ఇరవయ్యేళ్ల యుద్ధం ముగిసింది… అఫ్ఘన్‌లో ఉన్న చిట్టచివరి అమెరికా సైనికుడు కూడా వెళ్లిపోయాడు… తాలిబన్లు పెట్టిన గడువుకు ఓ నిమిషం ముందే చివరి విమానం గాల్లోకి ఎగిరింది… ఇన్నేళ్ల యుద్ధంలో దాదాపు 2500 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు అక్కడ… 3500 మంది దాకా అమెరికన్ సైనిక కంట్రాక్టర్లు, వర్కర్లు మరణించారు అక్కడ… అన్ని మరణాలకన్నా… చిట్టచివరి సైనికుడు వీడ్కోలు విమానం ఎక్కేశాడు అనే వార్తలకన్నా…. ఆ విమానంలోకి ఒక యువతి ఎక్కలేదు అనే వార్తే కలుక్కుమనిపించేలా ఉంది… ఆ యువతి పేరు నికోల్… అమెరికాలో పనిచేసిన మెరైన్ దళంలో సార్జంట్… వయస్సు 23 ఏళ్లు… అసలు అప్ఘన్ వార్తలు, ఐసిస్ వార్తలు అంటేనే క్రూరం, బీభత్సం, భయానకం… మరి ఈమె వార్త ఎందుకు కదిలించేలా ఉంది..? ఏమైంది..?
ఈ ఫోటో గుర్తుందా..? ఆగస్టు 20న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది నికోల్… I Love my Duty… ఈ క్యాప్షన్ పెట్టుకుంది… ఓ అప్ఘనీ పసిపాపను చేతుల్లోకి తీసుకుని లాలిస్తున్న ఫోటో ఇది… తాలిబన్లు మొత్తం ఆక్రమించేశాక లక్షల మంది ప్రజలు ఎటు తోస్తే అటు పారిపోతున్నారు, అప్ఘన్ సైనికులే పారిపోగా లేనిది, మామూలు ప్రజలదేముంది..? కాబూల్ విమానాశ్రయానికి ప్రజలు పరుగులు తీశారు… ఏదైనా విమానం దొరికితే ఎక్కి ఎగిరిపోవడమే మార్గమని ఎగబడ్డారు… జనం కకావికలు… ఈ సందర్భంగా కూడా అమెరికన్ సైన్యం సేవలందించింది… ఇదుగో ఈ నికోల్ వంటి సైనికులు… ఈమె పోస్ట్ చేసిన ఆ ఫోటోను అమెరికన్ డిఫెన్స్ ప్రచార యంత్రాంగం కూడా షేర్ చేసింది… బాగుంది ఫోటో… హృద్యంగా… ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది ఆ ఫోటో…
Ads
ఇదుగో ఇలాంటి ఫోటోలు బోలెడు ఆమె పోస్టుల్లో… అఫ్ఘన్ నుంచి ప్రజల్ని తరలిస్తున్న ఓ విమానం, అందులో ఎక్కడానికి ఓ పొడవాటి క్యూ… అక్కడ తుపాకీ పట్టుకుని కనిపిస్తున్నది నికోల్… Escorting evacuees onto the Bird… అని క్యాప్షన్ పెట్టుకుంది… ఇప్పుడామె లేదు… ఆ డ్యూటీ మైండెడ్ చిరునవ్వు చెరిగిపోయింది… కాదు, పేలిపోయింది… మొన్న గురువారం కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 170 మంది వరకూ చనిపోయారు కదా… అందులో 13 మంది అమెరికన్ సైనికులు… అందులో ఈమె కూడా…!! ఈ వార్త అమెరికన్లను కదిలించింది… ఉద్యోగాన్ని చివరి క్షణం దాకా ప్రేమిస్తూనే కన్నుమూసింది… నిజానికి ఆమె ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని అనుకుంది… కానీ ఆమె హార్ట్ బీట్ క్రమబద్ధంగా ఉండదు, అందుకని నేవీలో చేర్పించాడు తండ్రి… ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నాడు… ఆమె భర్త కూడా మెరైన్ దళమే… పేరు జరోడ్ గీ… ఇన్ని మరణాలకన్నా ఈమె చావు ఎందుకంతగా కదిలించింది..? ఏమో… కొందరు అలా కనెక్టయిపోతారు… మాయమై కన్నీటినీ నింపుతారు… ఇదుగో ఇలా చివరకు ఓ పేటికలో అచేతనంగా పడుకుని వచ్చి పలకరిస్తారు…!!!
Share this Article