మంచి ప్రైమ్ టైమ్ సీరియల్… మంచి దమ్మున్న కథ… అందులోని ప్రతి నటి, ప్రతి నటుడూ మనసుపెట్టి ప్రతిభ చూపిస్తున్నారు… ఒరిజినల్ మరాఠీ సీరియల్ తులా పహెతే రే ప్రసారం జరిగినన్నాళ్లూ ఫస్ట్, సెకండ్ ర్యాంకుల్లో ఉండేది… దాని ఆధారంగా కన్నడంలో రీమేక్ చేసిన జోతే జొతెయాలి సీరియల్ కూడా టాప్ ఫైవ్ రేటింగ్స్‌లో ఉంటుంది… కానీ తెలుగుకు వచ్చేసరికి ఎందుకో చతికిలపడిపోయింది… జీతెలుగులో ప్రేమ ఎంత మధురం పేరిట ప్రసారం అవుతుంది ఈ సీరియల్… నిజానికి తెలుగులో కూడా మంచి రేటింగ్స్ సాధించాలి… ఎప్పుడూ పలు సందేహాలకు తావిచ్చే స్టార్‌మాటీవీ రేటింగ్స్‌ను వదిలేస్తే… జీతెలుగు సీరియళ్లనే పరిశీలించినా సరే… ఈ సీరియల్ నాలుగో ప్లేసుకు పడిపోయింది… ఒక దశలో త్రినయనితో పోటీపడుతూ సెకండ్ ప్లేసులో ఉండేది… వాస్తవానికి త్రినయని పరమ బోరింగు… కథ ఎలా ఉన్నా, ట్రీట్మెంట్ మరీ చెత్త… పాత్రల కేరక్టరైజేషన్ గానీ, కథనంలో గ్రిప్ గానీ… చాలాచాలా అంశాల్లో పూర్ డైరెక్షన్… ఐనాసరే, హీరోయిన్ పాత్ర, దాన్ని పోషిస్తున్న ఆశిక గోపాల్ ప్రతిభ కారణంగా ఫస్ట్ ప్లేసులో కొనసాగుతోంది…
త్రినయనితో పోలిస్తే ప్రేమఎంతమధురం సీరియల్ కథలో దమ్ముంది… కానీ దర్శకుడు పూర్తిగా కన్నడాన్నే ఫాలో అయిపోతున్నాడు… పాత్రల పేర్లు సహా… ఏ మార్పులూ లేవు… సేమ్, త్రినయని సీరియల్ అవలక్షణాలన్నీ… కాదు, కాదు, సగటు టీవీ సీరియల్ అవలక్షణాలన్నీ ఇందులోనూ ఉన్నయ్… జీతెలుగు క్రియేటివ్ టీం లేదా ప్రేమఎంతమధురం సీరియల్ నిర్మాతలు కాస్త బుర్రలు ఉపయోగించినా ఈ సీరియల్ మాటీవీ సీరియళ్లకు మంచి పోటీ ఇవ్వగలిగేది… అసలు కథలో థ్రిల్ పాయింటే రాజనందిని పాత్ర… ఇన్ని నెలల తరువాత ఇప్పుడు ప్రవేశపెట్టారు… ఇప్పటిదాకా నడివయసు హీరో, లేతవయసు హీరోయిన్ ప్రేమతోనే కథ నడిపిస్తూ వచ్చారు… ఈ రాజనందిని పాత్రలో ఓ కొత్త మొహం కనిపించింది… డౌటెందుకు మీకు..? కన్నడ నటే… తెలుగు టీవీ సీరియల్స్ అంటేనే కన్నడ తారల హవా కదా… ఈమె కూడా అంతే… పేరు మానస మనోహర్… తెలుగు సీరియల్లోని మీరా పాత్రను కన్నడ జోతె జొతియాలెలో ఈమే చేస్తుంటుంది…
Ads
ఐనా సరే, ఈమెను ఎక్కడో చూసినట్టుంది అని కొట్టేస్తోందా..? నిజమే… అప్పట్లో నాకునేనే తోపుతురుము అనబడే ఓ తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసింది… పాటల్లో హాట్‌హాట్‌గా సందడి చేసింది… కాకపోతే ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎక్కడ కొట్టుకుపోయిందో నిర్మాతలకే అంతుపట్టలేదు… ఈ హీరోయిన్ ఆన్లైన్ బయోడేటా వివరాల్లో కూడా పాపం, ఆ సినిమా పేరు పెద్దగా కనిపించదు… ప్రేమఎంతమధురం హీరోయిన్ వర్షతో పోలిస్తే ఈమె హైట్ ఎక్కువ… రాజనందిని పాత్రకు భలే సూటైనట్టే కనిపిస్తోంది… నిజానికి మరాఠీ ఒరిజినల్లో హీరో పాత్ర మొదట్లో సాఫ్ట్‌గా ఉన్నా… తరువాత దాని డార్క్ సైడ్ వేరే కనిపిస్తుంది… హీరో పాత్రను అలా తీర్చిదిద్దడానికి నిర్మాతకు, దర్శకుడికి దమ్ముండాలి… వాళ్లకు ఉంది… రాజనందినిని, ఫ్రెండ్ జిండేను చంపేస్తాడు, చివరకు తనే సూసైడ్ చేసుకుంటాడు… కన్నడకు వచ్చేసరికి హీరోకు స్ప్లిట్ పర్సనాలిటీ అనీ, తను బాగా ప్రేమించే వ్యక్తి దూరమైతే ఒరిజినల్ కేరక్టర్‌కు భిన్నంగా ప్రవర్తిస్తాడనీ కేరక్టరైజేషన్‌లో మార్పులు చేసి, ఇదంతా తవ్వి, ఓ సైకియాట్రిస్టును పట్టుకుని, హీరోను బాగు చేసే బాధ్యతను కూడా హీరోయిన్ తల మీదే పెట్టేస్తున్నారు… ఎలాగూ కన్నడ సీరియల్‌కు తెలుగు సీరియల్ మక్కీకిమక్కీ కాబట్టి ఇకపైనా ఈ కథ అలాగే ఉండబోతున్నదేమో..!!
Share this Article