Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?

August 16, 2026 by M S R

.

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ నష్టాన్ని కలిగించే దిశకు వెళ్తున్నట్టుంది… కాంగ్రెస్ హైకమాండ్ కళ్లు తెరవకపోతే ఇది పూడ్చలేని అగాధం వైపు తీసుకుపోయేట్టుంది… ఎస్, కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం మరీ మితిమీరి ఉంటుంది… అది బలమో, అదే బలహీనతో తెలియదు గానీ, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ‘కట్టు’ తప్పుతోంది…

ఈ దుమారాన్ని టాకిల్ చేయడం పీసీసీ అధ్యక్షుడికి చేతకావడం లేదు, తన రేంజ్ సరిపోవడం లేదు… ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు అని తను అన్నాడో లేదో… ఎహె, నాకు కాదు, నువ్వు నీతులు చెప్పాల్సింది రేవంత్ రెడ్డికి, ఫోఫోయి మీనాక్షికి చెప్పుకోఫో అన్నట్టు స్పందించాడు రాజగోపాలరెడ్డి… ఇది తిరుగుబాటులా లేదు, ఓ తెగింపు… కఠినంగా వ్యవహరించడానికి పీసీసీ అధ్యక్షుడు ఎందుకు సందేహిస్తున్నాడు, ఎందుకు వెనుకంజ వేస్తున్నాడు..? ఇదీ అర్థంకాని మరో ప్రశ్న..!!

Ads

విచిత్రం ఏమిటంటే..? పోచారంను ఎలా పార్టీలో చేర్చుకుంటారు, రావడానికి తనకు బుద్ది లేదు, తీసుకున్నవాళ్ల మాటేమిటి అంటాడు రాజగోపాలరెడ్డి, దానం నాగేందర్‌ను కూడా తీసిపడేశాడు… సో, స్ట్రెయిటుగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశాడనేది సుస్పష్టం… పక్కా క్రమశిక్షణారాహిత్యం, పార్టీకి నష్టదాయకం కూడా…

అసలు నల్గొండ రెడ్ల యవ్వారం ఎప్పుడూ కాంగ్రెస్‌లో ప్రశ్నార్థకమే… గతంలో ఉన్న పీసీసీ అధ్యక్షులంటే కేసీయార్‌కు మహాప్రీతి, ఎందుకో, ఏం మతలబులో తెలియదు గానీ, కాంగ్రెస్ పార్టీ సర్వవిధాల నష్టపోయింది… కేసీయార్ క్రూరంగా తొక్కిపడేశాడు… తిరిగి రేవంత్ రెడ్డి వచ్చాకే పార్టీలో ఓ జోష్ వచ్చింది… అది అధికారం దాకా తీసుకుపోయింది…

సీనియర్ మంత్రుల శాఖల్లో వేళ్లు పెట్టొద్దు, ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ పార్టీ అనుమతి అవసరం వంటి ఆంక్షలతో ఇప్పటికే పరుగెత్తే రేవంత్ రెడ్డి కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు, తను కాడి కింద పడేస్తే మొదటికే మోసం అనే సోయి హైకమాండ్‌లో కొరవడింది… మీనాక్షి నటరాజన్ పాత్ర ఎప్పుడూ సందేహాస్పదమే…

వీటికితోడు ఇక రాజగోపాలరెడ్డి వంటి నేతలు చేసే నష్టం అదనం… విచిత్రం ఏమిటంటే..? తనేమో కొత్తగా పార్టీలో చేరినవారిని ఆక్షేపిస్తున్నాడు… అలా వచ్చిన వాళ్లూ రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారు… లైక్ పోచారం, దానం… జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కూడా రాజగోపాలరెడ్డికి మద్దతుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు…

ఈ హరాకిరీ బ్యాచ్‌ను కంట్రోల్ చేయాల్సిన హైకమాండ్ చోద్యం చూడటమే మరో విషాదం… ఇవన్నీ కటువుగా వినిపిస్తున్నా, నిజాలు, పార్టీకి ఈ పరిణామాలన్నీ ఏవో హెచ్చరికల సంకేతాలు…

సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… మార్పు, టీవీకే టైప్ విప్లవం వంటి మాటలు మాట్లాడుతున్న రాజగోపాలరెడ్డికి ఢిల్లీలో ఎవరి మద్దతు ఉందనేది కూడా వదిలేస్తే… ఒకవేళ తను పార్టీ నుంచి వెళ్లిపోతే (కొత్తేమీ కాదు, బీజేపీలోకి వెళ్లి గోడకుకొట్టిన బంతిలా వాపస్ వచ్చినవాడే) ఎందులోకి పోవాలి..?

మళ్లీ బీజేపీ రానిస్తుందా..? ఆల్రెడీ జాడించి వెళ్లాడు కదా ఒకసారి… కానీ ఏమో, తెలంగాణ బీజేపీ ప్రస్తుతం ఉన్న దశరాహిత్యం, దిశరాహిత్యంలో చేర్చినా చేర్చుకుంటారు… బీఆర్ఎస్..? సవాలే లేదు, కేసీయార్ నమ్మడు… కింకర్తవ్యం..? మొన్న ఏదో మీటింగులో తనే చెప్పినట్టు రుమాలు చుట్టి, జాలిమ్ కౌన్‌రే అని పాడుకుంటూ జనంలోకి వెళ్లడమేనా..? జనం విశ్వసిస్తారా..? ఇది అసలు ప్రశ్న..!!

చివరగా… రాజకీయాల్లో హత్యలుండవు, అక్కర్లేదు… ఆత్మహత్యలే ఉంటాయి అని… నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చూస్తుంటే ఇది మాత్రమే గుర్తొస్తోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?
  • Viral Mansi Sherni – ‘మోనాలిసాతో పోల్చితే మర్యాద దక్కదు సుమా’
  • తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!
  • దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!
  • బిగ్‌బాస్ – ఇలాంటోళ్లను తీసుకొండి – పాజిటివ్ వైబ్స్ పక్కా…
  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!
  • ANR – VaniSri – తెలుగు వెండి తెరపై ఓ సూపర్ హిట్ పెయిర్ !
  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions