బిందుమాధవి, అభిజిత్, శ్రీముఖి ఈ పరీక్షల ఇన్విజిలేటర్లు… అదుగో ఆ పరీక్షకు సంబంధించిన ఓ రీల్‌లో పైన చెప్పుకున్న సింగర్ ఝాన్సీ ఆడిషన్ కూడా కనిపించింది… ‘మేం ముగ్గురం ఆడపిల్లలం, నేను చిన్నదాన్ని, మళ్లీ ఆడపిల్ల పుట్టిందని నేను పుట్టగానే అమ్మ ఏడ్చిందట, నేను చదువుకున్నా, ఫోక్ సాంగ్స్ పాడతాను, ఎవుసం చేస్తాను, మగవాళ్లే కాదు, కన్నవారి కంట నీరు రాకుండా ఆడపిల్లలం మేం చూడలేమా..?
అవును, అన్నిరకాల వ్యవసాయ పనులు చేస్తాను, పదేళ్లుగా చేస్తున్నాను… ఉన్న ఊళ్లో వ్యవసాయం వదిలి, ఎక్కడికో బతక పోవడం దేనికి, ఎవుసం అంటే కన్నతల్లి వంటిది, సమస్యలున్నాయి, రిస్క్ ఉంది, కానీ చేయకుండా ఉండలేని రైతు కుటుంబం మాది’ అని చెబుతోంది… బాగుంది… అంతటి నవదీప్ కూడా ఇంప్రెస్ అయిపోయి తన ముందే తన సోషల్ మీడియా ఖాతాను ఫాలో చేశాడు… (ఆమెకు 2.92 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు ఆల్రెడీ)… (ఓసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేసింది కూడా)…
https://www.facebook.com/reel/1566628298399206
ఎస్, ప్రశాంత్ వంటి క్రెడిబులిటీ లేని కేరక్టర్లకు కప్పులు, అవకాశాలు ఇవ్వడం కాదు, ఇదుగో ఇలాంటి వాళ్లను తీసుకొండి, హౌజులో ఒకటీరెండు వారాలున్నా సరే, ఆ పాపులారిటీ వాళ్లకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది… వాళ్లను నిలబెడుతుంది… చూసేవాడికి కూడా పాజిటివ్ వైబ్స్ పంచినట్టవుతుంది… బోలెడు మంది తలతిక్కల సినిమా, టీవీ, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకన్నా నయం…
నిజం, చివరకు సీపీఐ నారాయణ కూడా వ్యభిచారకొంప అని మళ్లీ పిచ్చికూత కూయడు..!! పక్కా !! చెప్పనే లేదు కదూ… నేనూ ఫాలో బటన్ నొక్కాను !!
Share this Article