పూజా హెగ్డే… ప్రపంచంలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత ఆమెది… అందరూ ఏవేవో చూపించి పడేస్తారు… కానీ పూజా జస్ట్, అలా కాళ్లు చూపించి పడేస్తుంది… అంతే… అంతటి సిరివెన్నెల కలం కూడా గతులు దప్పి, శృతులు దప్పి, స్వరజతులు తప్పి… ఇంకా ఏమేమో తప్పి… సామజవరగమనా అని పాట అందుకుంది..! నీకాళ్లను పట్టుకుని వదలనన్నవే చూడే నా కళ్లు అని కూడా మొహమాటం లేకుండా మొత్తుకున్నాడు… అంతటి బన్నీ కూడా అడ్డంగా పడుకుని, వెనక్కి వెనక్కి దేకుతూ, ఆ కాళ్లు గట్రా చూస్తూ రివర్స్ స్టెప్పులు వేశాడు… మరి ఆ కాళ్లా మజాకా..? అప్పుడెప్పుడో 2012లో ఎంట్రీ ఇస్తే, తరువాత రెండేళ్లు, ఆ తరువాత మరో రెండేళ్లు పాపం ఆమెను దేకినవాళ్లు లేరు… అదే బన్నీతో దువ్వాడ జగన్నాథం… హిట్… అల వైకుంఠపురంలో సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయింది… ప్రస్తుతం ఆమె చేతిలో ప్రిస్టేజియస్ ప్రాజెక్టులు ఉన్నయ్… మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిపోయింది, ప్రభాస్‌తో రాధేశ్యాం సినిమా, అదీ హిందీ ప్లస్ తెలుగులో… ఆచార్య, సర్కస్, బీస్ట్, భాయిజాన్… అసలే ఫిలిమ్ ఇండస్ట్రీలో ఏమీ లేకపోయినా ఎచ్చులు కొట్టాలి…
మరి ఇంత నడమంత్రపు సిరి, పాపులారిటీ వచ్చాక కాస్త ‘అతి’ సహజమే కదా… ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నాడు, రోజా భర్త సెల్వమణికి ఆమాత్రం తెలియదా..? ఏమమ్మో, ఇంతకుముందు లింగూలిటుకూ అంటూ ఒక అసిస్టెంట్ ఉండేవాడు నీకు… ఇప్పుడు 12 మంది అసిస్టెంట్‌లా నీకు..? నాన్సెన్స్, షూటింగ్ స్పాట్‌కు వస్తే ఆ ఖర్చంతా ఎవరు భరించాలి..? నిర్మాతకు భారం కాదా..? మరీ ఇంత ఓవర్ ప్రొజెక్షన్ పనికిరాదు సుమీ అని ఈమధ్య ఆడిపోసుకున్నాడు… ఇక్కడ ఒకటీరెండు అంశాలు చెప్పుకోవాలి… అసలు ఫిలిమ్ ఇండస్ట్రీ అంటేనే తాలిబనిజం… మహిళలపై సంపూర్ణ వివక్ష… అన్నిరకాల దోపిడీ… అవును సెల్వమణీ భాయ్… కొన్ని పాయింట్లు సరదాగా చెప్పుకుందాం, సరేనా..?
Ads
- 1) ఒక హీరోను పట్టుకుని నువ్వు ఈ మాట అనగలవా..? కనీసం క్యారవాన్‌లోకి వెళ్లి సర్, షాట్ రెడీ అని చెప్పడానికే ఉచ్చ పోసుకుంటారు కదా… హీరోల రెమ్యునరేషన్లు, ఖర్చులు ఎవరు భరిస్తున్నారు, నిర్మాత కాదా..?
- 2) పూజా హెగ్డేకు డిమాండ్ ఉంది కాబట్టి హీరోయిన్గా పెట్టుకోవడానికి తాపత్రయపడుతున్నారు, లేకపోతే ఆమెను కనీసం ఓ నటిగా గుర్తించేదా ఇండస్ట్రీ… 2012 నుంచి ఓసారి ఆమెకు దక్కిన చాన్సులేమిటో చెప్పు..?
- 3) అసలు నీ చేతిలో సినిమాలు ఏమున్నయ్..? పూజా హెగ్డేతో నీకేం సంబంధం…? ఆమె ఖర్చు ఆమెతో సినిమాలు తీసే నిర్మాతల హెడేక్, నడుమ నీకొచ్చిన నొప్పి ఏమిటి..?
- 4) అగ్రిమెంట్లోనే రాయించుకోలేకపోయారా..? ఒక్క అసిస్టెంటుకు మాత్రమే విమానం ఖర్చులు, స్టార్ హోటల్ ఖర్చులు ఇస్తాం అని… ఆమెకు ఇష్టం ఉంటే సైన్ చేసేది లేకపోతే వదిలేసేది…
- 5) ఆమె కాళ్లు కావాలి (కాళ్లు అంటే కాళ్లు అని మాత్రమే కాదు అర్థం…)… ఆమె పాపులారిటీ కావాలి… ఓ నలుగురు అసిస్టెంట్లను నాలుగు రోజులు మాత్రం భరించలేరా..?!
Share this Article