రౌడీ బేబీ పాటలో ఏముంది..? పాట కంటెంటు శుద్ధ దండుగ… అందులో ఏ లిటరరీ చమక్కులూ లేవు… ఏదో సాయిపల్లవి డాన్స్ పుణ్యమాని వందకు పైగా కోట్ల వ్యూస్ సాధించింది, ఇప్పటికీ అది ఇండియన్ వీడియోస్‌లో టాప్ టెన్‌లో ఒకటి…. పోనీ, వై దిస్ కొలవెరిలో ఏముంది..? నిజమే, అందులో కూడా ఏమీ లేదు… ఎవడో ఓ తాగుబోతు తన ప్రేమభగ్నం మీద ఏదో పాడుతుంటాడు… కానీ అదీ టాప్ టెన్‌లో ఒకటి… కొన్నిసార్లు అంతే… కొన్ని అలా కనెక్ట్ అయిపోతూ ఉంటయ్… ఎహె, ఈ మలయాళం, ఈ తమిళం పాటలదేముంది..? ఇప్పుడు ఓ శ్రీలంక పాట నెట్ శ్రోతల్ని ఉర్రూతలూగిస్తోంది… దాని పేరు మాణికె మాగే హితె… పాడింది Yohani Diloka De Silva… ఓ నయా సెన్సేషన్… అబ్బే, ఓ లంకిణి పాటకు ఈ సీన్ ఏందీ అని తీసేయకండి… లంకిణి పదం బాగా లేదా..? సరే, సింహళి అందాం…
ఈరోజుల్లో జస్ట్, ఏదో పాట పాడేసి, లేదా ఓ ట్రాక్ పాడేస్తే సరిపోదు… ఫేమ్ కావాలంటే అంతకుమించి ఏదో కావాలి… మొన్నటి ఇండియన్ ఐడల్ విజేత పవన్ దీప్ రాజన్ తెలుసు కదా… ఓ పదీపదిహేను సంగీత పరికరాలను శాస్త్రీయంగా వాయించగలడు, దానికితోడు మంచి గొంతు, సాధన… ఈ యొహానీ కూడా జస్ట్, పాటగత్తె కాదు… రాయగలదు, ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, బిజినెస్ వుమన్, యూట్యూబర్… సరే, ఈ పాటకు వద్దాం… శ్రీలంక యూట్యూబ్ టాప్ వీడియోల్లో ఒకటి ఇప్పుడు… అయితే అది కాదు అసలు విశేషం… దాన్ని మన హిందీ, తమిళ, పంజాబీ, మలయాళం, నేపాలీ తదితర భాషల్లోకి అనువదించబడి… అవీ నెట్‌లో షేక్ చేస్తున్నయ్… అమెజాన్ మ్యూజిక్‌లో టాప్ టెన్‌లో ఉంది ఇప్పుడు ఈ పాట… ఒరిజినల్ పాట ఓసారి వింటారా… ఇదుగో… యూట్యూబ్ లింక్…
Ads
అందుకే డౌటొచ్చేసింది… అరె, మన థమన్ ఏమైపోయాడు..? మన సుద్దాల ఏమైపోయాడు..? మన అనంత శ్రీరాముడు ఏమైపోయాడు..? ఇలాంటి అందుకోవడంలో మనవాళ్లే కదా ముందు వరుసలో ఉండేది..? ఏమైంది మన చొరవకు..? ఏమైంది మన దూకుడుకు..? అబ్బే, బాగా లేదబ్బా…! ఎంతసేపూ ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్ పాటలేనా..? ఇలాంటివి వెంటనే ఆందుకోవాలె కదా… పోనీ, ఏదైనా ప్రైవేట్ ఆల్బమ్… దాన్ని వెంటనే అందుకుని తన బిడ్డలతో రికార్డింగ్ డాన్స్ చేయించి, నాదే పేటెంట్ రైట్స్ అనడానికీ అమెరికాలో ఒకాయన రెడీగా ఉంటాడు… ఎవరెంత వాడుకుంటే అంత..!! ఇంతకీ ఆ పాటలో ఏముందీ అంటారా..? ఏమీలేదు పెద్దగా… పువ్వూతేనెటీగ, నా హృదయం నీవెంటే, నీ చుట్టే, బేబీ నువ్వు నా గుండెలో, నా ప్రతి ఆలోచన నీ గురించే, అదొక అగ్గి, నీ అందం చూస్తుంటే కళ్లు ఆర్పలేను, ఇంకా జాగుచేయకు, నువ్వు ఓ దేవతవి, నువ్వంటేనే ఓ ఉల్లాసం, మన జంటగుర్రాలను ఇంకా చాలారోజులు కట్టేసి ఉంచలేం, మన కళ్లు కలిస్తే చాలు ఓపలేకపోతున్నా, గుండె మసులుతోంది, రా, దగ్గరకు రా, చూపులతో పిచ్చిరేపకు…. ఇలా నడుస్తోంది… ఇలాంటివి లక్షాతొంభయ్యారు రాశారు మనవాళ్లు… కానీ ఎందుకో నెటిజనానికి బాగా కనెక్టయింది… ఆమె గొంతు నిజంగా ఓ క్రేజీ… కళ్లుమూసుకుని వినాలి పాటను… ఏమిటీ లేట్ ఇంకా..? కనీసం ట్యూన్ కొట్టేయండర్రా… ఆ పాటే కాస్త అటూఇటూ మార్చి కుమ్మేయండర్రా… అసలు ఏమైంది మన స్పీడ్‌కు…!? డుగ్గు డుగ్గు దాటిపోవాలె.,., వోకేనా…!!!
Share this Article