ఒక్క స్ట్రోక్… ఒకే ఒక్కటి… సరిగ్గా వర్కవుట్ అయి ఉంటే… బెంగుళూరు అదితి అశోక్ కనీసం కాంస్యం గెలిచి ఉండేది… వర్షం పడి ఉంటే రజతమే గెలిచేదేమో… ఆ పిల్ల చిన్నప్పటి నుంచీ ఎన్నో ఆశల్లో, ఎన్నో కలల్లో పెరిగింది… కానీ కుదర్లేదు…! ఒక్క గోల్… ఒకే ఒక్క గోల్… మన వందన కటారియా లేదా మన రాణి రాంపాల్ గనుక కొట్టి ఉంటే వుమెన్ హాకీ ఈవెంటులో కనీసం కాంస్యం కొట్టేవాళ్లు… కానీ అదృష్టం కరుణించలేదు… అలాగని వాళ్లకు ప్రతిభ లేదా..? అసలు అక్కడిదాకా రావడమే వాళ్ల ప్రతిభ కదా…! అసలు వందన హ్యాట్రిక్ గోల్స్ కొట్టకుండా ఉంటే హాకీలో అక్కడికైనా వచ్చేవాళ్లు కాదు కదా…! సో, ప్రతిభకూ ఫలితానికీ నడుమ ఓ ఫ్యాక్టర్ పనిచేస్తుంది… అది డెస్టినీ… ఈ రెండు ఉదాహరణలే కాదు, బోలెడు… ఆటలైనా, రాజకీయాలైనా, జీవితాలైనా…! ఆఫ్టరాల్ ఒలింపిక్స్ అనే చిన్న విషయానిదేముంది..? పాకిస్థాన్‌కు ఒక్క పతకమూ లేదు… తెల్లారిలేస్తే చాలు, దాన్ని సపోర్ట్ చేసే ఇండియన్ మూర్ఖులకు కడుపు రగిలిపోతూ ఉంటుంది… కనీసం ఇండియా తన పరువు నిలుపుకున్నదీ అని…!!
ఇదే మాట అంటే… కొందరు మిత్రులకు చర్రుమంది, నాన్సెన్స్, ఆటల్లో డెస్టినీ ఏముంది..? దిక్కుమాలిన వాదనలు, ప్రతిభ తప్ప ఇక్కడ ఇంకేమీ పనికిరాదు అని వాదనలకు దిగుతున్నారు… ఫాఫం… బుర్రలు మోకాళ్లను దాటి ఇంకా కిందకు పోవడం అంటే ఇదే… ఇండియా తొలి ఒలింపిక్ అథ్లెటిక్ స్వర్ణం సంపాదించిన పెట్టిన ఇదే నీరజ్ చోప్రా ఉదాహరణే తీసుకుందాం… ఎస్, తను అప్పుడెప్పుడో పోలండ్‌లో అండర్-20 పోటీల్లో వరల్డ్ రికార్డ్ హోల్డర్… కానీ తనను మించిన ఘనులున్నారు… ఇంకాస్త వివరంగా చెప్పాలా..? తను విసిరిన దూరం ఎంత..? 87, 88 మీటర్ల మధ్యలో… నో డౌట్… మంచి దూరమే… కానీ తను ఓసారి 88 దాటించాడు… మరి ఈసారి..? తనను అదృష్టం వరించింది… ఎలాగంటారా..? అసలు 87 మీటర్లు అనేది ఒలింపిక్స్ స్థాయి కాదు… కనీసం 90… అవును, 90 మీటర్లు ఉండాలి…
Ads
2016 రియో ఒలింపిక్స్‌లో గోల్డ్ కొట్టిన థామస్ రోలర్ అనే జర్మనీ క్రీడాకారుడు 90.30 మీటర్లు విసిరాడు… అంటే ఇప్పుడు మన నీరజ్ చోప్రా విసిరిన దానికన్నా దాదాపు రెండు మీటర్లు ఎక్కువ దూరం… అది తక్కువేమీ కాదు… జస్ట్, సెంటీమీటర్ల తేడా పతకాల్ని అటూఇటూ మార్చేసేంత కట్ థ్రోట్ పోటీ అది… అదే రియో ఒలింపిక్స్‌లో 88 మీటర్లు విసిరిన కెన్యా ఆటగాడు యీగో రజతం కొట్టాడు… ఛాంపియన్స్… వాళ్ల రికార్డులు నీరజ్‌కూ తెలుసు… కానీ వాళ్లు కరోనా భయంతో ఈ ఒలింపిక్స్ వైపే రాలేదు… వాళ్ల ఇష్టం వాళ్లది… అంతేకాదు, ఇప్పుడు రజతం కొట్టిన చెక్ ఆటగాడి కెరీర్ బెస్ట్ రికార్డు కూడా 89 మీటర్లు… అదీ రీసెంటుగానే సాధించాడు… మరో సూపర్ ఆటగాడు వెట్టర్… జర్మనీ ప్లేయర్… ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు… వరల్డ్ ఛాంపియన్… తన కెరీర్ బెస్ట కూడా దాదాపు 90 మీటర్లు… కానీ అదృష్టం ఆయన పక్షాన లేదు… ఫామ్‌లో లేడు… వరుసగా ఫౌల్స్ వేసి, అసలు టాప్ 8 నుంచే వైదొలిగాడు అవమానకరంగా…!
దీనిపై నీరజ్ చోప్రా కూడా సంయమనంతో, కొన్ని సత్యాలు చెప్పాడు… ఒలింపిక్స్ బరిలో నిలబడ్డాక నంబర్ వన్, నంబర్ టూ అనేవి పనిచేయవు… ఆ రోజు మనది కావాలి… తొలి రౌండ్ ఒకరు మంచి దూరం విసిరితే, ఇక తరువాత వచ్చే వాళ్లపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది… ఇలా చాలా అంశాలు పనిచేస్తుంటయ్ అని చెప్పుకొచ్చాడు… నిజమే… ఆరోజు మనది కావాలి… అంటే మనకు ఏదో కలిసి రావాలి… ఇప్పుడు చెప్పండి… ప్రతిభ ఒక్కటే సరిపోదు, పిసరంత లక్ తోడుగా నిలవాలి… నీరజ్ చోప్రాకు సహకరించింది అదే… అదే…!! జాగ్రత్తగా గమనిస్తే, మన ప్రతి ఒలింపిక్ విజేత కథలోనూ కనిపించేది అదే… అందుకే… పరాజితుల్ని పరిహసించకండి… వాళ్లు ఒలింపిక్స్ దాకా చేరడమే ఓ ఘనత… అది గుర్తించండి… పతకం వచ్చిందా లేదా జానేదేవ్..!!
Share this Article