……….. By……… పార్ధసారధి పోట్లూరి ……… ఊపేకుహ : ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి ! తాలిబన్లు కాబూల్ ని స్వాధీనం చేసుకోగానే పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్ర సంస్థల వాళ్ళు వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచారు. ఇక పాకిస్థాన్ లో తాలిబన్లని సమర్ధించేవారు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇక చైనా, పాకిస్థాన్, రష్యాలు తమ వంతు వాటా కోసం తమ రాయబార కార్యాలయాలని మూసేయకుండా ఆశగా ఎదురు చూస్తున్నాయి….. కానీ అసలు కథ చాలా ఉంది ముందు ముందు… తాజాగా వరల్డ్ బాంక్ తమ సహాయాన్ని ఆపేస్తూ ప్రకటన జారీ చేసింది ఆఫ్ఘన్ ప్రెస్ ద్వారా… ‘Deeply concerned’: World Bank freezes aid to Afghanistan after Taliban takeover… ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల వలన మహిళలకి కలగనున్న హక్కుల హననం మీద మేము స్పందించాల్సి వస్తున్నది అంటూ వరల్డ్ బాంక్ అధికారి తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] కూడా తమ ఆపరేషన్స్ ని ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 370 మిలియన్ డాలర్ల లోన్ కింద వివిధ ప్రాజెక్ట్స్ కి నిధులు ఇస్తున్నది ఐఎంఎఫ్ ఆఫ్ఘనిస్తాన్ కి. దీనిలో భాగంగా గత సోమవారం రోజున 340 మిలియన్ డాలర్ల చెక్ ఇవ్వాల్సి ఉంది ఆఫ్ఘనిస్తాన్ కి… అయితే తాలిబాన్ లు కాబూల్ ని స్వాధీనం చేసుకోవడం వలన తాము అప్పుకింద ఇవ్వాల్సిన $340 మిలియన్ చెక్ ని కాన్సిల్ చేసినట్లు ప్రకటించింది. వరల్డ్ బాంక్ మరో అడుగు ముందుకు వేసి తమ అధికారులని కాబూల్ నుండి వెనక్కి రప్పించింది. దాంతో ఇప్పటికిప్పుడు వరల్డ్ బాంక్ ఆపరేషన్స్ పునరిద్దరించడం ఉండబోదు.
2002 నుండి వరల్డ్ బాంక్ ఆఫ్ఘనిస్తాన్ లో వివిధ ప్రాజెక్టుల కోసం సహాయం చేస్తూ వస్తున్నది. మొత్తం 5.3 బిలియన్ డాలర్ల పెట్టుబడి కింద దాదాపు 24 ప్రాజెక్టులు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. వరల్డ్ బాంక్ ఇచ్చే మొత్తం కూడా గ్రాంట్ కిందనే ఇస్తున్నది అంటే తిరిగి చెల్లించక్కరలేని విధంగా అన్నమాట. వివిధ దేశాల కాంట్రాక్టర్లు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న వారందరూ తిరిగి తమ తమ దేశాలకి వెళ్లిపోయారు వారిలో భారతీయ కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు.
Ads
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధిక పరిస్తితి ఏమిటి ?
- తాలిబన్లు కాబూల్ ని స్వాధీనం చేసుకోకముందే ఒకరోజు ముందు ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ బాంక్ అయిన DA AFGHANISTHAN BANK [DAB] గవర్నర్ అజ్మల్ అహ్మది ఆఫ్ఘనిస్తాన్ ని వదిలి విదేశాలకి పారిపోయాడు. ఆగస్ట్ 16 నుండి ఆఫ్ఘన్ సెంట్రల్ బాంక్ కార్యకలాపాలు స్తంభించి పోయాయి. 9.5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆస్తులు అవి DAB కి చెందినవి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బాంక్ అధీనంలో ఉన్నాయి. మొత్తం 9.5 బిలియన్ లలో 7 బిలియన్ ల మొత్తం ఫెడరల్ రిజర్వ్ అధీనంలో ఉండగా మిగతా మొత్తం వివిధ ఫైనాన్షియల్ సంస్థలలో ఉన్నాయి. వీటిలో బంగారం, బాండ్స్ తో సహా వివిధ రూపాలలో ఉన్నాయి.
- ఆఫ్ఘనిస్థాన్ ఆస్తులు అమెరికాలో ఎందుకున్నాయి ? Well… అమెరికన్, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించి తాలిబన్లని తరిమేసి అక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తరువాత ఎప్పటికయినా ఇవి తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోవచ్చు అనే ఉద్దేశ్యంతో అమెరికా ఆఫ్ఘన్ సెంట్రల్ బాంక్ లో ఉన్న మొత్తాన్ని అమెరికన్ రిజర్వ్ బాంక్ లో జమ చేసింది… అయితే తగిన కారణాలు చూపించి DAB గవర్నర్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
- ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ బాంక్ కి దేశం మొత్తం మీద 46 బ్రాంచీలు మాత్రమే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో లావాదేవీలు మొత్తం అక్కడి కరెన్సీ ఆఫ్ఘని లోనే జరుగుతాయి. 10% కంటే తక్కువ ఆఫ్ఘన్ ప్రజలకి బాంక్ ఖాతాలు ఉన్నాయి. లావాదేవీలు మొత్తం కాష్ రూపంలోనే జరుగుతూ ఉంటాయి. కేవలం దిగుమతులకి చెల్లించడానికి మాత్రమే డాలర్లు అవసరం అవుతాయి [ముఖ్యంగా ఇరాక్,పాకిస్థాన్ లతో ]. దిగుమతులకి చెల్లించడానికి DAB గవర్నర్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కి ఇండెంట్ పంపిస్తాడు. అవి సక్రమంగా ఉంటేనే ఫెడరల్ రిజర్వ్ డాలర్లు వాడుకోవడానికి అనుమతి ఇస్తుంది. ఇది సెంట్రల్ బాంక్ డబ్బు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోకుండా అమెరికా చేసిన ఏర్పాటు.
- మూడు రోజుల క్రితం తాలిబన్లు సెంట్రల్ బాంక్ కి గవర్నర్ ని అపాయింట్ చేసింది. కానీ సమస్య అలానే ఉండిపోయింది. కారణం ? అంతర్జాతీయ సమాజం తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలి అంటే అది లేజిట్ మేట్ అయి ఉండాలి అంటే చట్టబద్ధంగా ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం అయి ఉండాలి. అలాంటి ప్రభుత్వం నియమించిన గవర్నర్ ని మాత్రమే ఫెడరల్ రిజర్వ్ ఆమోదిస్తుంది కాబట్టి సెంట్రల్ బాంక్ ద్వారా డాలర్ ని యాక్సెస్ చేసే అవకాశం తాలిబన్లకి లేదు.
- ఆఫ్ఘనిస్తాన్ నడిచేది ఎక్కువ శాతం దిగుమతుల మీద మాత్రమే. ఆహారం, మందులు, నిత్యావసరాలు అన్నీ ఇరాన్, పాకిస్థాన్ ల నుండి దిగుమతి చేసుకోవాలి. వాటికి డాలర్ రూపం లో చెల్లింపులు జరపాలి. ఈ రోజుకి కేవలం మూడు రోజులకి సరిపడా అత్యవసర మందులు స్టాక్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో. గత పది రోజులుగా ఆహారం, మందుల దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికే ఒక బ్రెడ్ పాకెట్ 25 ఆఫ్ఘనీ ల నుండి 60 ఆఫ్ఘనీలకి పెరిగిపోయింది ధర. వచ్చే వారంలోపు దిగుమతులు ఉండకపోతే తీవ్ర ఆహార, మందుల కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే ఉన్న స్టాకులని తాలిబన్లు బలవంతంగా లాక్కొని వాళ్ళ అవసరాల కోసం స్టాక్ చేసుకున్నారు.
- ఇప్పుడేం జరగబోతున్నది ? తాలిబన్లు దిగుమతులు చేసుకోవడానికి సెంట్రల్ బాంక్ నుండి డాలర్ల యాక్సెస్ లేదు. కాబట్టి కాబూల్ ని ఎక్కువ రోజులు కంట్రోల్ చేయలేరు. ఇప్పటికే వేగంగా ఆఫ్ఘనీ కరెన్సీ విలువ పడిపోతున్నది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది.
- తాలిబన్లు మనీ లాండరింగ్ ద్వారా డాలర్లు సంపాదించుకోగలరు కానీ అవి అంతర్జాతీయ లావాదేవీలకి పనికిరాదు ఎందుకంటే మనీ లాండరింగ్ ద్వారా వచ్చే డాలర్లని యే దేశ సెంట్రల్ బ్యాంక్ కూడా అనుమతించలేదు.1996 నుండి 2001 వరకు తాలిబన్లు ఎలా మెయింటెన్ చేయగలిగారు ? అప్పట్లో డాలర్ లావాదేవీలకి ఆన్ లైన్ లేదు అంటే కంప్యూటరైజేషన్ కాలేదు కాబట్టి నడిచిపోయింది ఇప్పుడు అలా కుదరదు. ఎగుమతి చేస్తే వచ్చిన డాలర్లని సెంట్రల్ బాంక్ లో జమ అవుతాయి అధికారికంగా అలాగే అవి ఎక్కడి నుండి ఎలా వచ్చాయో తెలిసిపోతుంది. కానీ మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన డాలర్లని కాష్ రూపంలో డిపాజిట్ చేయడం కుదరదు.
- So! దేశాన్ని నడపాలి అంటే అంటే డాలర్లు కావాలి… అదీ ఎగుమతుల ద్వారా వచ్చింది అయి ఉండాలి… 75% దిగుమతుల మీద ఆధారపడ్డ దేశానికి డాలర్లు అందుబాటులో లేకుండా నడవదు.. వచ్చే ప్రతీ ఆఫ్ఘనీ లో దిగుమతలకి 75% ఖర్చు చేయాల్సి ఉంటుంది. కార్పెట్లు, రగ్గులు, డ్రై ఫ్రూట్స్ ని ఎగుమతి చేయడం ద్వారా వచ్చే మిగతా 25% ఆదాయం కూడా పది రోజులుగా లేదు. ఒకవేళ ఎగుమతులు మళ్ళీ మొదలు పెట్టినా అవి సెంట్రల్ బాంక్ లో జమ అవుతాయి కానీ వాటిని వాడుకునే అవకాశం తాలిబన్ల కి ఉండదు.
- ఇప్పుడు తాలిబన్ల ముందు ఒకే ఒక పరిష్కారం ఉంది. అది ఐక్యరాజ్య సమితి లో మెజారిటీ దేశాల గుర్తింపు పొందాల్సి ఉంటుంది అప్పుడే సెంట్రల్ బాంక్ గవర్నర్ కి గుర్తింపు వస్తుంది. మహిళల హక్కులని కాపాడాలి. బహిరంగ ఉరి, కాల్చడం, రాళ్ళతో కొట్టి చంపడం లాంటివి చేయకూడదు. అలాగే రాజకీయ ప్రత్యర్ధులని కిడ్నాప్ చేసి చంపడం లాంటివి చేయకూడదు. ఎన్నికలు నిర్వహించాలి లేదా పాత ప్రభుత్వంతో కలిసి అధికారం పంచుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ చాలా పెద్దది. కానీ అలా చేయగలరా ?
- అందుకే పంజ్ షీర్ వ్యాలీ ని చుట్టుముట్టి రెండు రోజులు అవుతున్నా ఒక్క బులెట్ కూడా కాల్చలేదు తాలిబన్లు. అహ్మెద్ మసూద్ మరియు అమృల్లాహ్ తో చర్చలు జరపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఘర్షణకి దిగడానికి సందేహిస్తున్నారు. బలవంతం చేసి పంజ్ షీర్ కి కలుపుకుంటే అది వాళ్ళ గుర్తింపుకి అడ్డం వస్తుంది.
- ఎలా చూసినా తాలిబన్లు ఎక్కువ రోజులు దేశాన్నినడపడం అసాధ్యం. కేవలం పాకిస్థాన్, చైనా, రష్యాలు గుర్తిస్తే సరిపోదు. చైనా సహకారంతో ముందుగానే తాను తవ్వుకునే గనుల కోసం అడ్వాన్స్ గా డాలర్లు చెల్లించినా, అవి కూడా సెంట్రల్ బాంక్ లో జమ అవుతాయి తప్పితే కాష్ రూపంలో ఇవ్వలేదు చైనా… పోనీ అఫ్ఘానీ లని ప్రింట్ చేయాలని చూస్తే అది కరెన్సీ పతనానికి దారి తీస్తుంది తప్పితే ఏ మాత్రం ఉపయోగం ఉండదు.
- ఆగస్ట్ నెలకి గాను ఐక్యరాజ్య సమితి [భద్రత మండలి ] అధ్యక్ష పదవిలో భారత దేశం ఉన్నది అన్న సంగతి మరవకూడదు. అంటే ఈ నెల మొత్తానికి ఐక్యరాజ్య సమితిలో ఎలాంటి తీర్మానం చేయాలన్నా భారత్ దేశ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే ఆగస్ట్ 31 లోపల అన్ని దేశాల వాళ్ళు వెళ్లిపోవాలని అడుగుతున్నారు తాలిబన్లు. ఈ లోపల ఎలాంటి గుర్తింపు రాదు. అసలు తాలిబాన్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి గుర్తింపు ఇప్పట్లో రాదు. అది చాలా కష్టమయిన పని. అందుకే రష్యా వెంటనే తెరుకుని అక్కడ బావుకునేది ఇప్పట్లో ఏదీ లేదు అని తెలుసుకొని బయటికి వచ్చేసింది… మరి ఇంతోటి దానికి పాకిస్థాన్ లో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నట్లో ? భవిష్యత్తులో ఒక్క డాలర్ దారి తప్పినా వెంటనే నిషేధం అమలవుతుంది. పక్క దేశాలలో ఒక్క తాలిబాన్ హింసకి పాల్పడ్డట్లు రుజువు దొరికినా అది కూడా నిషేధానికి దారి తీస్తుంది. అంచేత అన్నీ మూసుకొని తమ దేశంలోనే ఏదన్నా చేసుకోవాలి అదీ ప్రజాస్వామ్య బద్ధంగా మాత్రమే…!!
Share this Article