.
అదే జ్యూరీ… అదే ఆర్కెస్ట్రా… అదే ప్లాట్ ఫామ్… అదే హోస్ట్… అదే ప్రోగ్రామ్… కానీ నాలుగో సీజన్‌కు చప్పబడి, చల్లబడి ఉసూరుమనిపించింది… అదే తెలుగు ఇండియన్ ఐడల్, సినీ మ్యూజిక్ కంపిటీషన్ రియాలిటీ షో…
ఒకవైపు హిందీ ఇండియన్ ఐడల్ షో దుమ్మురేపుతుంటే… ఈ తెలుగు ఇండియన్ ఐడల్ మాత్రం దుమ్ముకొట్టుకుపోతోంది… సింపుల్‌గా… ఈసారి చీఫ్ గెస్టు లేడు… అంత అనాసక్తత ప్రోగ్రామ్ నిర్వహణపై… అసలు షోకు సంగీతం తెలిసిన అతిథులు ఎవరూ రాలేదు… ఆ ఎఫర్టే కనిపించలేదు… ఒక్క శృతిహాసన్ తప్ప…
Ads
గతంలో సంగీత దర్శకులు, గాయకులు, గీత రచయితలను పిలిచి షోను రక్తకట్టించారు, షో జిగేలుమంది… ఈసారి ఎవరూ లేక, రాక వెలవెలాబోయింది… బ్రహ్మానందం వచ్చాడు, వేస్ట్… ఓజీ హీరోయిన్ వచ్చింది, ఆమెకు ఏమీ తెలియదు, జస్ట్, ఓ ఎపిసోడ్ పవన్ కల్యాణ్ ఓజీ ప్రమోషన్‌కు, భజనకు అంకితం చేశారు, అందుకని వచ్చింది ఆమె…
ప్రియదర్శి, నీహారిక ప్రమోషన్ కోసమే… జెనీలియా ఎందుకొచ్చిందో తెలియదు… పిలిచినవాళ్లకూ తెలిసి ఉండదు ఎందుకు పిలిచామో… వెరసి వెలవెలా… షో విలవిల… ఫస్ట్, సెకండ్, థర్డ్ సీజన్ల ఫినాలేలు అదరగొట్టారు… చీఫ్ గెస్టులు, హంగామా… ఈసారి చీఫ్ గెస్టు లేడు… జడ్జిలే ట్రోఫీ ఇచ్చేసి మమ అనిపించారు… చేతులు దులిపేసుకున్నారు…
ఒకటి మాత్రం గుడ్… విన్నర్‌గా బృంద సెలక్షన్ కరెక్టు… ఆమె పాటల్ని ఇరగదీసేసింది, అంతే… ఫస్ట్ రన్నరప్ పవన్ కల్యాణ్ కూడా కరెక్టు ఎంపిక… ఇక్కడి వరకూ ఈ షో సరిగ్గా నడిచింది… ఇక మిగతావి చూద్దాం…
షోకు పే-ద్ద మైనస్ శ్రీరామచంద్ర… పక్కా మేల్ శ్రీముఖి… ఎందుకు అరుస్తున్నాడో తనకే తెలియదు… తనకు తోడుగా ఈసారి సమీరా… కేకలు ఎందుకు పెడుతున్నారో వాళ్లకైనా తెలుసా అసలు..? హోస్టింగ్ అంటే గొంతులు చించుకోవడం అని ఎవరు చెప్పారు..? ఒక్కసారి ప్రదీప్, సుధీర్ హోస్టింగ్ చూడాలి వీళ్లు అర్జెంటుగా..! ఎలిమినేషన్స్, విజేత ప్రకటన సమయంలో శ్రీరామచంద్ర, సమీరాల మాటలు, గ్యాపులు, యాక్షన్ పెద్ద సోది… ఆ ప్రజెంటేషన్ తీరు కూడా పరమ నాసిరకం…
యాడ్స్… యాడ్స్… యాడ్స్… వరుసగా స్పాన్సరర్స్ యాడ్స్ వేస్తే చూడటం లేదని అనుకున్నారేమో… పాటకూ పాటకూ నడుమ యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్, కంటెంటుతో సహా… అప్పుడప్పుడూ సిల్లీ గేమ్స్ కూడా… ఇక రెగ్యులర్ యాడ్స్ సరేసరి… ఒక్కోసారి వరుసగా నాలుగు యాడ్స్… ఈసారి షో జస్ట్ ఫర్ యాడ్స్… నడుమ నడుమ ఒకటీరెండు పాటలు అన్నట్టుగా సాగింది…
ఓ ఎపిసోడ్‌లో కార్తీక్ లేడు… ఓసారి తమన్ మధ్యలోనే మాయం అయిపోయాడు… అసలు ఈసారి ఎవరికీ ఈ షో మీద ఆసక్తి లేదు… ఏదో ఓ సీజన్ నడిపించేశాం అన్నట్టుగా ముగించారు… ఇదే ధోరణి గనుక వచ్చే అయిదో సీజన్‌కు కనబరిస్తే (ఐదో సీజన్ ఉంటే) ఇంకా ఫ్లాప్ కావడం ఖాయం…
అసలు షో నిర్వహణలోనే వీసమెత్తు జోష్ కనిపించకపోతే ఇక ప్రేక్షకుడికి ఏముంటుంది..? దీనికోసం ఓటీటీ సబ్‌స్క్రయిబ్ చేసుకుని, ఓపెన్ చేయాల్సినంత ఆసక్తి ఎందుకు కలుగుతుంది..? జీతెలుగులో సరిగమ షోను ఎలాగూ కామెడీ, ఫన్ షో చేశారు… ఇప్పుడిక ఇదీ అంతే…
పాటలు పాడుతుంటే ఆ గ్రూప్ డాన్సర్లు దేనికి..? ఏదో స్టేజ్ మీద పర్‌ఫామెన్స్‌లు దేనికి..? విచిత్రంగా ఈసారి ఆర్కెస్ట్రా మెరుపులు కూడా జీరో… ప్యాడిస్టు పవన్, వయోలినిస్టు కామాక్షి కూడా వెలవెలబోయారు… ప్చ్, మొత్తానికి విజయవంతంగా నాలుగో సీజన్‌ను భ్రష్టుపట్టించారు… హమ్మయ్య, ముగించారురా బాబూ..!!
చివరగా…. ఓ మార్కెటింగ్ మిత్రుడు గోపు విజయకుమార్ రెడ్డి చెప్పినట్టు…. ఏదయినా ఒక రియాలిటీ షో హిట్ కావాలంటే ముందుగా అది ఆడియన్స్ ఎమోషన్స్ ని పట్టుకోగలగాలి… కానీ తెలుగులో అదే మిస్ అయ్యింది… హిందీ ఫస్టు ఎపిసోడ్ చూస్తే (ఈ తాజా సీజన్), మీరు నవ్వుతారు, ఏడుస్తారు, కంటెస్టెంట్ పైన ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది…
అన్నిటికంటే ఇంపార్టెంట్, పార్టిసిపెంట్స్ బ్యాక్ గ్రౌండ్, ప్రతి ఒక స్టోరీ మనకి నిజ జీవితంలో తగిలేదే… అందుకే కనెక్ట్ అయ్యిపోతాం మనం… శ్రేయా గోషాల్, విశాల్ దడ్లని… జడ్జిలకన్నా వాళ్లు మెంటార్స్… అదీ తేడా…
ఆహా ఓటీటీ క్రియేటివ్ టీమ్ కాస్త శ్రద్ధగా హిందీ ఇండియన్ ఐడల్ చూస్తే… ఏం చేయాలో కర్తవ్యబోధ కలుగుతుంది…!! తమన్… వింటున్నావా..?
Share this Article