Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

DC … విజయ్ దేవరకొండ చేసి ఉంటే… ఓ రేంజుకు వెళ్లిపోయేదేమో…

August 17, 2026 by M S R

.

(  Gopu Vijaya Kumar Reddy  )  …. డీసీ…, Gen-Z కి — సత్యను గుర్తు చేసిన సినిమా… విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా చూద్దామని అనుకున్నా. కానీ కావాల్సిన థియేటర్‌లో, కావాల్సిన సీట్లు దొరకకపోవడంతో చివరికి DC కి వెళ్లాను. నిజం చెప్పాలంటే… సినిమా నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది !

ఎంతలా నచ్చిందంటే… RGV ఎందుకు గొప్ప దర్శకుడో మరోసారి గుర్తు చేసింది. దాదాపు 30 సంవత్సరాల క్రితం వచ్చిన RGV “సత్య” సినిమా ఇప్పటికీ ఒక తరం దర్శకులను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంది. RGV శివ, రంగీలా, గాయం, సర్కార్ లాంటి ఎన్నో కల్ట్ క్లాసిక్స్ ఇచ్చి ఉండొచ్చు. కానీ నా వరకు మాత్రం “సత్య”నే ఆయన అల్టిమేట్.

Ads

DC చూస్తుంటే అరుణ్ మాతేశ్వరన్ “సత్య” సినిమాను కనీసం 100 సార్లు చూసి ఉంటాడేమో అనిపించింది. సత్యలోని సోల్‌ని తీసుకుని, తనదైన స్టైల్‌లో ఎక్కడా తడబడకుండా DCని తీశాడు.

  • గ్యాంగ్‌స్టర్ ఫ్రెండ్‌షిప్, అమ్మాయి కోసం రివెంజ్, పాత్రల డైనమిక్స్… చాలా చోట్ల సత్య గుర్తొచ్చింది. కొన్ని కెమెరా యాంగిల్స్ కూడా సత్యను గుర్తు చేశాయి. చివరికి హీరోలు తిరిగే రెడ్ కలర్ మారుతి ఓమ్ని కూడా రెండు సినిమాల్లోనూ కనిపించడం ఆసక్తికరమైన పోలిక.

కానీ DCకి తనదైన బలం ఉంది. బక్కోడు (ప్రేమతో) సాంగ్స్, BGM అయితే కుమ్మి అవతల పడేశాయి. సినిమా మూడ్‌కి, యాక్షన్‌కి, ఎమోషన్‌కి అవి ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్.

తర్వాత చెప్పుకోవాల్సింది కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్. ఒకదానికొకటి కంప్లిమెంట్ చేసుకుంటూ చాలా బాగా పనిచేశాయి. డార్క్ టోన్, లొకేషన్స్, లైటింగ్… సినిమా ప్రపంచాన్ని బాగా బిల్డ్ చేశాయి.

  • లోకేష్ కనకరాజ్ హీరోగా కూడా ఖతర్నాక్‌గా సెట్ అయ్యాడు. నిజానికి ఈ సినిమా విజయ్ దేవరకొండ చేయాల్సింది. కింగ్‌డమ్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఈ సినిమా వదులుకున్నాడని తెలిసింది. కానీ లోకేష్ ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా కనిపించాడు.

వామిక గబ్బి అయితే కొన్ని సీన్స్‌లో, ముఖ్యంగా డార్క్ లైటింగ్‌లో, సిల్క్ స్మితను గుర్తు చేసింది. ఆ లుక్, బాడీ లాంగ్వేజ్ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ. అన్నింటికంటే ముఖ్యంగా — సెకండ్ వీక్‌లో, మూడు సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, నిన్న హైదరాబాద్‌లో DC దాదాపు 50% ఆక్యుపెన్సీ సాధించడం సినిమా మీద ఉన్న ఆసక్తిని చూపిస్తుంది.

నాకు మాత్రం ఇది కేవలం మరో గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు. 30 ఏళ్ల క్రితం వచ్చిన “సత్య” ఒక దర్శకుడిని ఎలా ప్రభావితం చేసిందో, ఆ ప్రభావాన్ని మరో తరం ప్రేక్షకులకు ఎలా కొత్తగా అందించవచ్చో చూపించిన సినిమా — DC

సత్య నా కోసం RGV అల్టిమేట్ కల్ట్ క్లాసిక్.
DC Gen-Z కోసం ఆ సత్య ఆత్మను మళ్లీ గుర్తు చేసిన సినిమా.


తెలుగులో కూడా పది రోజుల నుంచి రోజూ కోటి రూపాయల్ని వసూలు చేస్తోంది ఈ సినిమా



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Flipkart – నీ దుంపతెగ- చావును కూడా అమ్ముకోవడం ఏమిట్రా ?
  • DC … విజయ్ దేవరకొండ చేసి ఉంటే… ఓ రేంజుకు వెళ్లిపోయేదేమో…
  • ఇది ఆ ఎన్టీయార్ పరువు ప్రతిష్ట కాదు – సుమన్ – సురేష్ బాపతు !!
  • చెప్పులు పోయాయ్ – కంగారెందుకు, చాట్‌జీపీటీ ఉందిగా, అడిగెయ్…
  • హీరో యశ్… ఈ కోణంలో నచ్చావ్… గ్రేస్, మెచ్యూరిటీ… 2 మెట్లు ఎక్కావ్…
  • సద్దాం ప్రత్యక్షం – హైపర్ ఆది మాయం – వాటీజ్ దిస్ నాగబాబూ…
  • బీజేపీ నేత థర్డ్ రేట్ – క్షుద్ర వ్యాఖ్యలు … ఇజ్జత్ పోయిందిగా…!!
  • దేవదాసు చావడు… కాలం మారేకొద్దీ కొత్తగా పుడుతున్నాడు !
  • పార్టీలో అప‘స్వరాలు ! ఔట్ స్పోకెన్ రేవంత్ అసాధారణ నిశ్శబ్దం !
  • కృష్ణ, విజయనిర్మల … డెయిలీ పేపర్ల కార్గో ఫ్లయిట్‌లో చెన్నైకి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions