దేశంలోకెల్లా నంబర్ ఫోర్ స్థానంలో ఉండే పత్రిక దైనిక్ భాస్కర్… 12 రాష్ట్రాలు, 65 ఎడిషన్లు… హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలు… దాదాపు 45 లక్షల సర్క్యులేషన్… ఆ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి… ఇదీ వార్త… దాంతోపాటు యూపీ బేస్డ్ భారత్ సమాచార్ అనే మరో చానెల్‌పై కూడా..! దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు కరోనా మీద నిజాలు రాస్తున్నది కాబట్టి, యోగి ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై నిశితదాడి కొనసాగిస్తున్నది కాబట్టి, ఆ మీడియా ఎడిటర్ ఓమ్ గౌర్ న్యూయార్క్ టైమ్స్‌లో ఓ కాలమ్ రాసి మోడీని ఇరుకునపెట్టాడు కాబట్టి మోడీ సర్కారు ఇలా ఐటీ దాడులతో వణికించాలనీ, అదుపులో పెట్టుకోవాలని చూస్తున్నది అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి… ఇతర మీడియా సంస్థలు రాసేస్తున్నాయి… పాత్రికేయుడన్న ప్రతి ఒక్కడూ ఏ పత్రిక మీద ఎలాంటి దాడి జరిగినా ఖండించాలి అనబడే ఓ అలిఖిత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఓ సగటు మనిషిగా, కామన్ సెన్స్ పాయింట్స్ కొన్ని మాట్లాడుకుందాం…
కేసీయార్ భాషలో చెప్పాలంటే…. ‘‘అరె, దేశాన్ని ఏలుతున్న పార్టీ మాది, సన్నాసుల మఠం కాదు, బరాబర్ ఇలాగే చేస్తం, ఇష్టమొచ్చినట్టు రాస్తే, బదనాం చేస్తే ఊకుంటమా..? మాది రాజకీయ పార్టీ కాదా..? మా ప్రభుత్వాల మీద దాడికి దిగితే అన్నీ మూసుకుని ఇంట్ల పండుకోవాలా..?’’… అని మోడీ చెప్పాలేమో…! హహహ… నిజాలు చెప్పుకుందాం… 1) కరోనా నియంత్రణలో మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ 2) వేక్సినేషన్ పాలసీలో అట్టర్ ఫ్లాప్ 3) మరణాల మీద అబద్దాలు చెప్పడంలో నంబర్ వన్ 4) చివరకు నిన్న కూడా ఆక్సిజెన్ కొరతతో ఒక్కరూ చనిపోలేదనే బుర్రతిరుగుడు ప్రకటన చేసింది… అన్నీ నిజాలే… అయితే ఒక్క మోడీయే అట్టర్ ఫ్లాప్ కేటగిరీయా..? రాష్ట్రాలు ఏం చేశాయి మరి..? విపక్షాల ప్రభుత్వాలున్న కేరళ, మహారాష్ట్రలు కాదా పరిస్థితిని ఈరోజుకూ దిగజారుస్తున్నవి… మరి ఉద్ధవ్ ఠాక్రే, పినరై విజయన్ ఏం ఉద్దరిస్తున్నట్టు..? యోగీ ఫ్లాప్ సరే, తమిళనాడు మాటేమిటి..?
Ads
ప్రభుత్వాల వైఫల్యాలపై ఒక్క దైనిక్ భాస్కర్ పత్రిక మాత్రమే రాస్తున్నదా..? అసలు భారత్ సమాచార్ చానెల్‌ను పట్టించుకున్నవారెవరు..? ప్రముఖ టీవీ చానెళ్లు, పెద్ద పత్రికలు కూడా కరోనా వైఫల్యాలపై పుంఖానుపుంఖాలుగా రాశాయి… చూపించాయి… డిబేట్లు పెట్టాయి… రచ్చరచ్చ చేశాయి, చేస్తున్నాయి… కానీ మోడీ ప్రభుత్వం ప్లస్ యోగీ ప్రభుత్వం ఒక్క దైనిక్ భాస్కర్‌నే ఎందుకు టార్గెట్ చేశాయి..? సరే, అదంటే పెద్ద మీడియా కాబట్టి కంట్రోల్‌లో పెట్టుకోవాలని అనుకున్నారేమో… మరి భారత్ సమాచార్ అనే చిన్న పిట్ట దేనికి..? మరో కీలక విషయం… నిజంగా కరోనాపై ఎవరినైనా సతాయించాలని అనుకుంటే… ఈ ఐటీ రెయిడ్లు దేనికి..? చాలా పవర్‌ఫుల్ పాండెమిక్ యాక్ట్ ఉంది కదా ప్రభుత్వాల చేతుల్లో… కోర్టులు కూడా ఇన్వాల్వ్ కాలేవు ఆ కేసుల్లో అయితే…! మరి ఏ మీడియా మీద కూడా ప్రయోగించలేదే..!! ఒకవేళ బలంగా కొట్టాలనే మోడీ సర్కారు భావించే పక్షంలో ఐటీ దాడులు దేనికి..? దాంతో ఒరిగేదేమీ ఉండదు, కాకపోతే ఈడీ, డీఆర్ఐ లేవా..?
దైనిక్ భాస్కర్ ఎడిటర్ ఈ దాడుల తరువాత స్పందించి, వరుస ట్వీట్లు కొడుతూ… ఇది మాది కాదు, ఇది మీది కాదు, ప్రజలది… మేం స్వతంత్రులం, ఎందుకంటే మేం భాస్కరులం, రీడర్స్ అభిప్రాయాలు మాత్రమే మమ్మల్ని నడిపిస్తాయి… ఇలా ఎడాపెడా ఎదురుదాడికి దిగాడు… దిటెలిగ్రాఫ్ వాడయితే ‘‘ఇదిరా దమ్ము అంటే, వీడికి వెన్నెముక ఉంది’’ అంటూ ఏకంగా ఓ బ్యానరే కొట్టాడు… మోడీని ఎవరైనా తిడితే ఈ పత్రికోడికి పండుగ… సరే, మీడియా అయినంతమాత్రాన ఐటీ దాడులు జరగకూడదా..? బలమైన గ్రూపు, బలమైన ఆడిటర్లున్నారు కదా, ఐటీ రెయిడ్లకు జవాబు ఇచ్చి, ఏమోయ్, మోడీ, వుయ్ ఆర్ ఫెయిర్ అని సమాధానం చెప్పొచ్చు కదా… ప్రజలకూ, పాఠకులకూ చెప్పొచ్చు కదా… వీటిల్లో అరెస్టులు గట్రా ఏమీ ఉండవు కదా… పన్ను ఎగవేత లేకపోతే, లేదని నిరూపించుకునే బాధ్యత మీడియా గ్రూపుదే… సగటు పాన్ కార్డు హోల్డర్ చేయడం లేదా..? ఇదీ అంతే…
మీడియా పేరుంటే చాలు ఇక ఎవరూ దాడులు చేయొద్దు, దర్యాప్తులు చేయొద్దు అంటే ఎలా..? మినహాయింపులు, రక్షణలు ఉంటాయా..? చట్టాలకు అతీతమా..? ఒక సగటు పాన్ కార్డు హోల్డర్‌కూ ఒక బలమైన మీడియా గ్రూపుకీ తేడా ఏమీ ఉండదు కదా… లేదు, లేదు, మామీద ఈగవాలితే ఇక అది పత్రికల మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి, భావప్రకటన స్వేచ్ఛ మీద దాడి అంటే ఎలా..? అసలు మీడియా స్వేచ్ఛ అనే పదమే అబ్సర్డ్… ఈ వాదన నిష్ఠురంగా అనిపిస్తోందా..? ఒక్కసారి సాక్షి మీద, ఈనాడు మీద దాడులు జరిగినప్పుడు చర్చల్ని గుర్తుతెచ్చుకొండి… మార్గదర్శి అక్రమాలూ మీడియా మీద దాడే అన్నారు… జగన్ అక్రమాస్తులపై కేసులూ మీడియా మీద దాడే అన్నారు..!! దైనిక్ భాస్కర్ మొదలూ కాదు, చివరా కాదు… చట్టాలకు లోబడి, అన్నిరకాలైన జాగ్రత్తలతో వ్యవహరించాల్సిందే… ప్రత్యేకించి ఇండిపెండెంటుగా వ్యవహరించే పక్షంలో…!!
Share this Article