థాంక్స్ టు మోడీ…. మన సమాజం ఇప్పుడప్పుడే పూర్తిగా వేక్సినేషన్ చేయించుకోలేదు… పరమాద్భుతమైన పాలసీల చక్రవర్తి కదా… ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ మీద భయాందోళనల్ని సృష్టించే పనిలో కార్పొరేట్, నీచ్ నికృష్ట్ ఫార్మా బ్యాచ్ తలమునకలై ఉంది… ఫోర్త్ వేవ్స్, బూస్టర్ డోసులు, డెల్టాలు, డెల్టా ప్లస్సులు, బ్లాక్ ఫంగసులు, వీలయితే గామా, గామా ప్లస్, అల్ఫా, బీటా తదితర వైరస్ మ్యుటెంట్లనూ ప్రచారంలోకి తెచ్చి… రోగగ్రస్త సమాజాన్ని మరింత కుళ్లబొడిచే ‘గాడిద కొడుకుల’కు ఢోకాలేదు… ఎస్, కొన్నికోట్ల మంది ‘‘ఏమైనా జరగనీ’’ అనే నిర్లక్ష్యంతో ఉంటున్నారు, కరోనాను వ్యాప్తి చేస్తున్నారు, నిజం… అదే సమయంలో భయంతో గడగడా వణుకుతూ బిగదీసుకుని, గిరిగీసుకుని, సమాజానికి దూరంగా బతుకుతున్నవారూ ఉన్నారు… దిప్రింట్ సైట్ రాసిన ఓ వార్త ఆసక్తిగా అనిపించింది… మన ఆరోగ్య, వైద్య, పాలన వ్యవస్థల్ని వెక్కిరిస్తున్నట్టుగా….
తూర్పుగోదావరి జిల్లా… రాజోలు మండలం… కడలి గ్రామం… యాభై ఏళ్ల జాన్ బెన్నీ, తన కొడుకు 29 ఏళ్ల చినబాబు… ఓ సైకిల్ రిపేరు షాపు నడిపించుకుంటూ బతుకుతుంటారు… ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు… బెన్నీ భార్య నలభయ్యేళ్ల రుత్తమ్మ, ఆమె ఇద్దరు బిడ్డలు, 30 ఏళ్ల కాంతామణి, 32 ఏళ్ల రాణి… నమ్ముతారా..? 15 నెలలపాటు వాళ్లు తమనుతాము ఓ చిన్న గుడిసెలో బందీలైపోయారు స్వచ్ఛందంగా… కేవలం కరోనా భయంతో… బయటికి వస్తే చచ్చిపోతామనే భయంతో… అప్పుడప్పుడూ ఆ ఇద్దరు మగాళ్లు బయటికి వచ్చి కావల్సిన సరుకులు కొనుక్కుని వెళ్లడం… అంతే… మరీ ఆడవాళ్లయితే బయటికి అడుగుపెట్టిందే లేదు… ఇది ఎలా బయటపడిందో తెలుసా..? ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు గట్రా శ్రద్ధతో ఒక్కొక్క కుటుంబం బాగోగులు చూడటం వల్ల కాదు…
Ads
ఈమధ్య జగన్ ప్రభుత్వం పక్కా ఇళ్ల స్కీం పెట్టింది కదా… దాని గురించి అలర్ట్ చేసి, దరఖాస్తు చేసుకొమ్మని చెప్పడానికి ఓ గ్రామ వాలంటీర్ ఆ ఇంటివైపు వెళ్లడం వల్ల… ఆ వాలంటీర్‌ను చూడటానికి, కలవడానికి కూడా ఆ కుటుంబం నిరాకరించింది… అంత భయం… పోనీ, ఆ గ్రామ సర్పంచో, ఇతర ప్రభుత్వ సిబ్బందో పట్టించుకున్నారా..? లేదు…! ఆ గ్రామ వాలంటీర్‌కు డౌటొచ్చింది… పంచాయతీ, వైద్యారోగ్య, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చాడు… పోలీసులు అక్కడికి చేరుకున్నారు… ఎలాగోలా కన్విన్స్ చేసి ఆ ఆడవాళ్లను బయటికి రప్పించారు… తీరా చూస్తే, నిలువునా ఎండిపోయి, చావుకు దగ్గరలో కనిపించారు… వాళ్లలో డీ విటమిన్ లేదు, బీ కాంప్లెక్స్ లేదు, రక్తంలో హీమోగ్లోబిన్ డేంజర్ లెవల్స్‌కు (4 గ్రాములు) పడిపోయింది… మానసికంగా కూడా డిస్టర్బ్డ్…
15 నెలల క్రితం ఎవరో తమకు దగ్గరలో బతికే ఓ బంధువు కరోనాతో చనిపోవడంతో వాళ్లకు భయం పట్టుకుంది… అదీ సమస్య… వాళ్లకు పక్కా ఇల్లు లేదు… ఓ గుడిసెలో బందీలు అయిపోయారు… ఏం తిన్నారో, ఎలా బతికారో… ఎవరికీ పట్టలేదు… రోజువారీ తప్పనిసరి ‘అవసరాలు’ ఎలా తీర్చుకునేవాళ్లో తెలియదు… ఎప్పుడైనా ఓసారి ఆ ఇంటి మగాళ్లు రేషన్ తీసుకోవడానికి బయటికి కనిపించేవాళ్లు… వర్షం వస్తే గుడిసె పైన ఓ ప్లాస్టిక్ షీటు కప్పుకునేవాళ్లు… ఇప్పుడు పోలీసులు వాళ్లను రాజోలు హాస్పిటల్లో చేర్చారు… అక్కడ చేరడానికి కూడా మొరాయించారు మొదట్లో… ఇంకా ఆ గుడిసెలోనే ఉంటే నిజంగానే చచ్చిపోతారు మీరు అని భయపెట్టి మరీ, బయటికి రప్పించి, హాస్పిటల్లో చేర్పించారు… భయం, సర్వత్రా భయం… అదే సమయంలో మాస్కుల్లేకుండా, జాగ్రత్తలు లేకుండా ఎడాపెడా అజాగ్రత్తగా తిరుగుతున్న లక్షలాది జనం… ఎంత కంట్రడిక్షన్… కరోనా ఇంకెన్ని కథల్ని చెప్పనుందో…!!
Share this Article