Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పారిపోతూనే అమెరికా డర్టీ గేమ్… అగాధంలో అప్ఘన్ సైనికులు…

August 23, 2021 by M S R

……… By…….. పార్ధసారధి పోట్లూరి……  

  • డొనాల్డ్ ట్రంఫ్ ఏమంటున్నాడు…: అమెరికా చరిత్రలోనే ఆతి పెద్ద తప్పిదం… హఠాత్తుగా 3 rd క్లాస్ ప్లాన్ ని అమలుచేశాడు జో బీజింగ్…
  • నేను సరయిన నిర్ణయమే తీసుకున్నాను .. జో బీజింగ్ ! (జో బైడెన్)…
  • ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ లోని పరిస్థితికి జో బీజింగ్ తీసుకున్న చెత్త నిర్ణయమే ప్రధానం కారణం… వాస్తవాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.
  • జో బీజింగ్ ఏం అంటున్నాడు…? 2020 లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ తీసుకున్న నిర్ణయాన్నే నేను అమలు చేశాను అంటున్నాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుండి సైన్యం ఉపసంహరణ అనేది ఒబామా హాయంలోనే నిర్ణయం తీసుకున్నాడు. కానీ దానిని అమలు చేయలేదు. ట్రంఫ్ అధికారంలోకి రాగానే తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని నిర్ణయం తీసుకొని, దాని అమలు కోసమే తాలిబన్లతో చర్చలు జరిపాడు. అమెరికన్ సైన్యం సురక్షితంగా వెనక్కి రావాలంటే ఆయుధాలు అన్నీ ముందే తరలిస్తారు కాబట్టి ఒకవేళ తాలిబన్లు అదును చూసుకొని దాడి చేయకుండా ఉండడానికి మాత్రమే ట్రంఫ్ వాళ్ళతో చర్చలు జరిపాడు.
  • ట్రంఫ్ నిర్ణయంలో ప్రధాన అంశం: అమెరికా నిర్మించిన అన్నీ ఎయిర్ బేస్ లని బాంబులతో పేల్చి వేసిన తరువాత కేవలం కాబూల్ ఎయిర్ పోర్ట్ ని మాత్రమే వాడుకోవాలి చివరగా…
  • జో బీజింగ్ చేసింది ఏమిటి ?…. ఎయిర్ బేస్ లని అలానే ఉంచి దళాలని తరలించే ప్రక్రియ మొదలు పెట్టాడు. ఇది అతి పెద్ద తప్పు.
  • జో బీజింగ్ అతని సహాయకులు చేసిన కుట్ర పూరిత మోసం: జులై 2 వ తేదీ అర్ధరాత్రి – బంగ్రాం ఎయిర్ బేస్ – ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా నిర్మించిన అతి పెద్ద ఎయిర్ బేస్ అది. అదే ఎయిర్ బేస్ ని ఆనుకొని పెద్ద జైలు కట్టారు. ఆ జైలులో దాదాపుగా 5000 మంది తాలిబన్, అల్ ఖైదా, TTP ఉగ్రవాదులు ఉన్నారు.

afghan

  • 1. జులై 2 వ తేదీ అర్ధరాత్రి అమెరికన్ దళాలు బగ్రాం ఎయిర్ బేస్ ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ ఎయిర్ బేస్ కి కాపలాగా ఆఫ్ఘన్ సైనికులతో పాటు అమెరికన్ సైనికులు కూడా కాపలాగా ఉండేవారు… కానీ హఠాత్తుగా అమెరికన్ సైనికులు కాపలా నుండి వెనక్కి వెళ్ళి పోయి, ఎయిర్ బేస్ నుండి వెళ్లిపోతున్న తమ సహచరులతో కలిసి కాబూల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిపోయారు… తమతో కాపలాగా ఉన్న అమెరికన్ సైనికులు తిరిగి వస్తారని ఎదురు చూసిన ఆఫ్ఘన్ సైనికులు ఉదయం 8 గంటలకి తమ ప్రధాన కార్యాలయానికి విషయం తెలియచేసారు.
  • 2. ఆఫ్ఘనిస్థాన్ సైనిక కార్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అమెరికన్ కమాండర్. తీరా అక్కడ కాపలాగా ఉన్న కొద్ది మంది సైనికులు లోపల ఎయిర్ బేస్ లో ఏవో శబ్దాలు వినిపించడంతో లోపలికి వెళ్ళి చూడగా అక్కడ వందల సంఖ్యలో తాలిబన్లు దొరికినవి దొరికినట్లు లూటీలు చేస్తూ కనపడ్డారు… దాంతో తమ సంఖ్య తక్కువగా ఉందండంతో కాబూల్ కి పారిపోయి ప్రధాన కార్యాలయంలో విషయం రిపోర్ట్ చేశారు.
  • 3. ఉన్న కొద్దిమంది ఆఫ్ఘన్ సైనికులు కూడా వెళ్ళిపోవడంతో తాలిబన్లు మధ్యాహ్నం 2 కల్లా ఎయిర్ బేస్ లో ఉన్న ఆయుధాలు, ట్రక్కులు, ఆయిల్ టాంకర్స్ తో సహా వెళ్లిపోయారు.
  • 4. అమెరికన్ సైన్యం వదిలి వెళ్ళిన ఆయుద్ధాలలో M-16 A, M-16A2 , M-4 అసాల్ట్ రీఫిల్స్ ఉన్నాయి. వీటితో పాటు బులెట్స్ ఉన్న మాగజైన్స్ కూడా వదిలివెళ్లారు… తాలిబన్ల దగ్గర అప్పటివరకు ఉన్నవి AK-47 లు మాత్రమే…
  • 5. ఇక హామ్వీ ట్రక్కులు అయితే దాదాపుగా 250 దాకా ఉన్నాయి… కానీ వాటి తాళాలు మాత్రం తీసుకెళ్లారు అమెరికన్ సైనికులు, కానీ తాళాలు లేకపోయినా తాలిబన్లు వాటి ఇంజిన్లు ఆన్ చేసుకొని మరీ ఎత్తుకెళ్లారు.
  • 6. మీడియం,హెవీ ట్రక్కులు కూడా దాదాపుగా 300 దాకా ఉన్నాయి. ఇవి ప్రధానంగా రహదారులు లేని ప్రాంతాలలో ఆయుధాలు, ఆహారం సరఫరా కోసం ఉపయోగపడతాయి. వీటిని కూడా తీసుకెళ్ళిపోయారు తాలిబన్లు. ఇక ఆర్మర్ద్ వెహికల్స్ అయితే లెక్కే లేదు. ఆర్టీలరీ సిస్టమ్స్ ని కూడా తీసుకెళ్లారు. పాత ఆర్మార్డ్ పర్సనల్ కారీ వెహికల్స్ [M113 APC] లని కూడా తీసుకెళ్లారు.

afghan

  • 7. 17 టన్నుల బరువు ఉండే M117 ఆర్మర్డ్ [పైన హెవీ మెషీన్ గన్స్ ఉంటాయి వీటికి ] కార్ లని కూడా తీసుకెళ్లారు. MARK-9 ఆటోమాటిక్ గ్రనేడ్ లాంచర్స్ [ఇవి చాలా ప్రమాదకరం ]ని కూడా తీసుకెళ్లారు తాలిబన్లు.
  • 8. 270 FORD light Trucks, 141 Navistar International 7000 Medium Trucks, 329 Corgo Bed Configured M1152 HUMVEE Trucks, 21 OSHKOSH ATV MINE RESISTANT ARMOR PROTECTED VEHICLES,
  • 9. ఇవన్నీ తీసుకెళ్లిన తరువాత తీరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకి ఆఫ్ఘన్ సైనికులు బగ్రాం ఎయిర్ బేస్ కి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు అంటే 12 గంటలపాటు తాలిబన్ల లూటీ యధేచ్చగా సాగింది అన్నమాట.
  • 10. ఇవి కాక జులై 9 నుండి మెల్లగా ఒక్కో ప్రావిన్స్ ని స్వాధీనం చేసుకుంటూ వచ్చిన తాలిబన్లు అక్కడ ఆఫ్ఘన్ సైనికులు వదిలేసి పారిపోయిన ట్రక్కులని కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు.
  • 11, కమ్యూనికేషన్: గత 20 ఏళ్లుగా తాము ఆఫ్ఘన్ సైనికులకి శిక్షణ ఇచ్చాము అని చెప్పుకుంటున్న ఆమెరికన్స్ మరి దూరప్రాంతాలతో అనుసంధానం చేసే కమ్యూనికేషన్ పరికరాలని మాత్రం తమతో తీసుకెళ్ళి పోయారు ముందుగానే. అప్పటి వరకు కొండలు, లోయలు ఉండే ప్రాంతాల దగ్గర ఆహారం, ఆయుధాలు, మంచి నీరు అవసరం అయితే హెలికాప్టర్లతోనో లేదా ట్రాన్స్పోర్ట్ విమానాలతోనో పారాచూట్ సహాయంతో జారవిడిచేవారు. మరి సుదూర ప్రాంతాలలో ఉన్న సైనికులకి తమ హెడ్ క్వార్టర్స్ తో ఎలా మాట్లాడాలో తెలియక, దిక్కుతోచక ఉన్న పరిస్థితుల్లో తాలిబన్లు దాడులు చేయడం వలన ప్రతిఘటించలేక పారిపోయారు…
  • 12. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది..? జో బీజింగ్ ఆదేశాలతో ముందుగానె ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లు అనిపించట్లేదా..? అమెరికన్ కమాండర్ [ఆఫ్ఘన్ ] మాత్రం మేము ముందుగానే సమాచారం ఇచ్చాము ఎయిర్ బేస్ ని ఖాళీ చేస్తున్నట్లు అని అంటున్నాడు, కానీ ఆఫ్ఘన్ సైనికులు మాత్రం మాకు అసలు సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారు అంటున్నారు… అర్ధరాత్రి ఎక్కడికో పెట్రోలింగ్ కోసం వెళుతున్నారేమో అనుకున్నాం, కానీ అసలు మొత్తానికే వెళ్లిపోతున్నట్లు మాకు చెప్పలేదు అని ఆఫ్ఘన్ సైనికులు అంటున్నారు. చివరికి ఉదయం 7 గంటలకి ఖాళీగా కనపడేసరికి వైర్లెస్ లో కాబూల్ కి సమాచారం ఇవ్వాలన్నా మా దగ్గర ఎలాంటి కమ్యూనికేషన్ సౌకర్యం లేదు అని వాపోయారు…

afghan

Ads

  • 13. అమెరికా బాగ్రాం ఎయిర్ బేస్ లో 30 MW సామర్ధ్యం గల పవర్ ప్లాంట్ ని కట్టింది… దాంతోనే ఇన్నాళ్ళూ ఎయిర్ బేస్ కి విద్యుత్ సరఫరా జరిగేది… కానీ వెళుతూ వెళుతూ ఆ పవర్ ప్లాంట్ ని కూడా షట్ డౌన్ చేసి మరీ వెళ్లారు.. అమెరికన్ సైనికులతో పాటు పహరా కాస్తున్న ఆఫ్ఘన్ సైనికుల దగ్గర వైర్లెస్ సెట్లు లేవు. వాళ్ళు ఏదన్నా సమాచారం ఇవ్వాలంటే ఇన్నాళ్ళూ అమెరికన్స్ మీదే ఆధారపడ్డారు, అలాంటప్పుడు ఉదయం 7 కి కాబూల్ కి సమాచారం ఎలా ఇవ్వగలుగుతారు ? జులై 9 న తాలిబన్లు అదే బగ్రాం ఎయిర్ బేస్ లో ఉన్న జైలు నుండి విడతల వారీగా తాలిబన్లని విడుదల చేస్తూ వచ్చారు. వీళ్లలో 100 TTP ఉగ్రవాదులు కూడా ఉన్నారు.
  • జో బీజింగ్ అతని సహాయకులు కలిసి ఆడిన నాటకం ఇది. అంత తొందరగా తాలిబన్లు ఎలా కాబూల్ దాకా రాగలిగారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న మీడియా కానీ వెస్ట్రన్ దేశాలు కానీ నెపం ఆఫ్ఘన్ సైనికుల మీద నెట్టేశారు. ప్రోస్ & కాన్స్ ఏమిటో ఆమెరికన్స్ బాగా తెలుసు కాబట్టే ఒక వ్యూహం ప్రకారం ఇదంతా చేశారు.
  • డొనాల్డ్ ట్రంఫ్ ఉద్దేశ్యం వేరు. అమెరికన్ టాక్స్ పేయర్స్ డబ్బుని, తమ సైనికుల ప్రాణాలని వేరే దేశం కోసం ఎందుకు పణంగా పెట్టాలి అనేదే ట్రంఫ్ ఉద్దేశ్యం. ఒక్క బులెట్ కూడా దొరక్కుండా, ఎయిర్ బేస్ లని బాంబులతో పేల్చేసి వెనక్కి రావాలని ట్రంఫ్ ఆలోచన… అలాగే తాలిబన్లతో చేసుకున్న ఒప్పందం లో కూడా ఇదే ఉంది.
  • డెమోక్రాట్స్ Vs రిపబ్లికన్స్………. విభేదాలు ఉండవచ్చు కానీ గత 20 ఏళ్లుగా ఖర్చు పెట్టిన 2.5 ట్రిలియన్ డాలర్లు, వాటితో పాటు 2500 అమెరికన్ సైనికుల ప్రాణాలు ఫణంగా పెట్టి వెళుతూ వెళుతూ అమాయక ప్రజల ప్రాణాలని తీయడానికి, ప్రాంతీయంగా పక్క దేశాలలో అశాంతిని రగల్చడానికా? ఎవరయినా ఒకటే ! ఆ ఎవరు ఎవరు ? భారత్ కి స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని క్లెమెంట్ అట్లీ [Clement Attlee 1945-1951] భారత ఉపఖండం లో పెట్టిన చిచ్చు ఇప్పటికీ చల్లారలేదు. అలాగే ఆఫ్ఘన్ విషయంలో రోనాల్డ్ రీగన్, జార్జ్ బుష్ లతో పాటు ఒబామా, జో బీజింగ్ లు చేసిన, చేస్తున్న పని కూడా ఒకటే. నానాజాతి సమితి అయిన అమెరికా ఏదో ఒకరోజు ఇంతకు ఇంతా అనుభవిస్తుందా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions