Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!

August 18, 2026 by M S R

.

అది ఓ జాతీయ పార్టీ… కేంద్రంలో అధికారంలో ఉంది… అన్ని రాష్ట్రాల్లోనూ తనకే అధికారం ఉండాలని కలలు కంటున్నది… అలాంటప్పుడు ఒక రాష్ట్రం నుంచి పార్టీ జాతీయ కార్యవర్గంలో, వివిధ అనుబంధ విభాగాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలంటే ఏం ఉండాలి..? ఏం ఆలోచించాలి..? అవును, బీజేపీ గురించే..!!

ఇదుగో ఈ రాష్ట్రంలో మనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఇంకాస్త కష్టపడితే అధికారం వస్తుంది, మనకు కేడర్ బేస్ ఉంది, స్పేస్ ఉంది… అనుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో కొందరిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుని ఎంకరేజ్ చేయాలి… వెన్ను తట్టాలి… మరి తెలంగాణలో ఇదే కదా సిట్యుయేషన్, మరి ఒక్కరికీ ఎందుకు జాతీయ కార్యవర్గాల్లో చోటు దక్కలేదు…

Ads

పనిచేసే నాయకుల్లేరా..? నాయకుల్లో పనికొచ్చేవారు లేరా..? ఏమిటి బీజేపీ హైకమాండ్ అంతరంగం..? లేక మీ తన్నులాటలన్నీ పూర్తయ్యాక చూద్దాంలే అనే తూష్ణీభావమా..? ఇక మీరు మారరు అని తేల్చేయడమా..? అదే నిజమైతే, అదీ హైకమాండ్ వైఫల్యమే కదా…

సరే, మరో కోణం చూద్దాం… ఇదుగో ఈ రాష్ట్రంలో మనకు ఏమీ లేదు, ఎవరికైనా పార్టీ మంచి పోస్టు ఇస్తే, కష్టపడతాడు, పనిచేస్తాడు, పార్టీ ఉనికి, బలం ఎంతోకొంత పెరుగుతుంది అనుకుంటే… అలాగైనా జాతీయ కార్యవర్గంలో ఓ మోస్తరు ప్రాతినిధ్యమైనా కల్పించాలి… ఏపీలో పార్టీకి ఏముంది? స్వయంప్రకాశం ఏముంది..?  టీడీపీ వెలుగుల్లో ప్రకాశించడమే కదా, ఐనా మూడు పదవులు ఇచ్చారు…

తమిళనాడులో ఇచ్చారు… అక్కడా పార్టీకి ఏ సీనూ లేదు… కానీ తెలంగాణ సిట్యుయేషన్ వేరు కదా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు… మరెందుకు శీతకన్ను..? ఏం సంకేతం ఇస్తోంది బీజేపీ..? కొంపదీసి, కేసీయార్‌తో కలిసి వెళ్దాం, తను చెప్పినట్టు నడిస్తే చాలు అని ఇది ఓ మార్మిక బోధనా..? ఆల్రెడీ ఓసారి రాష్ట్ర అధ్యక్షుడినే పీకేశారు కదా, కేసీయార్ చెబితే..!!

పాత కార్యవర్గాల్లో డీకే అరుణ ఔట్… జాతీయ ఓబీసీ మోర్చా హెడ్ లక్ష్మణ్ ఔట్… త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలోనైనా ఈ రెండు మంత్రి పదవులైనా ఉంటాయా..? అవీ పీకేస్తారా..? ఏపీలో టీడీపీ వెలుగుల్లో ప్రకాశించినట్టే, తెలంగాణలో బీఆర్ఎస్ వెలుగుల్ని ఆశ్రయించి బతికేయాలనే సంకల్పమా..?

పైకి మాత్రం, నో, నో, ఎవరితోనూ పొత్తులుండవ్, అవగాహన ఉండదు, విలీనాలు ఉండవు అంటూ మేకపోతు గాంభీర్యాలు… ఒంటరిపోటీలు మాత్రమేనని ప్రకటనలు… చూడబోతే విరుద్ధమైన అడుగులు, ఆచరణ… నిజంగా ఓ సమర్థ నాయకుడు దొరికితే, హైకమాండ్ వెన్నుతడితే… బీఆర్ఎస్‌ను బొందపెట్టేసి, ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేంత మంచి స్కోప్ ఉన్న రాష్ట్రమిది…

కానీ తను అయోమయంలోకి జారిపోతూ, తెలంగాణ పార్టీ శ్రేణులను కూడా గందరగోళంలోకి, నైరాశ్యంలోకి నెట్టేస్తోంది బీజేపీ హైకమాండ్… ఫాఫం కమలదళం..!! ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పొండి,, మాకే పెద్ద ఇంట్రస్ట్ లేదు ఈ రాష్ట్రంపై అని తనే చెబుతున్నట్టుగా ఉంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!
  • ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!
  • సంస్కార దారిద్య్రం !! మీ దుంపతెగ- ఇదేం భాషరా బాబూ..!!
  • నా లైఫ్ నేను మాత్రమే మార్చుకోవాలి… ఇంకెవరో ఆ పని చేయరు…
  • మహేశ్ బాబూ – ఇక ఈ యాడ్స్ జోలికి వెళ్లకు – అవి శిక్షార్హమే !!
  • Flipkart – నీ దుంపతెగ- చావును కూడా అమ్ముకోవడం ఏమిట్రా ?
  • DC … విజయ్ దేవరకొండ చేసి ఉంటే… ఓ రేంజుకు వెళ్లిపోయేదేమో…
  • ఇది ఆ ఎన్టీయార్ పరువు ప్రతిష్ట కాదు – సుమన్ – సురేష్ బాపతు !!
  • చెప్పులు పోయాయ్ – కంగారెందుకు, చాట్‌జీపీటీ ఉందిగా, అడిగెయ్…
  • హీరో యశ్… ఈ కోణంలో నచ్చావ్… గ్రేస్, మెచ్యూరిటీ… 2 మెట్లు ఎక్కావ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions