ఎప్పుడైనా కపిల్ కామెడీ షోలు చూశారా…? భారతీయ వినోదరంగాన్ని శాసించే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో షోలు చేయడం మాత్రమే కాదు… పెద్ద పెద్ద తలకాయలు కూడా తన షోలకు అతిథులుగా వచ్చేస్తుంటారు… ఓ పేద్ద సమూహాన్ని, సమావేశాన్ని ఫేస్ చేస్తూ… అందరినీ నవ్వించే కామెడీ చేయగలడు… ఎక్కడా వీసమెత్తు అసభ్యత, అశ్లీలం ఉండదు… మనసారా నవ్వుకునేలా ఉంటుంది… తను వేసే సెటైర్లు కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు… అలా స్టాండప్ కామెడీ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు… చాలా షోలు వచ్చాయి… కానీ ఎవ్వరూ బూతును నమ్ముకోరు… ఎటొచ్చీ ఈ దరిద్రమంతా మన తెలుగు టీవీ కామెడీ ప్రేక్షకులదే…
ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే..? ది గ్రేట్ మన రామోజీరావు గారి ఉత్తమోత్తమ, అత్యుత్తమ అభిరుచికి అద్దం పట్టే జబర్దస్త్ షో ఉంది కదా… ఫక్తు అక్రమ సంబంధాలు, శోభనాలు, లేచిపోవడాలు, లైనేయడాలు… వికారంగా ఉండే స్కిట్లకు పేరు గాంచిన ప్రోగ్రామ్… ఈ టేస్టును బూతులు తిట్టినా సరే వాళ్లు మారరు… ఆ షో మారదు… ఇక ఆ వాతావరణంలో కదిలీ మెదిలీ… దాన్నే కామెడీ అనుకుని నాగబాబు… జీతెలుగుకు వచ్చి తనూ అలాంటి షో స్టార్ట్ చేశాడు… ఇప్పుడు దాని పేరు బొమ్మ అదిరింది… అది అట్టర్ ఫ్లాపయింది…
ఒక కామెడీ షో టీవీలో రక్తికట్టించాలంటే… మొదట మంచి టేస్టుండాలి. తరువాతే మెరిట్ ఉండాలి… గతంలో జబర్దస్త్‌కు పోటీగా జీటీవీలో, మాటీవీలో ఏవో ప్రయోగాలు చేశారు… ఫ్లాప్… మాటీవీలో బ్రహ్మానందం, తేజస్వి కలిసి చేశారు… జీటీవీ వాళ్లు చేసిన ప్రోగ్రాం పేరే ఎవరికీ గుర్తులేదు… మరి ఏమనిపించిందో ఏమో… జీవాళ్లు ఒప్పుకోలేదేమో… తన సొంత యూట్యూబ్ చానెల్ కోసం నాగబాబు ఓ ప్రయోగం చేశాడు…
Ads
స్టాండప్ కామెడీపై ఓ కంటెస్టు స్టార్ట్ చేయాలని తలపెట్టాడు… ఆడిషన్స్ అన్నాడు… కమెడియన్ భాస్కర్‌కు అప్పగించినట్టున్నాడు… కానీ కరోనా కారణంగా కొన్నాళ్లు ఆగి, మళ్లీ ఈమధ్య పట్టాలకెక్కినట్టుంది… తాజాగా ప్రొమో ఒకటి విడుదల చేశారు… అది చూస్తుంటే అంతులేని ఆశ్చర్యం… ఇదా నాగబాబు టేస్టు… కామెడీ అంటే ఇదా..? పైగా నాగబాబు పక్కన ఉంటే చచ్చినట్టు నవ్వక తప్పదు కదా అన్నట్టుగా ధనరాజ్, శ్రీముఖి, గెటప్ సీను, వేణు తదితరులు కూడా ఈ పోటీలకు హాజరై పడీ పడీ నవ్వుతున్న తీరు చూస్తే… విభ్రమ… ఎందుకంటే..? అరాచకమైన అశ్లీలం… మచ్చుకు…
లుంగీ పోయి లంగా మీద పడితే… అర్జున్ రెడ్డి సినిమా అంతా చూసి, ఐసు ముక్కలు ఎందుకుసుకున్నాడు అనడిగిందట… ఫుల్లుగా దెం- తాగి… మీదంటే మా ఆవిడకు ఎంతిష్టమో తెలుసా? రోజూ రాత్రయితే చాలు, భాస్కర్ గారిది పెట్టండి, పెట్టండి అని ఒకటే గోల… శోభనం రాత్రి పేరెంట్స్‌కు కూడా నిద్ర ఉండదండీ… ఓ పనిచేయరా, అనుష్కను హాఫ్ డే నాకు పంపించు, రకుల్‌ను నేను నీకు పంపుతాను…
అసలు ప్రొమోయే ఇలా ఉంటే… ఇక అసలు వీడియోలు విడుదల అవుతుంటే ఇక చూసుకొండి నాసామిరంగా… నిజానికి ఆ యూట్యూబ్ ప్రొమో కూడా ఇక్కడ షేర్ చేయాలని అనిపించడం లేదు… అంత గలీజుగా ఉంది… ఇక దీనికి 24 కామిక్స్ అట… ఏడుగురు గ్రాండ్ ఫైనలిస్టులు అట… ఒక మెగా పోరు అట… ఇంకేం..? ధారాళంగా బూతు రోత… ప్రవహించబోతోంది అన్నమాట… అసలు తెలుగు టీవీ కామెడీ అంటేనే బూతు అనేలా ఈ కామెడీని బాగా ఉద్దరించిన ప్రతి ఒక్కరికీ ఈ వీడియోలు అంకితం…!!
Share this Article