….. గతంలో చాలాసార్లు జరిగిందే… జనమేమో మోనాల్ గుజ్జర్‌కు తక్కువ వోట్లు వేస్తారు… అంటే ఇక ఫోవమ్మా తల్లీ అన్నమాట… కానీ బిగ్‌బాస్ ఆమెను సేవ్ చేస్తాడు… ఎలాగంటే..? ఎవరికెన్ని వోట్లు వచ్చాయో తనెవరికీ చెప్పాల్సిన పనిలేదు కదా… తను ఇష్టమున్నవాళ్లను పంపించేస్తాడు, లేదా ఉంచేస్తాడు… ఆ వోట్ల లెక్కింపుకి ఏ థర్డ్ పార్టీ ఉండదు కదా…
మోనాల్ తను ఇచ్చిన స్క్రిప్టు మేరకు నటించగలదు… లవ్ ట్రాకులు నడిపించగలదు… తన పాత్రలో తను జీవిస్తుంది… అభిజిత్ వంటి బుర్ర ఉన్న కంటెస్టెంట్లు కూడా ఆమె నటనను పసిగట్టలేరు… అందుకని ఆమె హౌస్‌లో అలాగే ఉంటుంది… అలా ఉంచుతారు… అటూఇటూ బ్రేకప్పులు, రీలవ్వులు సాగుతూనే ఉంటయ్… ఆటలో కాస్త మసాలా కోసం… కొంత గ్లామర్, కొంత రొమాన్స్, కొంత లవ్ ఫ్లేవర్ కోసం… ఇంకా రెండువారాలపైనే ఉంది… అప్పుడే ఆమెను అలా ఎలా వదులుతారు..?
అందుకని గతంలో ఆమె కోసం చాలామందిని బలి పెట్టినట్టే ఈసారి కూడా ఓ బలిపశువు కావాలి కదా… అవినాష్ దొరికాడు ఈసారి… లేటుగా ఎంట్రీ ఇచ్చినా సరే, వచ్చిన మొదట్లో మంచి ఎంటర్టెయినర్ అనిపించుకున్నా… తరువాత వేగంగా చెడగొట్టుకున్నాడు… ఊరికే ఇరిటేట్ కావడం, కేకలు వేయడం, తొండి ఆట ఆడటం వంటివి తనను బ్యాడ్ చేశాయి… అందుకని అవినాష్ పాపులారిటీ పోగొట్టుకున్నాడు… మొన్నటివారం తనకు ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి ఎలిమినేట్ కాకుండా రక్షించుకున్నాడు… లేకపోతే పోయినవారమే బయటికి వెళ్లిపోవాల్సినవాడు…
Ads
ఈసారి కూడా మోనాల్ తరువాత తక్కువ వోట్లు వచ్చినవి తనకే… మోనాల్‌ను సేవ్ చేయాలంటే ఇక బలి తీసుకోవాల్సింది తననే కదా… అందుకని కసుక్కున వేటు వేసేశాడు బిగ్‌బాస్… అదీ కథ… ఎలాగూ ఫస్ట్ ఫైనలిస్టు అఖిల్… ఎలాగూ అభిజిత్, సొహెయిల్ టాప్ ఫైవ్‌లో ఉంటారు… మిగతా ఇద్దరు ఎవరు..? మోనాల్, అరియానా, హారిక… వచ్చేవారం ఎవరికి ఉద్వాసన..? బహుశా హారిక కావచ్చు…!! ఏమో చెప్పలేం… మోనాల్‌నే అనూహ్యంగా పంపించేయవచ్చు కూడా…!!
.
(ప్రాథమిక సమాచారం మోనాల్‌ను ఎలిమినేట్ చేసినట్టుగా వచ్చింది… కానీ లేటెస్ట్ అప్డేట్ అవినాష్ ఎలిమినేషనే… గమనించగలరు…)
Share this Article