చాన్నాళ్ల తరువాత నిర్బంధంగా మాటీవీ వాడి కార్తీకదీపం సీరియల్ చూడబడ్డాను… చెత్త కథ, చెత్త కథనం, చెత్త కేరక్టరైజేషన్, చెత్త సీరియల్… అందులో ఇసుమంత కూడా బేధాభిప్రాయం లేదు… సరే, ఆ టీవీవాడు ఏ మాయ చేస్తున్నాడో, వాడి సీరియళ్లన్నీ అద్భుతమైన టీఆర్పీలు సాధిస్తయ్… అందులో కార్తీకదీపం ఎన్నాళ్లుగానో టాప్… పెద్ద పెద్ద స్టార్ హీరోల ప్రిస్టేజియస్ సినిమాలు కూడా ఆ రేటింగ్స్ సాధించవు… మన బార్క్ వాడి దరిద్రపు రేటింగ్ వ్యవస్థ, డొల్లతనం, లోటుపాట్ల సంగతి పక్కన పెడితే… ఆ హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ సాధించిన పేరు అంతా ఇంతా కాదు… సినిమా స్టార్ హీరోయిన్లను మించిన స్టార్డం అనుభవిస్తోంది ఆమె… ఎస్, ఆమె మరీ తేలికగా తీసిపారేయదగిన నటి ఏమీ కాదు… ప్రతిభ కలిగిందే… కానీ సీరియల్లో మరో కేరక్టర్ గురించి, ఆ నటి గురించి చెప్పుకోవాలి…
ఈమధ్య బోలెడన్ని వార్తలు… అదుగో సౌందర్య పాత్ర పోషిస్తున్న అర్చన సీరియల్ నుంచి పారిపోయిందట… కాదు, కాదు, మోనిత సీరియల్ వదిలేసింది కాబట్టి, ఆ పాత్రను చంపేశారట… ఇలాంటి వార్తలతో సైట్లు, గొట్టం చానెళ్లు పొట్టపోసుకున్నయ్, ఎవరి పొట్టతిప్పలు వాళ్లవి… తీరా చూస్తే వాళ్లిద్దరూ అలాగే ఉన్నారు… నిజానికి ఏళ్ల తరబడీ సీరియళ్లు కాబట్టి, నటీనటులతో వచ్చే ఇబ్బందులతో, సీరియళ్ల నిర్మాతలు ఆ కథ రచయితల మెడల మీద కత్తులు పెట్టి, ఆయా పాత్రల్ని చంపేయడమో, కనిపించకుండా చేయడమో చేసేస్తుంటారు… లేదంటే హఠాత్తుగా వేరే నటుల్ని తీసుకొచ్చి పెట్టేస్తారు… అవన్నీ సీరియళ్ల ప్రేక్షకులకు తెలుసు కాబట్టి అడ్జెస్ట్ అయిపోతూ ఉంటారు… విషయానికొస్తే… నిజానికి కార్తీకదీపం సీరియల్‌కు ప్రాణం ప్రేమి కాదు, ఆ పిల్లలు కాదు, అత్యంత ఘోరమైన పాత్ర పోషిస్తున్న ఆ నిరుపమ్ కూడా కాదు… శోభా శెట్టి… అలియాస్ అందులోని మోనిత పాత్రధారి… నిజానికి ఆ పాత్ర చిత్రణ సరిగ్గా లేదు గానీ, ఉన్నంతలో ఆమె ప్రాణం పోస్తోంది… నిజానికి ఆమె లేకుంటే సీరియల్ లేదు… పలుసార్లు ఆమె ప్రేమిని డామినేట్ చేస్తోంది…
Ads
కథాకథనాల్లో, పాత్రచిత్రణలో అనేకానేక లోపాలున్నా సరే… శోభ తనకిచ్చిన మోనిత పాత్రను బ్రహ్మాండంగా పోషిస్తోంది… ప్రేమీ లాగా ఏడుపులు మాత్రమే కాదు… మోనిత పాత్రకు సంబంధించిన విలనీ, సరసాలు, సరదాలు, ఆవేశం, ఆక్రోశం, ప్రేమ, ఉన్మాదం… వాట్ నాట్… అన్ని ఉద్వేగాల్ని అనితర సాధ్యంగా పండిస్తోంది ఆమె… తెలుగు సీరియళ్లు అంటేనే కన్నడ తారలు కదా… ఈమె కూడా బెంగుళూరుకు చెందిన నటి… ఎంఎస్సీ చేసింది… సీరియళ్లలో విలనీ ఉండే ఆడపడుచులు, తోడికోడళ్లు, అత్తల పాత్రలు ఏ తలకుమాసిన తారలైనా చేయగలరు… కానీ మోనిత పాత్ర డిఫరెంట్… ఆమె ప్రేమికురాలు, ఆమె ఉన్మాది, ఆమె బాధితురాలు, ఆమె విలన్, ఆమె ఆవేశపరురాలు… అన్నీ కలగలిపిన ఆ పాత్ర శోభాశెట్టి లక్కే… దానికి న్యాయం చేస్తోంది… ఈమె కోసమైనా సరే… ఆ నికృష్ట సీరియల్‌ను ఇంకొంతకాలం భరించవచ్చునేమో…!!
Share this Article