…… పాత హీరో కృష్ణంరాజు, తన నటవారసుడు ప్రభాస్ బీజేపీ మనుషులే కావచ్చుగాక… కానీ పేకాట పేకాటే… ప్రభాస్ మనవాడే కదా అని రైట్ వింగ్ తనను వెనకేసుకు రాకపోవచ్చు… ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ అప్పుడే వివాదాల్లోకి దిగిపోతోంది… హిందుత్వ అభిమానులు, రామభక్తులు ఈ సినిమాను వ్యతిరేకించే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి… దానికి కారణాలూ ఉన్నయ్… బాహుబలిని మించిన నిర్మాణవ్యయం, దాదాపు 500 కోట్లతో ఈ సినిమా తీయనున్నారు… రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ అనుకున్నారు ప్రస్తుతానికి… ఓం రౌట్ దర్శకుడు… నిర్మాత భూషణ్‌కుమార్… సీతగా కృతి సనన్ అనే వార్తలున్నాయి, కానీ కన్ఫరమ్ కాలేదు…
ప్రస్తుతానికి సినిమా ఈ స్థితిలో ఆగిపోయి ఉంది… బహుశా ప్రొప్రొడక్షన్ వర్క్ ఏదైనా జరుగుతూ ఉందేమో… కానీ రీసెంటుగా రావణ పాత్రధారి సైఫ్ ముంబై మిర్రర్ పత్రికతో మాట్లాడుతూ వివాదానికి తెరలేపాడు… ఈ సినిమాలో రావణుడిలోని మానవీయ కోణాన్ని చూపించున్నట్టు చెప్పాడు… అంటే ఓ రాక్షసుడిగా గాకుండా మనిషిగా చిత్రీకరించడమే కాదు… సీతమ్మను ఎత్తుకుపోవడాన్ని కూడా జస్టిఫై చేస్తారట… అంటే శూర్ఫణఖకు లక్ష్మణుడు చేసిన అవమానానికి ప్రతీకారంగా సీతను ఎత్తుకుపోవడం సబబే అన్నట్టుగా కథనం ఉంటుందట…
Ads
ఇది అప్పుడే కొన్ని విమర్శలకు, వివాదాలకు కారణమవుతోంది… దేశం మొత్తం రాముడిని హీరోగా, రావణుడిని విలన్‌గా భావిస్తుంటే… దానికి భిన్నంగా ఈ సినిమా వెళ్తే ప్రభాస్ అనవసరంగా వివాదాల్లోకి వెళ్తున్నాడనే అభిప్రాయాలు మొదలయ్యాయి… దీపిక పడుకోన్ పద్మావతి సినిమా అనుభవాల్ని గుర్తుచేస్తున్నారు… ఇవన్నీ నిర్మాతను పునరాలోచనలో పడేయకపోవచ్చుగానీ కథ, కథనం విషయంలో పునరాలోచన తప్పకపోవచ్చు అంటున్నారు…
నిజానికి రావణుడు చాలామంది దృష్టిలో విలన్ ఏమీ కాదు… పైగా పూజనీయుడు… అనేకచోట్ల రావణుడికి గుళ్లున్నాయి… తమిళనాడు, కేరళ దక్షిణ ప్రాంతాల్లో రావణుడినే దేవుడిగా ఆరాధిస్తారు పలుచోట్ల… (రావణుడిది వైరభక్తి… అంటే దేవుడిని వేగంగా చేరుకోవడానికి అవలంబించే భక్తి… అందుకే చాలామంది యోగులు కూడా రావణుడిని ద్వేషించరు… సఖ్యభక్తికన్నా వైరభక్తిలోనే గాఢత అధికంగా భావిస్తారు… సరే, అదంతా వేరే కథ… అదొక తత్వం…)… ఎన్టీయార్ వంటి నటదర్శకులు గతంలో రావణుడికి హీరోయిజం ఆపాదించి మరీ సినిమాలు తీశారు, ప్రజలు అభిమానించారు… ఎవరూ వ్యతిరేకించలేదు…
కానీ ఇప్పటి రోజులు వేరు… అకారణ వివాదాలను రేకెత్తించి, పెట్రోల్ పోసే కాలమిది… ఇదేమో భారీ బడ్జెట్ సినిమా… ఈ సినిమా వ్యాపారమే చాలా సున్నితంగా ఉంటుంది… పైగా క్రియేటివ్ ఫ్రీడంను స్వాగతించే రోజులు అసలే కావివి… సైఫ్ సినిమా కథ గురించి చెప్పి నిర్మాతకు మంచి చేసినట్టా..? లేక కథను ముందే వెల్లడించి తప్పు చేసినట్టా..? మంచే చేసినట్టు… జనం మూడ్ ఏమిటో తెలుస్తుంది… ఐనా రామాయణం కథలో దాచుకునేది ఏముంటుంది..? సో, సైఫ్ కోణంలో తప్పేమీ లేదు… ఎటొచ్చీ… నిర్మాత, దర్శకుడు ఏం సవరించుకుంటారనేదే చూడాల్సిన అంశం..!!
Share this Article