మంచిర్యాల జిల్లాలో, పెళ్లికూతురు సాయిశ్రియ పెళ్లి బరాత్‌లో చేసిన బుల్లెట్ బండి డాన్స్ నిన్న ఎంత వైరల్ అయ్యిందో చూశాం కదా… యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది నిన్నంతా… సోషల్ మీడియా మొత్తం సాహో అనేసింది… ఆ వీడియోకు ఎన్ని లైకులో, ఎన్ని షేరులో లెక్కేలేదు… సరే, బాగుంది… కానీ అది ఒక పెళ్లికూతురు వెర్షన్… తన కుటుంబం గురించి చెప్పుకుంది.., పోదాం పదవోయ్, నీ చేయి పట్టుకుని, నీ బండెక్కి వస్తా, దునియాను చూద్దాం పద అంటున్నది… మరి ఇదే పాట పెళ్లికొడుకు వెర్షన్ అయితే ఎలా ఉంటుంది..? సేమ్, అదే టెంపోలో సాగాలి, అదే ట్యూన్లో ఇమడాలి, అంతే ప్రేమ దట్టించాలి… జర్నలిస్టు సుంకరి ప్రవీణ్ కుమార్ రాసేశాడు… ఇక ఎవరైనా పూనుకుని, ఓ వీడియో తీసి వదలడమే ఆలస్యం… అంతే… ఇదుగో ఆ పాట….
హే తెల్ల లుంగీ కట్టుకున్నా..
కట్టుకున్నుల్లో.. కట్టుకున్నా
ఎర్ర అంగీ ఏసుకున్నా..
ఏసుకున్నుల్లో.. ఏసుకున్నా..
నేను కిర్రు చెప్పులు తొడుక్కున్నా..
తొడుక్కున్నుల్లో.. తొడుక్కున్నా..
చేతికి గడియారం పెట్టుకున్న…
పెట్టుకున్నుల్లో… పెట్టుకున్న..
నా మీసాలు కోరగ దువ్వుకున్నా..
దువ్వుకున్నుల్లో.. దువ్వుకున్న..
హీరోలెక్క తయ్యారయ్యి…
నేను బండెక్కి వస్తానులే…
నిన్ను మనువాడుకుంటానులే…
నీతో ఏడడుగులేస్తానులే..
నువ్వు నచ్చి నా గుండె గిచ్చినదాన..
రావే పోదాం… రంగేలి జాన…
నా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తనే…
డుగ్గుడుగ్గుడుగ్గు… డుగ్గుడుగ్గని…
అందాల దునియాను సూపిత్తలే…
చిక్కుచిక్కుచిక్కు… చిక్కుబుక్కని…
Ads
**********
చెరువు కట్టలాంటి వన్నె నడుము దానా…
నడుము దానా పిల్ల… నడుము దానా..
నీ నడుముకు నెలవంక వడ్డానమే…
పెట్టిస్తాలే.. నేను పెట్టిస్తాలే..
పల్లెటూరసొంటి పిల్లదానా…
పిల్లదానా… కన్నె పిల్లదానా..
పిల్లగాలి నీ మెడలోన… హారమేయ్ నా…
హారమెయ్ నా… పిల్ల హారమెయ్ నా..
నువ్వు నను గెలుచుకున్నావు లే…
నిన్ను ముడి వేసుకుంటానులే…
మనము జంటగా పోదాము లే…
జడగంటలై ఉందాములే..
జగతిలోనా మనము.. జన్మజన్మలకు..
ఈడుజోడయ్యి… జతకూడి ఉందాము..
నా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తనే…
డుగ్గుడుగ్గుడుగ్గు… డుగ్గుడుగ్గని…
అందాల దునియాను సూపిత్తలే…
చిక్కుచిక్కుచిక్కు… చిక్కుబుక్కని…
************
మా అవ్వ కొంగుచాటు పిలగాడినే…
పిలగాడినే.. నేను పిలగాడినే…
నీ పైట కొంగు చాటు.. కుర్రాడినే…
కుర్రాడినే… నేను మొనగాడినే..
మా అయ్య మీసం మీద పొగరునమ్మో..
పొగరునమ్మో.. కోడె వగరునమ్మో…
మూడు తరాలల్ల మొనగాడినమ్మో..
వాడినమ్మో… మగవాడినమ్మో…
మా అక్కాచెల్లెళ్లకు గుండెనమ్మో..
గుండెనమ్మో… నేను అండనమ్మో…
ఎర్రటెండల్లో నడిచినోన్ని…
ఎన్నో కష్టాలు చూశినోన్ని..
భారమే బాధ పెడత ఉన్నా…
బండరాయల్లె మోశినోన్ని..
గుండెల్లో పెట్టి చూసుకుంటా నిన్ను..
కండ్లల్ల పెట్టి కాసుకుంట నిన్ను…
నా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తనే…
డుగ్గుడుగ్గుడుగ్గు… డుగ్గుడుగ్గని…
అందాల దునియాను సూపిత్తలే…
చిక్కుచిక్కుచిక్కు… చిక్కుబుక్కని…
***********
నీ కుడికాలు నా ఇంట్ల పెట్టినంక..
పెట్టినంక పిల్ల.. పెట్టినంక..
నీ అడుగుల సప్పుడే.. ఆస్తులమ్మో…
ఆస్తులమ్మో.. నాకు ఆస్తులమ్మో..
నిను గన్నోల్లకూ రుణముంటనమ్మో…
ఉంటనమ్మో.. రుణముంటనమ్మో…
నీకెన్నడు కష్టము రానీయ్యనే..
రానియ్యనే పిల్ల.. రానియ్యనే..
నా ఇంటి సుక్కపొద్దువే…
నిన్ను సక్కంగ జూసుకుంట..
నా బతుకెలుగు సుక్కవోలే…
నిన్ను కడదాక కాచి ఉంటా..
నా కన్నతల్లోలె నిను చూసుకుంటా..
నీ చంటిపిల్లోడినై నేను ఉంటా…
నా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తనే…
డుగ్గుడుగ్గుడుగ్గు… డుగ్గుడుగ్గని…
అందాల దునియాను సూపిత్తలే…
చిక్కుచిక్కుచిక్కు… చిక్కుబుక్కని…
– ప్రవీణ్ కుమార్ సుంకరి…. ఫోన్ 9701557412
Share this Article