పళ్ల తొక్కలు తీసి, కూరగాయల తొక్కలు తీసి… వాటిల్లో జీవం పారేసి, ఇంకేం తింటారురా… మీ బొంద, తొక్కల్ని తినడం నేర్చుకొండిరా, తొక్కలో తెలివీ మీరూనూ…… అంటూ ఇప్పటి దాకా బోలెడు వార్తలొచ్చినయ్, గొట్టపు చానెళ్ల కథనాలొచ్చినయ్… వెబ్ పోషక డాక్టర్ల సలహాలూ వచ్చినయ్… ఎప్పుడూ, ఎవడో ఒకడు, తొక్కల ప్రాశస్త్యం గురించి పిచ్చి సర్వేలు, స్టడీలు అని చెబుతూనే ఉంటాడు… మనం రాస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం… అసలు ప్రపంచంలో శ్రేష్టమైన తిండి అంటే, తొక్కలే అని బుర్రలకు ఎక్కించుకుంటూనే ఉన్నాం… పెద్ద వీళ్లకే తెలిసినట్టు..? అరె, ఉదాహరణకు బీరకాయ పొట్టుతో, పనస పొట్టుతో పొడులు, కూరలు చేసుకోవడం లేదా..? ఏ తొక్కలో ఏ టేస్టున్నదో మన పెద్దవాళ్లకు తెలియదా..? ఒరేయ్, ఒక్కమాట చెప్పండ్రా భయ్… అరటి తొక్కలో బొచ్చెడు పోషకాలు ఉన్నయ్… ఎలా తినాలిరా..?!
ఈ భావమథనానికి కారణం, పొద్దున్నే ఈనాడులో వసుంధర అనే స్పెషల్ పేజీల్లో కనిపించిన ఓ పిచ్చి కథ… అసలు ఆ పేజీ ఎన్నాళ్లుగానో ఇలా తయారైందీ అనే బాధ, ఆరోపణ ఉన్నదే… అరె, మొత్తం ఈనాడే అలా తయారైంది కదా, ఆఫ్టరాల్ వసుంధరను ఎత్తిచూపడం దేనికి అనుకుని అందరూ చదవడమే మానేశారు… ఈరోజు ఈనాడు సంపాదకీయ పేజీకి ఎంత నామమాత్ర పాఠకులున్నారో, వసుంధరకూ అంతే… కారణం… అసలు ఎవడూ పట్టించుకునేవాడు లేకపోవడం… లేకపోతే ఏమిటిది మహాశయా..? తొక్కల్నీ తినండి అని ఓ గొప్పాతిగొప్పెస్ట్ కథనం… దానికి పెట్టిన ఫోటోలు ఏమిటి..? అల్ల నేరేడు పండ్లు, జామకాయలు… ప్రపంచంలో ఎవడైనా నేరేడు పండ్లను తొక్కలు తీసి తింటారా..? దీన్ని రాసినోళ్లకు, వేసినోళ్లకు ఏమైనా ఉందా అసలు..?
Ads
అసలు జామకాయల్ని తొక్క తీసి తింటారా ఎవడైనా…? ఏది తొక్క తీయాలో, ఏది నార తీయాలో, ఎలా ప్రాసెస్ చేసుకోవాలో తెలియకుండానే తింటున్నారా ప్రజలు ఇన్నేళ్లుగా…? యాపిల్ పొట్టుతో తిను, వోకే… ఓ లెక్క ప్రకారం ఉంది… కానీ అరటి, జామ, నేరేడు, ద్రాక్ష కూడా ఈ కేటగిరీలో చేర్చాలా..? ప్రపంచంలో ఎవడైనా ద్రాక్షను తొక్క తీసి తింటాడా..? తొక్కలో వార్త కాకపోతే…!! అంతేలెండి… పత్రికవాడికి పాఠకుడు లోకువ… నీ పేపర్ కొని.., నిన్ను పొట్టు, తొక్కతో సహా బతికిస్తున్నాడు కదా… అలాగని మరీ ఇలా తొక్కలో కథనాలు ఇవ్వాలా..? ఒక్క మాట… మీరు పొట్టు, తొక్కలాగా తీసిపారేసే పాఠకుల్లోనే అసలు పోషకాలు, మీ పోషకాలు, మీ మహారాజపోషకులు… అది మరిచిపోకండి… అపహాస్యం చేయకండి…!! ఛిఛీ… ఈ తొక్కలో వార్తలు నాకే ఎందుకు కనబడాలి… దేవుడా…!!!!
Share this Article