Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింగీతంకు తెలుగు సమాజం నుంచి సముచిత గౌరవం దక్కిందా?!

October 5, 2026 by M S R

.
Rochish Mon …. సింగీతం శ్రీనివాసరావు సంగీత దర్శకుడు కూడా!!!
ఇళైయరాజా… సింగీతం పాటకు వాద్య సంగీతం సమకూర్చారు ఇళైయరాజా!
సింగీతం శ్రీనివాసరావు ఒక గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, ఒక సంగీత దర్శకుడు కూడా!

ఔను, సింగీతం రెండు కన్నడం సినిమాలకు సంగీతం చేశారు. అందులో ఒకటి 1986లో వచ్చిన సినిమా ‘భాగ్యదలక్ష్మీ బారమ్మ’. ఇది రాజ్‌కుమార్‌ నాయకుడుగా చేసిన సినిమా.
సింగీతం సంగీతం చెయ్యడానికి ప్రోత్సాహకం ఇళైయరాజా.

“మీకు వస్తుంది చెయ్యండి” అని ఇళైయరాజా అంటున్నప్పుడల్లా “నేను సంగీతం చేస్తే మీరు వాద్య సంగీతం చెయ్యండి” అనే వారు సింగీతం.
సింగీతం మాట ప్రకారం ఇళైయరాజా సింగీతం పాటకు వాద్య సంగీతం సమకూర్చారు! ఈ విషయాన్ని సింగీతం స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడిచేశారు. ఆ ఇంటర్వ్యూ ఎవరు చేశారు? ఈ ఇంటర్వ్యూ ఎ.ఆర్. రహ్మాన్ చేశారు!

Ads

స్వయంగా సింగీతం చెప్పిన మాట లింక్: https://youtu.be/n840u600vnI?si=ToovtFIbrnbWqZ8w

కమల్ హాసన్ వంటి అంతర్జాతీయ స్థాయి సినిమా టెక్నీషిఅన్ సింగీతంపై ప్రత్యేక అభిమానం చూపిస్తారు. ఇళైయరాజాకు సింగీతం అంటే అభిమానం. రహ్మాన్ స్వయంగా సింగీతంపై అభిమానంతో ఇంటర్వ్యూ చేస్తారు. కన్నడం రాజ్‌కుమార్‌కు సింగీతంపై ప్రత్యేక అభిమానం. ఇలాంటి పరిణామం తెలుగులో జరుగుతుందా?

ఆ సింగీతం స్థానం, పరిగణన తెలుగులో ఏమిటి? ఆ తమిళ్ష్, కన్నడం స్థాయి కళాకారులు తెలుగు కళాకారుడు సింగీతంను గౌరవించినట్టుగా తెలుగు కళాకారులు గౌరవించారా? గౌరవిస్తారా?
తెలుగులో ఏం లేదు? తెలుగులో ‘నాణ్యత’కు పరిగణన ఎందుకు లేదు; రాదు? తెలుగులో నాణ్యతకు చోటుండదా? తెలుగులో ఎప్పటికీ ఇంతేనా? మన సింగీతం వంటి గొప్పవాళ్లు ఇతర భాషల్లో మాత్రమే గొప్పవాళ్లు అవుతారా?

రానున్న రోజుల్లో మన సింగీతం శ్రీనివాసరావు గారిని కూడా తమిళ్ష్‌నాడు ప్రభుత్వం ఆధికారికంగా తగిన రీతిలో గౌరవించుకుంటుంది. మన తెలుగుతనం స్వాభావిక నైజంతో అసభ్యకరంగానూ, సిగ్గు, స్పృహ లేకుండానూ కులం కుళ్లులో, ప్రాంతీయత రొచ్చులో పొర్లుతూంటుంది. అది తెలుగు; అదే తెలుగు.

సింగీతం చేసిన సంగీతం https://youtu.be/-c6HmNKWw2g?si=O0yVWtjuVmynOB-W

— రోచిష్మాన్ …. 9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగీతంకు తెలుగు సమాజం నుంచి సముచిత గౌరవం దక్కిందా?!
  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!
  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions