సరదా ముచ్చటే ఇది…. అనుకోకుండా సాయిపల్లవి వీడియో ఒకటి కనిపించింది… జుత్తుకు ముడిచిన మల్లెపూలు, బొట్టు, మెడ నిండుగా పైట… వెనుక దేవుళ్ల పటాలు, ప్రతిమలు, దీపాలు… అది సినిమా బాపతు వీడియో కాదు, సత్యసాయి వాళ్లు ప్రచార సంస్థ రేడియో సాయి 20వ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు మంచి మాటలు, భక్తి మాటలు చెప్పింది… యూట్యూబ్‌లో నిన్నే అప్‌లోడ్ చేశారు, ఈ స్టోరీ రాసే సమయానికి 24 వేల వ్యూస్ మాత్రమే…. నవ్వొచ్చింది… అంతటి సాయిపల్లవి వీడియోకు జస్ట్, 24 వేల వ్యూస్… మొన్ననే ఎవరో కుర్రహీరో ఏవేవో పాగల్ మాటలు మాట్లాడితే లక్షల్లో వ్యూస్… ఏవేవో పిచ్చి వీడియోలకూ లక్షల వ్యూస్ వస్తున్న రోజులివి… అంతెందుకు, ఇదే సాయిపల్లవి పాట సారంగదరియా 30 కోట్ల వ్యూస్ దాటింది… అదీ పూర్తి పాట కాదు… లిరికల్ సాంగ్ మాత్రమే… ఇక రౌడీ బేబీ పాట 120 కోట్లను ఎప్పుడో దాటేసిందిగా… అలాగే ఫిదా పాట… సో, సాయిపల్లవి స్టెప్పులేస్తేనే లక్షల లైక్స్, కోట్ల వ్యూస్… ఐనా ఓ సినిమాతార వీడియో అంటేనే ప్రేక్షకుడు ఏదో మసాలా ముచ్చట కోరుకుంటాడేమో కదా… ఇంతకీ ఈ వీడియోలో ఏముంది..? (అది ధార్మిక సంస్థ కాబట్టి సరిపోయింది, సగటు యూట్యూబ్ చానెల్ వాళ్లయితే ‘సత్యసాయిని సాయిపల్లవి అంత మాటనేసిందా..?’ అని థంబ్ నెయిల్స్ పెట్టి కొడితే లక్షల్లో వచ్చేవేమో వ్యూస్… హహహ)
తను సాయి భక్తురాలు, తల్లి కూడా… అందుకే సాయి పల్లవి అని పేరు పెట్టుకుంది బిడ్డకు… అదే చెబుతోంది ఆమె… ‘‘ఎప్పుడు పుట్టపర్తికి వచ్చినా ఏదో ఎనర్జీ… నా టెన్త్ గ్రేడ్ నుంచే రేడియో సాయి వింటున్నాను, అప్పట్లో పొద్దున అయిదు గంటలకే లేచేదాన్ని… అప్పటికే అమ్మ ఇది ఆన్ చేసేది… తరువాత మెడిసిన్ చేయడానికి జార్జియా వెళ్లాను కదా, హోం సిక్ ఉండేది… అప్పుడు సాయి గీతాలు, ఈ రేడియో సాయి ఒక ధైర్యాన్ని ఇచ్చేవి… ఇప్పటికీ నాకు ఎప్పుడైనా కాస్త డౌన్ అయినట్టు అనిపిస్తే ఈ గీతాలు వింటుంటే స్వామి నాతో ఉన్నట్టు ఓ భరోసా’’ అని చెబుతోంది ఆ వీడియోలో… ఇండస్ట్రీలో ఆస్తికులు, ఆధ్యాత్మికం మీద ఇంట్రస్టు ఉన్నవాళ్లు బోలెడు మంది… కాదు, కాదు… ఎక్కువ మంది వాళ్లే… సాయిపల్లవి స్వతహాగా సాయి భక్తురాలు కాబట్టి ఈ చిన్న వీడియోకు సహకరించింది… అయితే… ఎందుకోగానీ సాయిపల్లవి వీడియో చూశాక నిత్యామేనన్ గుర్తొచ్చింది…
Ads
నిత్యామేనన్… నాలుగేళ్ల క్రితం కావచ్చు బహుశా… ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం… అది చూస్తుంటే మనకు తెలియని ఓ నిత్య కనిపిస్తుంది… ఆమె ఆలోచనలు, అడుగులు ఓ సగటు సినిమా తార తరహాలో అస్సలు ఉండవు… చాలా లోతు మనిషి… బాగా ఆధ్యాత్మికంతో కనెక్టయిపోయింది… ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పలుసార్లు ఆర్కేకు తరువాత ఏం ప్రశ్నలడగాలో తెలియలేదు ఆశ్చర్యంతో… దిగువన ఆ యూట్యూబ్ లింక్ ఉంది… ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు చూడొచ్చు… వెరీ ఇంట్రస్టింగ్ పర్సనాలిటీ… ఇటు సాయిపల్లవి గానీ, అటు నిత్య మేనన్ గానీ ఇండస్ట్రీలో నిజంగానే కాస్త డిఫరెంట్… సాయిపల్లవి ఆలోచనల్లో పదును, డెప్త్ మనకు తెలియవు కానీ… ఎంచుకునే పాత్రలు, నటనలో మెరిట్, తెలుగులో ఫ్లూయెన్సీ, సొంత డబ్బింగ్ గట్రా చూస్తే ఇద్దరికీ పోలిక కనిపిస్తుంది… వివాదాల్లోకి కూడా వెళ్లరు… చెప్పనేలేదు కదా… ఆ నిత్యామేనన్ ఓపెన్ హార్ట్ ఎపిసోడ్‌కూ నాలుగు లక్షల చిల్లర వ్యూస్ మాత్రమే… అదీ నాలుగేళ్లయినా…!!
Share this Article