……. తక్కువ మెజారిటీతోనే చాలా స్థానాలు కోల్పోయాం అని కేటీయార్ బాధపడ్డాడు… కానీ సేమ్, బీజేపీ కూడా అంతే… తక్కువ వోట్లతో తను కూడా బోలెడు స్థానాలు కోల్పోయింది… అది ఓ విఫల సమర్థన… అసలు బీజేపీ అక్కడిదాకా రావడమే మీ ఓటమి… ఇక వంద వోట్లా, రెండొందల వోట్లా అనేది వదిలేయండి…
…… జగన్ ఫ్యాన్స్ వోట్లేయడం వల్లే సెటిలర్స్ ప్రాంతాల్లో నాలుగు సీట్లు ఎక్కువ గెలిచి, టీఆర్ఎస్ మరీ అవమానకరమైన ఓటమి నుంచి తప్పించుకుంది… తెలంగాణ జాగో, ఆంధ్రావాలా బాగో అనే స్ఫూర్తితోనే ఇన్నాళ్లూ రాజకీయం చేసిన అదే టీఆర్ఎస్ పార్టీకి చివరకు ఆ ఆంధ్రులే దిక్కయ్యారు… తెలంగాణ సమాజం ప్రస్తుతం బీజేపీ వైపు నిలబడింది అనే వాదనల్ని కూడా కాసేపు పక్కన పెడదాం…
… (ఇది మరో పత్రిక క్రోడీకరించిన మరో వోట్ల లెక్క… ఏ లెక్కన చూసినా బీజేపీ, టీఆర్ఎస్ నడుమ వోట్ల తేడా స్వల్పమే…)
Ads
…… పైకి పొత్తు లేనట్టు నటిస్తున్నా, ఏం చెప్పుకున్నా మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీల నడుమ మంచి మైత్రి ఉంది, మంచి అవగాహన ఉంది… జాతీయ స్థాయిలోనూ వీళ్లిద్దరి మైత్రి బీజేపీకి చేటు… ప్లస్ జగన్ కూడా తెరవెనుక…! ఈ త్రికోణాన్ని మోడీ ఎలా బ్రేక్ చేయగలనేది చూడాలి కానీ మజ్లిస్ కేవలం 51 సీట్లు మాత్రమే పోటీచేయడం, మిగతా చోట్ల కారుకు మద్దతునివ్వడం… మజ్లిస్ ఏరియాల్లో టీఆర్ఎస్ నామ్కేవాస్తే అభ్యర్థులను నిలబెట్టడం… అంటే బీజేపీ వోట్లను చీల్చడం…! దీనివల్ల టీఆర్ఎస్కు కలిసొచ్చింది కానీ… మజ్లిస్ గనుక సిటీ మొత్తం నిలబడి ఉంటే కారుకు పడ్డ ముస్లిం వోట్లు దూరమై… కేసీయార్ మరింత ఘోరమైన ఓటమిని మూటగట్టుకునేవాడు…
…… సీట్ల సంఖ్యలో టీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ… మూడో స్థానంలో మజ్లిస్… కానీ నిజానికి అసలు గెలుపు బీజేపీది… సీట్ల సంఖ్య జానేదేవ్… వస్తాయి, పోతాయి, ఇప్పుడున్న స్థితిలో మేయర్ పీఠం ఎలాగూ వచ్చేది కాదు… కానీ వోట్లు బాగా పెరిగాయి… ఇదుగో, ఇదే ఈ గ్రేటర్ ఎన్నికల అసలు విశ్లేషణ, అసలు ఫలితం… మజ్లిస్, టీఆర్ఎస్లతో పోలిస్తే మస్తు బలం పెంచుకుంది బీజేపీ… దానికి కావల్సింది కూడా అదే… ఇప్పుడు బలం పెరగాలి, దాన్నింకా విస్తరించుకోవాలి… అదే జరుగుతోంది… పైన ఇచ్చిన ఆంధ్రజ్యోతి వార్తలోని వివరాలు కూడా అవే…
….. బీజేపీ కూడా తెలివిగా ఒక్కరంటే ఒక్క ఆంధ్రా బీజేపీ నేతను ప్రచారానికి దింపలేదు… అమరావతి విషయంలో బీజేపీ మీద కొన్ని సెక్షన్ల సెటిలర్స్ వోటర్లలో నెగెటివిటీ ఉన్నందున, ఏపీ బీజేపీ గనుక ప్రచారానికి వస్తే అది మైనస్ అవుతుందని తెలంగాణ బీజేపీ భయపడింది… ఈ వాదనలో కొంత నిజమున్నా… ఆ వోట్ల సంఖ్య మరీ నిర్ణయాత్మకం ఏమీ కాదు…
….. సింపుల్… టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది… కేసీయార్ పాలన తీరును జనం తిరస్కరిస్తున్నారు… కాంగ్రెస్ నాయకత్వ లేమితో జనానికి దూరమైపోతోంది… ప్రతిపక్షాల్లో తన కోవర్టులను పెట్టుకుని కేసీయార్ ఇన్నాళ్లూ వాటిని క్రమేపీ చంపేస్తూ వచ్చాడు… సమయానికి బీజేపీ అది గమనించి, కొందరికి కత్తెరపెట్టి, దిద్దుబాటుకు పూనుకుని, బండిని తెర మీదకు తెచ్చింది… రఘునందన్, అర్వింద్, బండి, సొయెం వంటి లీడర్లే రేపు బీజేపీని లీడ్ చేయబోతున్నారు… వీళ్లు కేసీయార్‌కు అమ్ముడుబోయే సూచనలు ప్రస్తుతానికయితే లేవు… కాంగ్రెస్ ఖాళీ చేస్తున్న ఆ స్పేసులోకి బీజేపీ పాకిపోయింది… ఇవీ అసలు నిజాలు… రేపు రేవంత్‌రెడ్ది పీసీసీ అధ్యక్షుడు కాబోతున్నాడు… అది కాంగ్రెస్‌లో ఒక దిద్దుబాటు… సో, కాంగ్రెస్ ఎంతోకొంతమేరకు మళ్లీ పుంజుకోవడం ఖాయం… ఎలా చూసినా కేసీయార్ అనుకున్నట్టుగా తెలంగాణ రాజకీయం ఉండబోవడం లేదు అనేది గ్రేటర్ అనంతర చిత్రం…!
Share this Article