అందరికీ తెలుసు, ఇండియన్ ఐడల్ ఓ ‘స్క్రిప్టెడ్ షో’ అని..! కానీ ఇండియన్ ప్రజెంట్ టాప్ ఫైవ్ షోలలో ఒకటిగా చేరి, నిజంగానే బాగా ఆదరణ పొందుతోంది… టీవీ రేటింగులు, యాడ్స్ కోసమే షో టీం కష్టపడుతూ ఉంటుంది… కానీ ఈసారి ఈ టీం క్రియేటివిటీ, థింకింగ్ స్టయిల్ టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది… లక్కీగా ఈసారి అద్భుతమైన టాలెంట్ ఉన్న సింగర్స్ దొరికారు… ఏక్‌సేఏక్ ఇరగదీస్తున్నారు… ఇంతకీ మనం ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే..? పంద్రాగస్టు ఈ షో ఫినాలే… ఆరోజు ఎన్ని గంటలపాటు టెలికాస్ట్ ఉంటుందో తెలుసా..? పన్నెండు గంటలు..! నిజమే, మీరు చదివింది కరెక్టే… 12 గంటలపాటు నిరంతరాయంగా సినిమా తారలు, సంగీత దర్శకులు, గాయకులు, ఇతర ప్రముఖులతో… ఫైనలిస్టుల పాటలతో సాగుతూనే ఉంటుంది… అదీ ఆశ్చర్యం… తెలుగుతో పోల్చకండి, సినిమా ఫంక్షన్ల లైవ్ పెట్టేయడం తప్ప వీళ్లకు గంటారెండు గంటల షోలు చేయడమే రాదు… మన సినిమా వాళ్లు కూడా మన టీవీ వాళ్లను పిచ్చ లైట్ తీసుకుంటారు, వాళ్లను దేకనే దేకరు…
12 గంటల ప్రసారం అనేది నిజానికి చిన్న టాస్కేమీ కాదు… కానీ సోనీ, స్టార్ వంటి టీవీలు ‘థింక్ బిగ్’ అన్నట్టుగా… ప్లానింగు, డబ్బు ఖర్చు, టాలెంట్ హంట్, ఫన్ మిక్సింగ్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్… అన్నీ మిక్స్ చేసి రంజింపజేసే దిశలో… ఏ రేంజ్కైనా ఆలోచిస్తున్నయ్… ఇండియన్ ఐడల్ షో ఇప్పటికి 70 ఎపిసోడ్లు అయిపోయింది… మరో మూడు వారాలున్నయ్… ఇక ఎలిమినేషన్లు ఉండవ్… మిగిలిందే ఆరుగురు… వాళ్లు లేకపోతే ఈ మూడు వారాల షోలు రక్తికట్టవు… ఎవరు గెలుస్తారనే విషయంలో వోటింగులు, ట్రోలింగులు, పోస్టులు, రచ్చ ఇంకా పెరుగుతూనే ఉంది… డానిష్, షణ్ముఖప్రియలను నార్త్ ఇండియన్ వ్యూయర్స్ ప్రధానంగా టార్గెట్ చేశారు… కొంత అప్సెట్ అయినట్టున్నారు, రెండువారాలుగా డల్‌గా ఉన్న ఆ ఇద్దరూ మళ్లీ హుషారుబండి ఎక్కేశారు మొన్నటి సండే… బప్పీలహరి స్పెషల్ షో అది… రక్తికట్టింది, పాటల ఎంపిక, కంటెస్టెంట్లు పాడిన తీరు… నమక్ హలాల్ పాటలు పాడిన సయిలీ, అరుణిత జోష్ తీసుకురాగా… పవన్ దీప్ షోను హైజాక్ చేసేశాడు… కారణం తెలుసా..? ఇదీ…
Ads
బప్పీలహరి, తన చిన్ననాటి తబలా ఇది అని చెబుతూ పవన్ దీప్‌కు బహూకరించాడు… అక్కడే తబలా ముందు పెట్టుకుని, ఒకవైపు తబలా వాయిస్తూ… మరోవైపు ఎక్కడా శృతి తప్పకుండా తను పాడిన తీరు రియల్లీ ఫెంటాస్టిక్… పవన్ దీప్‌లో ఉన్నవి రెండు సమస్యలు… ఎమోషన్స్ కనిపించవు మొహంలో… ఎక్కడా ఓ యువకుడిలో ఉండాల్సిన జోష్ కనిపించదు… కానీ గొంతు విప్పితే, ఏదైనా సంగీత పరికరం పట్టుకుంటే ఇక ఎక్కడికో తీసుకుపోతాడు శ్రోతల్ని…! ఎక్కువగా మెలొడీనే ఎంచుకునే పవన్ మాస్, స్పీడ్ సాంగ్స్ పాడటం తక్కువే… మనం ఎందుకు ఒక టీవీ షో గురించి చెప్పుకోవాలీ అంటారా..? ఆ షో చూసేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది, ప్రత్యేకించి హైదరాబాద్‌లో..! ఇక్కడ హిందీ టీవీ షోలకు వీక్షకులు చాలా ఎక్కువ… రెగ్యులర్ వైర్డ్ కనెక్షన్లకన్నా ఇక్కడ డీటీహెచ్ కనెక్షన్లు ఎక్కువ… ఎందుకంటే, ఉత్తరదేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎప్పుడో తరాల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయాయ్ కొన్ని వేల కుటుంబాలు… వాళ్ల మాతృభాష ప్రోగ్రాములు కావాలంటే మరి డీటీహెచ్ మాత్రమే దిక్కు… ఇప్పుడు ఓటీటీలు… ప్లస్ ఇదుగో, ఇలాంటి హిందీ టీవీ షోలు..!!
Share this Article