…… By……. Jagannadh Goud…… చిత్తూరు వి నాగయ్య – “పాల్ ముని ఆఫ్ ఇండియా”…. తెలుగు సినీ నటులు, దర్శకులు అంతా తల క్రిందికి కాళ్ళు పైకి లేపి, వంద సంవత్సరాలు తపస్సు చేసినా చిత్తూరు నాగయ్య కాలి చెప్పు మందం కూడా పనికి రారు అని చెప్పటం నిజానికి నాగయ్య గారిని అవమానించటమే అవుతుంది… కారణం ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లుగా ఇక్కడ ఉన్నవి అన్నీ ఆముదపు చెట్లే; ఈ ఆముదపు చెట్లని వేప చెట్లు, మర్రిచెట్లు, రావి చెట్లతో పోల్చటం కరక్ట్ కాదు… ఈ ఆముదపు చెట్ల లాంటి వీళ్ళని ఇక్కడే వదిలేసి నాగయ్య గారి విషయానికి వద్దాం… ఉప్పలదడియం నాగయ్య శర్మ (చిత్తూరు వి నాగయ్య) ని తొలితరం నటుడు, తొలి తరం మెగాస్టార్, తొలితరం సూపర్ స్టార్, తొలితరం తలైవా, తొలితరం బాద్ షా, తొలితరం మన్మధుడు అని ఆయా తరాల వాళ్ళు వాళ్ళకి తెలిసినట్లు పిలుస్తారు (నాటక రంగంలో “రంగ భూషణ” బిరుదాంకితుడు కూడా). కానీ ఏ తరానికి అయినా తెలుగు సినీ పరిశ్రమ లేదా దక్షిణ భారతదేశ ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒకే ఒక లెజెండ్ చిత్తూరు నాగయ్య గారు…
- ప్రస్తుతం ఉన్న ముసలి వాళ్ళకి కూడా ఘంటశాల గారు మాత్రమే తెలిసి ఉంటుంది, కానీ ఘంటశాల వెంకటేశ్వర రావు గారికే సంగీతంలో గురువు నాగయ్య గారు… చిత్తూరు నాగయ్య నటుడు మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత, సంగీత కర్త… 336 సినిమాలకి పైగా నటించాడు నాగయ్య… B.N రెడ్డి, H.M రెడ్డి మరియూ కన్నాంబతో కలిసి ఏర్పాటు చేసిన సంస్థ రోహిణి పిక్సర్స్ లిమిటెడ్… రోహిణి పిక్సర్స్ నిర్మించిన మొదటి చిత్రం “గృహ లక్ష్మి” (1938) తో సినీ ప్రస్థానం ఆరంభించాడు నాగయ్య. ఆ సినిమా సూపర్ హిట్. అదే సంవత్సరం చివర్లో లేదా 1939 లో ప్రారంభమైన వాహినీ స్టూడియోస్ ఆల్ టైం హిట్స్ అయిన యోగి వేమన, భక్తపోతన, స్వర్గ సీమ, దేవత, సుమంగళి మరియూ వందేమాతరం సినిమాల్లో కూడా నాగయ్య గారే హీరో… వాహిని ఆ తర్వాత రోజుల్లో చక్రపాణితో కలిసి నాగిరెడ్డి “విజయా ప్రొడక్షన్స్” ప్రారంభించారు…
- దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు నాగయ్య గారే… నిర్మాణ సంస్థ “రేణుకా పిక్చర్స్” ని స్థాపించి సొంతంగా చాలా సినిమాలు నిర్మించాడు నాగయ్య. రేణుకా పిక్చర్స్ నిర్మించిన తొలి సినిమా “భాగ్యలక్ష్మి”. హైదరాబాద్ నిజాం నవాబ్ “రామదాసు” సినిమాని నిర్మిస్తాననీ, నాగయ్య గారిని దర్శకత్వం వహించవలచినదిగా, నటించవలసినదిగా విన్నవించుకున్నాడు. ఆ తర్వాత అన్నీ కుదిరాక నిజాం నవాబే నిర్మించలేకపోయిన ఆ రామదాసు సినిమాని నాగయ్య గారే ప్రొడ్యూస్ చేశారు… రామదాసు చిత్రానికి ఉత్తమ దర్శకుడి గా నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా నాగయ్య గారికి వచ్చింది…
Ads
- మైసూరు మహారాజు స్వయంగా నాగయ్య గారిని పిలిపించుకొని మీలాంటి ఉన్నతులు కూర్చోవాల్సిన కుర్చీ అని తన సింహాసనం మీద నాగయ్య గారిని ఒకరోజు కూర్చోపెట్టారు… ఆ తర్వాత స్వర్ణ కంకణం, స్వర్ణ కిరీటంతో సత్కరించాడు. మైసూరు మహారాజే కాదు, చాలామంది రాజులు జీవితంలో ఒక్క నిమిషం అయినా నాగయ్య గారితో సమయం గడపాలని కుతూహలపడేవారు. ఇండియాలో మొదటి స్టూడియో నిర్మించిన నటుడు కూడా నాగయ్య గారే… ఎకరం పొలం పది రూపాయలు, వంద రూపాయలు ఉన్నప్పుడే నాగయ్య గారి రెమ్యూనరేషన్ లక్ష రూపాయలు. మొదట లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడూ నాగయ్య గారే. నాగేశ్వరావు, NTR లాంటి వాళ్ళు తమ 153 వ సినిమాకి అంత తీసుకున్నారు అట.
- హాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్ అంటే లియోనార్డ్ డీకాప్రియో, జానీ డెప్, టాం హ్యాంక్స్ అంటారు. అంతకంటే ముందు రాబర్ట్ డీనీరో, ఆల్ పసీనో, మోర్గన్ ఫ్రీ మన్ అంటారు. అంతకంటే ముందు జనరేషన్ లో క్లైంట్ ఈస్ట్ వుడ్, ఓలీవర్ టాప్ యాక్టర్స్. అంతకంటే ముందు పాల్ ముని ఉండేవాడు (చికాగో బేస్ డ్). స్కేర్ ఫేస్, ద స్టోరీ ఆఫ్ లూయిస్ పాశ్చర్ లాంటి అనేక అత్యున్నతమైన చిత్రాల్లో నటించాడు పాల్ ముని. ఆ రోజుల్లోని ఇండియన్ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియూ ఎడిటర్ ఆఫ్ ఫిల్మ్ ఇండియా బాబూరావు పటెల్ నాగయ్య గారిని “పాల్ ముని ఆఫ్ ఇండియా” గా వర్ణించాడు.
- ఇంకా నాగయ్య గారు రాజాజీని కలిశాడు, గాంధీజీని కలిశాడు, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నాడు. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారు కూడా నాగయ్య గారి వ్యక్తిత్వాన్ని, నటనని, నాగయ్య సేవా నిరతిని ఎంతగానో కొనియాడేవారు. మన రవీంద్ర భారతిలాగా చెన్న పట్నం (ప్రస్తుత చెన్నై)లో ఆ రోజుల్లోనే కొన్ని లక్షలు పెట్టి త్యాగరాజ నిలయం కట్టించారు కానీ తన పేరు పెట్టుకోలేదు నాగయ్య. తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు, దక్షిణ భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, భారతీయ చలన చిత్ర పరిశ్రమ అనే కాదు… ప్రపంచ సినీ వినీలాకాశం లో నాగయ్య గారు సాధించిన ఘనతలు ఎవ్వరూ సాధించలేదు. అసలు నాగయ్య లాంటి అందగాడు, ముఖ వర్చస్సు ఉన్న నటుడు ఎవరు..? తను దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు.., ఆ వాయిస్ నాకు తెలిసీ ఎవ్వరికీ లేదు. నాగయ్య గారు “ద వన్ యండ్ ఒన్లీ లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా”…
Share this Article