ప్రభుత్వ ఉన్నతాధికారులు అంటేనే మెదళ్లు ఎక్కడ ఉంటాయో తెలిసిందే కదా… అస్సాం అయినా సరే, అండమాన్ అయినా సరే… ఈ కేరక్టర్లు మాత్రం ఏమాత్రం తేడా లేకుండా ఇలాగే ఉంటయ్… అధికశాతం… ఈ ఉదాహరణ చదివితే మన నమ్మకం మరింత రూఢీ అయిపోతుంది… నిన్న మన బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కాంస్య పతాకాన్ని సాధించింది… చదివారు కదా… అసలే అరంగేట్రం, ఐనా సరే ఆత్మవిశ్వాసంతో… ఒలింపిక్స్ పతకం సాధించిన మూడో బాక్సర్‌గా చరిత్ర రాసుకుంది… అంతర్జాతీయ బాక్సింగులో అనుభవం కూడా తక్కువే… బోలెడంత అనుభవం, దూకుడు ఉన్న టర్కీ ఆటగత్తె సుర్మెనెలితో పోటీ… ఓడిపోయింది… కానీ బాక్సింగు పోటీలో రెండు కాంస్యాలు ఉంటయ్ కాబట్టి, ఆమె ఓడినా సరే కాంస్యం లభించింది… సరే, మరో విషయానికి వద్దాం… ఆమెది ఓ మారుమూల గ్రామం బారాముఖియా… అస్సాం… ఘోలఘాట్ జిల్లా… ఈమె అక్కలు లిచా, లిమా కిక్ బాక్సింగులో జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొన్నారు… ఇది ఆమె నేపథ్యం… కానీ ఆ ఊరికి రోడ్డు లేదు…
Ads
గుడ్… సంతోషం… ఒక మారుమూల ఊరికి రోడ్డు వేస్తున్నందుకు సంతోషం… లవ్లీనా కారణంగా రోడ్డు వేస్తున్నందుకు మరీ సంతోషం… ఊరి వాళ్ల కష్టాలు తీరుస్తున్నందుకు మరీ మరీ సంతోషం… కానీ ఒక క్రీడాకారిణి సాధించిన పతకానికీ, ఒక ఊరికి రోడ్డు వేయడానికి ఏం సంబంధం..? అదేం ప్రాతిపదిక..? ఒకవేళ లవ్లీనాకు పతకం ఏదీ రాకుండా ఉంటే, రోడ్డు వేయకపోయేవాళ్లే కదా… ఇదెక్కడి సూత్రం… పోనీ, ఇదేమైనా ఆమెకు ప్రోత్సాహకంగా ఇచ్చే వ్యక్తిగత కానుక కూడా కాదు కదా… మరి ఆమె వచ్చేలోపు రోడ్డేస్తాం అని పరుగులు తీస్తున్న అధికారుల్ని చూసి ఏమనాలి..? ఇక్కడ రోడ్డు వేయడం గురించి కాదు, ఒక ఒలింపిక్ పతకానికి లంకె పెట్టడమే నవ్వొచ్చే అంశం… పోనీలెండి పాపం… పతకం తెచ్చినందుకు, రోడ్డును కూడా తెస్తున్నందుకు… లవ్లీనా తన ఊరివాళ్లందరికీ లవ్లీ గాళ్ అయిపోయింది..!!
Share this Article